Bigg Boss Telugu 7: అంతా కలిసి అమర్‌కు షాకిచ్చారుగా.. నిజంగానే లక్కు లేదా, ఫినాలే అస్త్ర ఎవరికి దక్కింద

టికెట్ టు ఫినాలే టాస్క్ తో బిగ్ బాస్ ఇంట్లో ఊహించని గొడవలు జరుగుతున్నాయి. ఇంత కాలం పాటు స్నేహంగా మెలిగిన వారంతా గొడవలు పెట్టుకుంటూ రచ్చ రచ్చ చేసుకుంటున్నారు. ముఖ్యంగా అమర్ దీప్ విషయంలో అయితే చాలా ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఆయన బిహేవియర్ కు తగ్గట్లుగా ఒక్కొక్కరూ ఒక్కోసారి షాకిస్తున్నారు. ఇటీవలే కెప్టెన్సీ టాస్క్ లో ఆయనను ఫుల్ హర్ట్ చేసిన వాళ్లు మరోసారి టికెట్ టు ఫినాలే టాస్క్ లో మరింత హర్ట్ చేస్తున్నారు. ఒక్కో టాస్క్ లో ఆయన మిగిలిన వాళ్లను ఇబ్బంది పెడుతుండగా... మరికొన్ని టాస్క్ లలో వాళ్లు ఈయనను ఇబ్బంది పెడుతున్నారు.

ముఖ్యంగా గాలం వెయ్ బంతిని లాగెయ్ టాస్క్ లో అమర్ దీప్ ప్రిన్స్ యావర్ తో పాటు ప్రియాంక జైన్ కు గట్టి షాకిచ్చాడు. వారి వద్ద నుంచి బాల్స్ లాక్కోవడానికి చాలా ఫైట్ చేశాడు. అయితే ప్రిన్స్ యావర్ పై అమర్ దీప్ గెలవలేకపోయాడు కానీ... ప్రియాంక జైన్ తో మాత్రం గెలిచాడు. ఆమెను ఓడించి మరీ బాల్ లాగేసుకున్నాడు. ఇలా ఆ రౌండ్ నుంచి ప్రియాంక జైన్ ఔట్ అయిపోయింది. తనకు షాకిచ్చిన అమర్ దీప్ కు ప్రియాంక జైన్ అంతకంటే ఎక్కువ షాకిచ్చింది.

All Contestants Get Shock to Amardeep in Ticket to Finale Task in Bigg Boss Telugu 7

గేమ్ నుంచి బయటకు వచ్చాక నీ పాయింట్లను ఎవరికి ఇస్తావని అడగ్గా... అమర్ దీప్ తనకే ఇస్తుందని అనుకున్నాడు. అంతేకాకుండా అదే విషయాన్ని శివాజికి కూడా చెప్పాడు. కానీ ప్రియాంక మాత్రం.. బిగ్ బాస్ అడిగిన వెంటనే తడుముకోకుండా ఆమె అన్న గౌతమ్ కృష్ణకు ఇస్తున్నట్లు చెప్పింది. దీంతో అమర్ దీప్ షాకయ్యాడు. ఆ తర్వాత చాలా ఫీలయ్యాడు. అదే విషయాన్ని శోభాశెట్టికి చెబుతూ కూడా బాగా హర్ట్ అయ్యాడు.

ఇక ఈరోజు ప్రొద్దున విడుదల అయిన ఫస్ట్ ప్రోమోలో ఎస్కేప్ టాస్క్ లో యావర్ ఓడిపోయాడు. ముందుగా పల్లవి ప్రశాంత్ గెలవగా.. యావర్ మాత్రం తన తాళం చెవి దొరక్క ఓడిపోయాడు. రేస్ నుంచి తప్పుకోగా.. తన పాయింట్లను పల్లవి ప్రశాంత్ కు ఇచ్చాడు. ఇక తాజాగా విడుదల అయిన రెండో ప్రోమోలో స్పై బ్యాచ్ అమర్ దీప్ కు గట్టి షాకిచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రైతుబిడ్డకు అడ్డుగా ఉన్న అమర్ దీప్ టచ్ అండ్ గెస్ టాస్క్ లో గెలిచాడు. అయితే ఆయన గెలవడంతో యావర్ అనుమానం వ్యక్తం చేశాడు.

All Contestants Get Shock to Amardeep in Ticket to Finale Task in Bigg Boss Telugu 7

కళ్లకు పెట్టిన మాస్క్ తీసుకొని అది పెట్టుకొని చూసి మరీ కళ్లు కనిపిస్తున్నాయని అన్నాడు. దీంతో అమర్ దీప్ చాలా హర్ట్ అయ్యాడు. నేను గేమ్ ఆడగానే అందరికీ ఇలాగే అనుమానాలు వస్తాయంటూ ఫైర్ అయ్యాడు. శివాజి కూడా మాస్క్ పెట్టుకుని మరీ చూశాడు. కనిపిస్తుందా లేదా అని. ఓసారి ప్రియాంక, రెండోసారి యావర్ ఇలా షాకివ్వడంతో అయోమయంలో పడిపోయాడు. కానీ టికెట్ టు ఫినాలే విన్నర్ గా మాత్రం అమర్ దీప్ యే గెలవబోతున్నట్లు అర్థం అవుతోంది. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X