నా క్లీవేజ్ చూపించకు.. బిగ్‌బాస్ వేదికపై సల్మాన్‌ను ఆటపట్టించిన ఆలియా, ఎన్టీఆర్, రాంచరణ్

దర్శక ధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలిసి దేశవ్యాప్తంగా RRR ప్రమోషన్స్‌ను మోత మోగిస్తున్నారు. ఇటీవల ముంబైలో పర్యటించిన వారు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ హిందీ షోలో పాల్గొన్నారు. ఈ షోలో అలియా భట్, రాంచరణ్, ఎన్టీఆర్ చేసిన హంగామా క్రేజీగా మారింది. బిగ్‌బాస్ వేదికపై నుంచి ఇంటి సభ్యులతో మాట్లాడారు. అలాగే సినిమా గురించిన విశేషాలను ఇంటి సభ్యులతో పంచుకొన్నారు. అయితే ఈ వేదికపై సల్మాన్ ఖాన్‌తో ఆలియా భట్ చేసిన చిలిపి పనులు ఇలా ఉన్నాయి.

Alia Bhatt, Ram Charan, NTR fun moments with Salman Khan at Bigg Boss 15

సల్మాన్ ఖాన్‌తో కలిసి ఎన్టీఆర్, రాంచరణ్, ఆలియాభట్ స్టెప్పులు వేశారు. తెలుగులో సూపర్ హిట్ అయిన నాటు నాటు సాంగ్‌ హిందీ వెర్షన్ నాచో నాచో పాటకు మాస్ స్టెప్పులు వేశారు. అయితే ఎన్టీఆర్, రాంచరణ్ వేసిన స్టెప్పులను సల్మాన్ ఖాన్ నానా కష్టాలు పడ్డారు. మీ రేంజ్‌లో నేను స్టెప్పులు వేయలేను. ఇక ఆపండి.. నేను అంత ఫాస్ట్‌గా స్టెప్పులు వేయలేను. నాకు డ్యాన్సులో బేసిక్స్ నేర్పండి అంటూ సల్మాన్ వేడుకొన్నారు. ఆలియాతో ప్రామిస్ చేస్తూ.. త్వరలోనే నేను చెర్రీ, ఎన్టీఆర్ కంటే గొప్పగా డ్యాన్స్ చేస్తాను అని చెప్పారు.

RRR ప్రమోషన్స్ చేస్తూ సల్మాన్ ఖాన్‌ను ఆలియాభట్ ఆటపట్టించారు. సల్మాన్ ఖాన్ షర్ట్ గుండీలు విప్పడంతో నా క్లీవేజ్ చూపించకు అంటూ ఆలియాను సల్మాన్ ఆటపట్టించారు. అలా ఆలియా, సల్మాన్ బిగ్బాస్ ఇంటి వేదికపై హంగామా చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Alia Bhatt, Ram Charan, NTR fun moments with Salman Khan at Bigg Boss 15

బిగ్‌బాస్ వేదికపై సల్మాన్ ఖాన్ ముందస్తు జన్మదిన వేడుకలు కూడా నిర్వహించారు. సల్మాన్ ఖాన్ ఖాన్ బర్త్ డే డిసెంబర్ 27. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని సల్మాన్ జన్మదిన వేడుకలను బిగ్‌బాస్ వేదికపై RRR టీమ్ జరిపింది. ఈ ఎపిసోడ్ డిసెంబర్ 25, 26 తేదీల్లో ప్రసారం కానున్నది.

ఇదిలా ఉండగా, RRR సినిమా జనవరి 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా సినిమా ప్రమోషన్స్‌ను భారీగా నిర్వహిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X