అలీ షోలో రేణు దేశాయ్: రూపాయి ఇవ్వలేదు, ఆద్య లేకుంటే చచ్చిపోతా!

Recommended Video

Renu Desai Got Emotional In Alitho Saradaga Promo || Filmibeat Telugu

'అలీతో సరదాగా' అనే కార్యక్రమం రాబోయే ఎపిసోడ్ హయ్యెస్ట్ రేటింగ్స్ సొంతం చేసుకుంటుందేమో? ఎందుకంటే.. ఈ సారి ఈ షోలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కనిపించబోతున్నారు. తాజాగా విడుదలైన ప్రోమో ఈ షోపై అంచనాలు అమాంతం పెంచేసింది. రేణు నుంచి అలీ పలు ఆసక్తికర విషయాలు రాబట్టారు.

పవన్ కళ్యాణ్, అలీ మధ్య జరుగుతున్న పొలిటికల్ వార్ ఎంత పెద్ద సెన్సేషన్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలీపై పవన్ కళ్యాణ్ కామెంట్స్ చేయడం... అందుకు అలీ కౌంటర్ ఇవ్వడం తెలిసిందే. ఈ నేపథ్యంలో 'అలీతో సరదాగా' షోలో రేణు దేశాయ్ వీరి మధ్య జరిగిన గొడవ గురించి కూడా ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

ఆ పేరంటే ఇష్టం లేదు

ఆ పేరంటే ఇష్టం లేదు

మీకు ‘రేణు' అనే పేరు ఇష్టం లేదంట కదా? ఎందకు అంటూ అలీ ప్రశ్నించగా... ‘అవును.. నాకు ఆ పేరు అంటే ఇష్టం లేదు. రేవతి లేదే రేవ అని పెడితే బావుండేదు. రేణు అనే పేరు ఎందుకు నచ్చలేదు' అని సమాధానం ఇచ్చారు.

ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు

ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు

అందరి కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే ఎడిటర్ మీరే అంటకదా? అనే ప్రశ్నకు రేణు దేశాయ్ స్పందిస్తూ... ‘నేను జానీ, ఖుషి సినిమాలకు ఎడిటర్‌గా చేశాను. ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఎస్.జె సూపర్య గారు, రత్నంగారు, మా ఎక్స్ హస్బెండ్ కళ్యాణ్ గారే అందుకు సాక్ష్యం.'' అని తెలిపారు.

రెండో పెళ్లి చేసుకుంటే తప్పేంటి?

రెండో పెళ్లి చేసుకుంటే తప్పేంటి?

మగవాళ్లు రెండో పెళ్లి చేసుకున్నపుడు ఆడవారు ఎందుకు చేసుకోకూడదు అని ఒక పోస్ట్ మీరు పెట్టారు కదా.. మీరు త్వరలో మరో పెళ్లి చేసుకోబోతున్నారా?.. అంటూ ఆమె నుంచి అలీ మరిన్ని విషయాలు రాబట్టే ప్రయత్నం చేశారు. ‘‘అవును, ఆల్రెడీ మరొకరితో ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. సోషల్ మీడియాలో ఆ విషయం పెట్టిన తర్వాతే పెద్ద హడావుడి జరిగింది. నా రెండో పెళ్లి కూడా ఒక పెద్ద డిస్క్రషన్. దీన్ని నేను రహస్యంగా చేసుకోవడం లేదు. ఇదేమీ దొంగపని కాదు.'' అని రేణు దేశాయ్ సమాధానం ఇచ్చారు.

ఆద్య లేకుంటే చచ్చిపోతా

ఆద్య లేకుంటే చచ్చిపోతా

మీరు పుట్టినపుడు ఆసుపత్రికి మీ తండ్రి రాలేదంట కదా? ఎందుకు? అంటూ... అలీ ప్రశ్నించగా.. ‘‘అవును, మీరు విన్నదినిజమే, అమ్మాయి పుట్టిందనే కోపంతో మా నాన్న రాలేదు. నేను చాలా లక్కీ ఉమెన్, ఎందుకంటే నాకు ఆద్యా లాంటి కూతురు ఉంది. ఆద్య లేకుండా నేను ఉండలేను. చచ్చిపోతానేమో'' అంటూ రేణు దేశాయ్ కన్నీరు పెట్టుకున్నారు.

పవన్-అలీ గొడవ గురించి

పవన్-అలీ గొడవ గురించి

ఈ సందర్భంగా రేణు దేశాయ్ అలీని ఓ ప్రశ్న అడిగారు. ‘మీకు, కళ్యాణ్ గారికి చాలా పెద్ద గొడవ అయిందని విన్నాను. నిజంగానే అయిందా?' అని ప్రశ్నించగా అలీ ‘అవును' అని చెప్పడంతో ఈ ప్రోమో ఎండ్ అయింది. పూర్తి షో త్వరలో ప్రసారం కాబోతోంది. చివరి ప్రశ్న షోపై అంచనాలు మరింత పెంచేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X