Bigg Boss Telugu 7: అంతా కలిసి శోభాశెట్టిని కార్నర్ చేసేశారుగా.. ఇదంతా శివాజి మైండ్ గేమేనా?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఉల్టా పుల్టాగా వచ్చి అదరగొడుతోంది. అద్భుతమైన టాస్కులు, అంతకు మించిన హీటెడ్ ఆర్గుమెంట్స్ తో రసవత్తరంగా సాగుతోంది. ముఖ్యంగా ఎవరికి వారు గేమ్ లో గెలిచేందుకు చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే మాత్రం ఆహా అనిపిస్తోంది. తమ స్థాయికి తగ్గట్లుగా, తెలిసినట్లుగా గేమ్ ను మార్చుకుంటూ దుమ్ములేపుతున్నారు. మరోవైపు బిగ్ బాస్ టీం నిర్వాహకులు కూడా టీఆర్పీ పెంచుకునేందుకు అనేక స్టంట్లు చేస్తున్నారు. అయితే 11వ వారంలో భాగంగా ర్యాంకిగ్స్ ఇచ్చి మరీ ఎవిక్షన్ పాస్ కోసం బిగ్ బాస్ టాస్కులు ఇస్తున్నాడు.

ఈక్రమంలోనే బిగ్ బాస్ ఇంట్లో ఫుల్లుగా గొడవలు జరగ్గా... అంతా కలిసి శోభాశెట్టిని టార్గెట్ చేశారు. ఇన్నాళ్లూ తనతో కలిసి గ్రూప్ గేమ్ అడిన, ఫుల్ క్లోజ్ ఫ్రెండ్స్.. అమర్ దీప్, ప్రియాంక జైన్ కూడా ఆమెదే తప్పని తేల్చారు. దీంతో శోభాశెట్టి ఇంట్లో ఒంటరిగా మిగిలిపోయింది. ఏం చేయాలో పాలుపోక ఏడుస్తుంది. అయితే కంటెస్టెంట్లు అందరూ శోభా శెట్టిపై ఫైర్ అవడానికి, ఆమెను కార్నర్ చేయడానికి మాత్రం శివాజియే కారణం. అదెలాగో మనం ఇప్పుడు తెలుసుకుందాం రండి.

 All Contestants Cornered Shobha Shetty About Sivaji Issues on Ball Balencing Task in Bigg Boss Telugu 7

ఎవిక్షన్ పాస్ కోసం పోటీ జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ టాస్క్ లో భాగంగానే ప్రిన్స్ యావర్, ప్రియాంక జైన్, శివాజిలు పోటీ పడ్డారు. బాల్ బ్యాలెన్సింగ్ అనే ఈ టాస్కులో వీరు పోటీదారులు కాగా.. పల్లవి ప్రశాంత్, శోభా శెట్టిలు సంచాలకులుగా వ్యవహరించారు. ఈక్రమంలోనే వీరు గేమ్ ఆడుతుండగా.. శోభా శెట్టి తరచుగా సైగల్ చేయడం, అరవడం చేసింది. ఆమె చేసిన డిస్ట్రబెన్స్ వల్లే తాను ఓడిపోయినట్లు శివాజి భావించి ఫైర్ అయ్యాడు. ముఖ్యంగా ప్రియాంక జైన్ బాల్స్ కింద పడిపోయాకే.. శివాజివి పడిపోయాయి. కానీ వీరిలోంచి ఓడిపోయిన వారిని తొలగించాలని బిగ్ బాస్ చెప్పగా.. శోభాశెట్టి శివాజిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది.

పల్లవి ప్రశాంత్ తో ఎవరు ఓడిపోయారు నీ దృష్టిలో అనగా ప్రియాంక జైన్ అన్నట్లుగా చెప్పకనే చెప్పాడు. కానీ శోభా శెట్టి మాత్రం రైతుబిడ్డపై ఫైర్ అయింది. ఇక ఆ తర్వాత శివాజిని ఆటలోంచి తొలగిస్తున్న ప్రకటించగా... శివాజి గట్టిగా ఫైర్ అయ్యాడు. ఇప్పటికే నీవు మూడు సార్ల సంచాలక్ గా ఫేల్ అయ్యావంటూ గుర్తు చేశాడు. ఆ తర్వాత మాట్లాడిన అమర్ దీప్ కూడా మీరు సరిగ్గా చూడలేదని నాకనిపిస్తోంది.. అందువల్లే తప్పుడు డెసీషన్ తీసుకున్నారు.. ఇది సంచాలక్ తప్పేనని అన్నాడు. దీంతో హర్ట్ అయిన శోభాశెట్టి మరింత రెచ్చిపోయింది.

 All Contestants Cornered Shobha Shetty About Sivaji Issues on Ball Balencing Task in Bigg Boss Telugu 7

అంబటి అర్జున్, ప్రియాంక జైన్. అమర్ దీప్ ఇలా అందరూ శివాజికి సపోర్ట్ చేశారు. శోభా శెట్టి మాత్రమే తప్పు చేసినట్లు చెప్పకనే చెప్పారు. అది జీర్ణించుకోలేకపోతున్న శోభాశెట్టి బాగా ఏడుస్తోంది. ముఖ్యంగా ఎవరూ లేని చోట బాత్రూంలోకి వెళ్లి మరీ ఒంటరిగా ఫీల్ అవుతూ కన్నీరు పెట్టుకుంటుంది. ఇదంతా చూస్తుంటే మాత్రం శోభాశెట్టిని కార్నర్ చేసి అంతా గేమ్ ఆడుతున్నట్లు అర్థం అవుతోంది. ఈరోజుటి ఎపిసోడ్ పూర్తిగా చూస్తే తప్ప అసలు విషయం ఏంటి అనేది తెలియదు.

 All Contestants Cornered Shobha Shetty About Sivaji Issues on Ball Balencing Task in Bigg Boss Telugu 7

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X