బిగ్ బాస్ సీజన్ 6 ప్రకటనకు రంగం సిద్దం.. ఈసారి వారికి కూడా అవకాశం.. ఎప్పుడంటే?

తెలుగులో బిగ్ బాస్ షో ఎంత విజయవంతమైనది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరే రియాలిటీ షో తెచ్చుకో లేనంత క్రేజ్ ఈ బిగ్ బాస్ రియాల్టీ షో సాధించింది.. అందుకే ఇప్పటికే ఐదు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ బిగ్ బాస్ ఓటిటి సీజన్ కూడా ప్రస్తుతం నడుస్తున్నది. దానికి బిగ్బాస్ నాన్ స్టాప్ గా నామకరణం చేశారు మొదట్లో ఈ సీజన్ పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ ప్రస్తుతానికైతే ప్రేక్షకులను తన వైపు తిప్పుకోవడంలో విజయం సాధించింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు బిగ్ బాస్ సీజన్ 6 కూడా ప్రసారం చేయడానికి సిద్ధం అవుతున్నారని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.

ఎన్టీఆర్ హోస్ట్ గా

ఎన్టీఆర్ హోస్ట్ గా


ఎక్కడో విదేశాల్లో పుట్టిన బిగ్ బ్రదర్ అనే ఒక షోని ఆధారంగా చేసుకుని హిందీలో బిగ్ బాస్ పేరిట కొన్ని సంవత్సరాల క్రితమే ఈ రియాలిటీ షో తీసుకువచ్చారు. హిందీలో విజయవంతం కావడంతో దాదాపు అన్ని దక్షిణాది భాషలలోనే కాకుండా పలు ప్రాంతీయ భాషలలో కూడా దీనిని నిర్వహిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా తొలుత జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా 2017 సీజన్ లో మొట్టమొదటి తెలుగు సీజన్ ప్రారంభమైంది.

నాగార్జునను రంగంలోకి

నాగార్జునను రంగంలోకి


ఒక సీజన్ హోస్ట్ చేసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ స్థానం నుంచి తప్పుకున్నారు. ఇక ఆ తర్వాత ఏడాది నేచురల్ స్టార్ నాని రంగంలోకి దిగాడు. రెండో సీజన్ నాని హోస్ట్ చేశారు అయితే ఎన్టీఆర్ కంటే నాని ప్రదర్శన అంతగా జనానికి నచ్చకపోవడంతో మార్చాలని భావించిన బిగ్ బాస్ యాజమాన్యం దానికి ఎవరు సరిపోతారు శోధించి ఎట్టకేలకు నాగార్జునను రంగంలోకి దించారు.

బిగ్ బాస్ ఒటీటీ కూడా

బిగ్ బాస్ ఒటీటీ కూడా


అలా సీజన్ త్రీ కోసం రంగంలోకి దిగిన నాగార్జున ఎలాంటి గ్యాప్ లేకుండా సీజన్ ఫోర్ తో పాటు సీజన్ ఫైవ్ కూడా పూర్తి చేశారు. సీజన్ ఫైవ్ ఫినాలే సందర్భంగా బిగ్ బాస్ ఒటీటీ కూడా తీసుకు వస్తున్నాము అని ప్రకటించారు నాగార్జున.

 కామన్ మ్యాన్ కూడా

కామన్ మ్యాన్ కూడా


బిగ్ బాస్ నాన్ స్టాప్ ప్రసారమవుతున్న ఆ షో కి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ సీజన్ తో సంబంధం లేకుండా టెలివిజన్ సీజన్ కూడా ఉంటుందని అప్పట్లోనే క్లారిటీ ఇచ్చారు. ఇక తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఆరో సీజన్ ప్రతి ఏడాది జరిగే దాని కంటే కొంచెం ముందు ప్రారంభమయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అంతే కాక ఈ సారి సీజన్ సిక్స్ లో అనేక మంది బడా సెలబ్రిటీలతో పాటు ఒకరిద్దరు కామన్ మ్యాన్ కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

అధికారిక ప్రకటన

అధికారిక ప్రకటన


గతంలో అలాగే కొంతమంది కామన్ మేన్స్ పేరిట లోపలికి వెళ్లారు కానీ సత్తా చాట లేకపోయారు. మరి ఈ సారి ఎలా ఉండబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇక దీనికి సంబంధించిన ప్రకటన బుధవారం నాడు చేసే అవకాశం కనిపిస్తోంది.తెలుగు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ ఒక అధికారిక ప్రకటన చేయాల్సి ఉందని పేర్కొనడంతో అది ఇదేనంటూ ప్రచారం జరుగుతోంది. అందులో ఎంత నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X