కమెడియన్ అలీకి సినిమా జన్మనిచ్చింది ఈవిడే..
'అలీతో సరదాగా' పేరుతో సెలబ్రిటీ టాక్ షో హోస్ట్ చేస్తున్న కమెడియన్ అలీ ఈ సారి తన షోకు ప్రముఖ సీనియర్ నటి విజయలలితను ఆహ్వానించారు. ఈ షో వచ్చే వారం ప్రసారం కాబోతోంది. తాజాగా విడుదలైన ప్రోమోలో కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
నాకు జన్మనిచ్చింది నా తల్లి అయితే... సినిమా జన్మనిచ్చింది ఈ తల్లి అని విజయలలిత గురించి అలీ చెప్పుకొచ్చారు. మా నాన్నగారితో మీ అబ్బాయిని మాకు ఇస్తారా? పెంచుకుంటాం అని అప్పట్లో అనేవారని, మా నాన్నగారు ఇద్దరు ఆడ పిల్లల తర్వాత వాడు పుట్టాడు. నాకూ ఒకడే కొడుకు అనే వారని గుర్తు చేసుకున్నారు.

విజయశాంతి చిన్మమ్మ
ఈ సందర్బంగా చాలా మందికి తెలియని ఓ ఆసక్తికర విషయం అలీ వెల్లడించారు. నటి విజయశాంతికి... విజయలలిత చిన్నమ్మ అవుతారని తెలిపారు. అలీ వ్యాఖ్యలను బట్టి ఆవిడ ద్వారానే విజయ శాంతి సినిమా రంగంలోకి అడుగు పెట్టినట్లు తెలుస్తోంది.

తెలుగు ఇండస్ట్రీలో లేడీ జేమ్స్ బాండ్
తెలుగు ఇండస్ట్రీలో లేడీ జేమ్స్ బాండ్ అంటే అప్పట్లో విజయలలితగారే అని తెలిపారు. అలీ వ్యాఖ్యలపై ఆమె స్పందిస్తూ.. నేను అప్పట్లో గుర్వపుస్వారీ బాగా చేసేదాన్ని. బ్రేక్ టైమ్‌లో కూడా గుర్రం మీద నుంచి దిగేదాన్ని కాదు. దాని మీదే కూర్చుని భోజనం చేసేదాన్ని అని తెలిపారు.

వ్యాంపు క్యారెక్టర్లతో మొదలై...
ఇండస్ట్రీకి రావడంతో హీరోయిన్ కాలేదని.. మొదట్లో వ్యాంపు క్యారెక్టర్లు చేసి ఆ తర్వాత హీరోయిన్ స్థాయికి ఎదిగినట్లు విజయలలిత చెప్పుకొచ్చారు. జేమ్స్ బాండ్ కాన్సెప్ట్ సినిమాలు తనకు మంచి గుర్తింపు తెచ్చాయని తెలిపారు.

అప్పట్లో నా సోలో సాంగులకు భలే డిమాండ్
అప్పట్లో నా సోలో సాంగులకు భలే డిమాండ్ ఉండేది. వాటిని ఐటం సాంగ్ అనే వారు కాదు. సోలో సాంగ్ అనేవారు. విజయలలిత గారిది ఒక్క సాంగైనా ఉంటేనే మేము సినిమాను కొంటాం అనే డిమాండ్ చేసేవారు అని విజయలలిత గుర్తు చేసుకున్నారు.


Click it and Unblock the Notifications











