సుధీర్ ఫ్యాన్స్ కి బాడ్ న్యూస్.. జబర్దస్త్ కు గుడ్ బై.. ఆయనతో పాటు వాళ్ళు కూడా... అసలు ఇంత సడన్ గా ఏమైందంటే?

తెలుగు బుల్లితెరపై ఈ మధ్య ఎంతో మంది కొత్త వాళ్లు ఎంట్రీ ఇస్తున్నా వాళ్లందరి పోటీని తట్టుకుని నిలబడడంతో పాటు టెలివిజన్‌ రంగంలో స్టార్‌గా వెలుగొందుతున్నాడు సుడిగాలి సుధీర్. చేతి నిండా షోలతో ఫుల్ బిజీగా గడుపుతున్న ఆయన ఫెమస్ అయింది మాత్రం జబర్దస్త్ అనే షో ద్వారానే. అయితే ఇప్పుడు ఆయన ఆ షోకి దణ్ణం పెట్టడానికి రెడీ అవుతున్నాడని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

జబర్దస్త్ క్రేజ్

జబర్దస్త్ క్రేజ్

తెలుగు బుల్లితెరపై కొన్నేళ్లుగా బ్రేక్ లేకుండా ప్రేక్షకులను నవ్విస్తున్న కామెడీ షో జబర్దస్త్ . ఈ షో తరువాత వేరే చానళ్లలో పలు కామెడీ ప్రోగ్రామ్‌లు వచ్చినప్పటికీ దీనిని ఇప్పటికీ బీట్‌ చేయలేకపోయాయి. ఇందులోని కమెడియన్స్‌కు కూడా షో చాలా మంచి పేరును తీసుకొచ్చింది. వారానికి రెండు రోజులు వచ్చే ఈ షో ద్వారా ఫేమస్ అయి ఇప్పుడు లక్షలు సంపాదిస్తున్న నటులు కూడా ఉన్నారు.

సుడిగాలి సుధీర్

సుడిగాలి సుధీర్

అలా ఎదిగి బయటకు వెళ్లిన వారూ ఉన్నారు. జబర్దస్త్ ద్వారా ఫేమస్‌ అయిన వారిలో సుడిగాలి సుధీర్‌ ముందు వరుసలో ఉంటాడన్న సంగతి తెలిసిందే. స్త్రీ లోలుడిగా ముద్ర వేయించుకున్న సుధీర్ స్కిట్స్ కోసమే ఎక్స్‌ట్రా జబర్ధస్త్‌ చూసే వాళ్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. జబర్దస్త్ కామెడీ షోకి ఎంతో మంది వచ్చారు వెళ్లిపోయారు. కానీ షో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు సుడిగాలి సుధీర్‌ జబర్దస్త్‌లోనే కొనసాగుతూనే ఉన్నాడు.

వరుస షోలతో

వరుస షోలతో

సుధీర్‌, ఆటో రాంప్రసాద్‌, గెటప్‌ శ్రీను కూడా కలిసి చేసే స్కిట్లు అందరినీ ఆకట్టుకుంటూ ఉంటాయి. ఇటు శ్రీదేవి డ్రామా కంపెనీ సహా మల్లెమాలకు సంబంధించిన షోలు చేస్తూ సమయం కుదిరినప్పుడల్లా సినిమాల్లో నటిస్తున్నాడు. ముందు నుంచి కూడా అనేక ఇతర కామెడీ షోలలో ఆఫర్లు వచ్చినా వాటిని రిజక్ట్‌ చేసి ఇక్కడే ఉండిపోయిన సుధీర్ జబర్దస్త్‌ను మాత్రం వదల్లేదు.

నిన్నటి నుంచే అలానే

నిన్నటి నుంచే అలానే

అయితే సుధీర్ జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేస్తాడు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. సుడిగాలి సుధీర్ జబర్దస్త్ నుంచి తప్పుకుంటున్నాడని, జబర్దస్త్ జర్నీకి శుభం కార్డ్ పడనుందని టాక్‌ వినిపిస్తోంది. అయితే సడెన్‌గా సుధీర్‌ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు అనే విషయం మీద అసలు నిజానిజాలు ఏమిటి ? అనే విషయాలు వెల్లడి కాలేదు.

 అందుకే బై?

అందుకే బై?

అందుతున్న సమాచారం మేరకు సినిమాల్లో మంచి మంచి అవకాశాలు వస్తున్నా జబర్దస్త్ వలన సరిగా ద్రుష్టి పెట్టలేక పోతున్నడని అంటున్నారు. ప్రస్తుతం హీరోగా సుధీర్‌ మూడు సినిమాలు చేస్తున్నాడు. వీటితోపాటు కమెడియన్‌గా కూడా చాలా సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. దీంతో ఇటు షో అటు సినిమా.. రెండు బ్యాలెన్స్ చేయడం కుదరకపోవడంతో తన అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుంటున్నాడని తెలుస్తోంది. కానీ సుధీర్‌ బయటకు వస్తే ఆయనతో పాటు గెటప్ శీను, ఆటో రాంప్రసాద్ కూడా బయటికి వచ్చే ఛాన్స్‌ ఉందని అంటున్నారు.

 వాళ్ళు కూడా?

వాళ్ళు కూడా?

ఎందుకంటే ముందు నుంచి ముగ్గురి కాంబోని జనం ఇష్టపడేవారు. సుధీర్ కారణంగా వాళ్ళు కూడా జబర్దస్త్ నుంచి వెళ్లిపోవాల్సిన పరిస్థితులు వస్తే ఆ టీమ్ మొత్తం లేచిపోతుంది.లేదా సుధీర్‌ వెళ్లిపోతే.. శ్రీను, రాంప్రసాద్‌లో ఒకరు టీం లీడర్‌ అయ్యి కొత్తవాళ్లను తీసుకునే అవకాశం ఉంది. కానీ ఇది అంతా ప్రస్తుతానికి పుకారు కాగా సుధీర్‌ అయితే స్పందించలేదు.


More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X