Bigg Boss Telugu 7: ఆ విషయంలో హౌస్‌మేట్స్ అందరి సపోర్ట్ శివాజికే.. ఇది కదా అసలైన గెలుపు అంటే!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఏ ముహూర్తాన ప్రారంభం అయిందో తెలియదు కానీ అద్భుతమైన రెస్పాన్స్ తో దూసుకెళ్తోంది. ఎవరూ ఊహించని విధంగా ఈ షో సాగుతుండగా... మరో వారం రోజుల్లో షో ముగిసిపోనుంది. మరో ఎనిమిది రోజులు అయితే విన్నర్ ఎవరో తేలిపోవడంతో పాటు టాప్ 5లో ఎవరు ఉన్నారు, ఎవరు రన్నరప్ గా నిలవబోతున్నారని తెలుస్తుంది. అయితే ఇప్పటికే 13 వారాలు పూర్తి చేసుకున్న ఈ షో 14 వారం కూడా విజయవంతంగా పూర్తి చేసుకోబోతుంది. అయితే ఈక్రమంలోనే తొలిసారిగా ఇంట్లోని సభ్యులు అందరూ శివాజికి సపోర్ట్ చేశారు. ముఖ్యంగా స్పా బ్యాచ్ సపోర్ట్ చేయడం ఇదే మొదటి సారి. అయితే ఏ విషయంలో అంతా శివాజికి సపోర్ట్ చేశారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

14వ వారంలో భాగంగా అమర్ దీప్ ను కెప్టెన్ చేసిన బిగ్ బాస్... ఓటింగ్ అప్పీల్ టాస్క్ పెట్టాడు. ఫన్ టాస్క్ లు అని చెబుతూనే.. కంటెస్టెంట్ల మధ్య విపరీతమైన గొడవలు పెడుతున్నాడు. ఇంత కాలం పాటు రాని గొడవలన్నీ ఈ వారంలోనే వస్తున్నాయి. ముఖ్యంగా గ్రూపుగా ఉన్న వారి మధ్యే పెద్ద ఎత్తున గొడవ జరుగుతుంది. అయితే తాజా ఎపిసోడ్ లో కూడా అమర్ దీప్, శోభాశెట్టిలకు పెద్ద గొడవ జరిగింది. అంతకు ముందే శివాజి, శోభా శెట్టిల మధ్య కూడా పెద్ద ఫైట్ జరిగింది. ఇక దాని తర్వాత జరిగిన ఫన్ టాస్క్ లో అంబటి అర్జున్, శివాజులు గెలిచారు.

All Housemates Support to Sivaji in Vote Appeal Task in Bigg Boss Telugu 7 Check Details

ఇలా తొలిసారిగా శివాజి, అంబటి అర్జున్ ల మధ్య పోటీ నెలకొనగా... హౌస్ మేట్స్ అంతా తమ అభిప్రాయాలు, కారణాలు చెబుతూ... ఎవరు ఓటింగ్ అప్పీల్ చేసుకోవడానికి అర్హులే తేల్చాలని బిగ్ బాస్ వివరించారు. ఈక్రమంలోనే ముందుగా వచ్చిన శోభా శెట్టి.. తొలిసారి శివాజికి సపోర్ట్ చేసింది. ఇప్పటికే అంబటి అర్జున్ ఓసారి ఓటింగ్ అప్పీల్ చేసుకోవడం వల్ల ఈసారి ఛాన్స్ శివాజికి ఇస్తున్నట్లు వెల్లడించింది. ఇక ఆ తర్వాత వచ్చి పల్లవి ప్రశాంత్ కూడా శివాజికే సపోర్ట్ చేస్తున్నట్లు చెప్పాడు. ఆ తర్వాత వచ్చిన అమర్ దీప్ కూడా శివాజి అన్న తనకు సపోర్ట్ చేశాడని.. అది తీర్చుకునే సమయం వచ్చిందంటూ సపోర్ట్ చేశాడు.

ఇక తర్వాత వచ్చిన ప్రిన్స్ యావర్... అందరూ ఊహించినట్లుగానే శివాజికి సపోర్ట్ చేశాడు. ఇక ఆ తర్వాత అంటే చివర్లో వచ్చిన ప్రియాంక జైన్ కూడా శివాజికే సపోర్ట్ చేసింది. ఓటింగ్ అప్పీల్ ఇప్పటి వరకు శివాజి చేసుకునే అవకాశం రాలేదు కాబట్టే ఆయనకు ఛాన్స్ ఇస్తున్నట్లు పేర్కొంది. ఇలా అందరి మద్దుతును కూడగట్టుకున్న శివాజి తొలిసారి ఓటింగ్ అప్పీల్ చేసుకున్నాడు. ప్రజలంతా తనకు ఓట్లు వేసి గెలిపించాలని కోరాడు. అయితే ఈ సారి సీజన్ విన్నర్ రేస్ లో పల్లవి ప్రశాంత్, శివాజులు ఉండగా... ఎవరు విన్నర్ అవుతారనేది మరో వారం రోజుల్లో తెలిసిపోతుంది.

మొదటి నుంచి అద్భుతమైన గేమ్ ఆడుతూ... అందరి మన్ననలు పొందుతున్నాడు శివాజి. ఇంట్లో శివాజిని వ్యతిరేకించే వారు చాలా మందే ఉన్నా.. సపోర్ట్ మాత్రం బాగానే చేస్తున్నారు. టాప్ 10 టాస్క్ లో కూడా అంతా కలిసి ఆయనను టాప్ 1 లో నిలబెట్టారు. ఇప్పుడు కూడా అంతా సపోర్ట్ చేసి ఓటింగ్ అప్పీల్ టాస్క్ లో గెలిపించారు. ఇక అలాగే ఆయనను విన్నర్ కూడా చేస్తారని అనిపిస్తోండి. చూడాలి మరి ఏం జరనగనుంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X