Just In
- 4 hrs ago
ఆనందంలో తప్పు చేసేసింది!.. అయన అలా రిక్వెస్ట్ చేశారంటూ చెబుతోన్న అషూ రెడ్డి
- 4 hrs ago
బిగ్‌బాస్ సీజన్ 5లో శ్రీరెడ్డి.. కంటెస్టెంట్లకు భారీగా ఆఫర్లు.. శరవేగంగా ఏర్పాట్లు..
- 4 hrs ago
రొమాంటిక్ లుక్స్‌తో అదరగొట్టిన పూర్ణ.. వైరల్‌గా బ్యాక్‌డోర్ టీజర్
- 5 hrs ago
పొట్టి బట్టల్లో ఫిదా చేసింది.. లావణ్య త్రిపాఠిని ఇలా ఎప్పుడూ చూసి ఉండరు!
Don't Miss!
- News
ప్రేమోన్మాది ఘాతుకం: ఇంటికెళ్లి లేడీ టెక్కీ గొంతుకోశాడు, బాధితురాలికి బండి సంజయ్ పరామర్శ
- Finance
బంగారం ధర రూ.50,000కు చేరుకునే ఛాన్స్! రూ.45,500 వద్దనే ధరలు
- Sports
ఇంగ్లండ్‌లోనూ రెండు రోజుల్లో ముగుస్తాయి.. పిచ్‌పై ఫిర్యాదు చేయడానికి ఏంలేదు: ఆర్చర్
- Lifestyle
లైంగిక సంపర్కం సమయంలో మహిళలు చేసే ఈ పనులు పురుషులను ఉద్వేగానికి గురి చేస్తుంది!
- Automobiles
2021 ఫిబ్రవరిలో పుంజుకున్న మహీంద్రా ట్రాక్టర్ అమ్మకాలు.. కారణం ఇదేనా!!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రోజాతో ఆ కోరిక మిగిలిందట.. స్టేజ్ మీదే అల్లరి నరేష్ అలా చేయడంతో అంతా షాక్
అల్లరి నరేష్ ఇప్పుడు మంచి జోరు మీదున్నాడు. నాంది సినిమా హిట్ అవ్వడంతో పూర్వ వైభవం వచ్చింది. తాజాగా అల్లరి నరేష్ నాంది సినిమా విషయంలో కాకుండా మరో విషయంలో ట్రెండ్ అవుతున్నాడు. తన సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అల్లరి నరేష్ జబర్దస్త్ షోలో గెస్ట్‌గా వచ్చాడు. అక్కడి వచ్చిన ఈ అల్లరోడు అల్లరల్లరి చేసేశాడు. నరేష్ చేసిన పనికి అందరూ షాక్ అయ్యారు.
ఇంతకీ అల్లరి నరేష్ ఏం చేశాడో ఓ సారి చూద్దాం.

జబర్దస్త్ షోలో అలా..
సినిమా ప్రమోషన్స్ కోసం జబర్దస్త్ వంటి షోలను వాడుకుంటూ ఉంటారన్న సంగతి తెలిసిందే. సినిమా హీరో, దర్శకుడు, హీరోయిన్ ఇలా ఎవరో కొందరు వస్తుంటారు. అయితే వచ్చే వారం నాంది హీరో అల్లరి నరేష్, దర్శకుడు విజయ్ గెస్ట్‌లుగా వచ్చారు.
నేచురల్ బ్యూటీ సాక్షి అగర్వాల్ లేటేస్ట్ ఫోటోలు..

మంచి నటన..
అల్లరి నరేష్ ఓ కామెడీ సినిమా చేస్తే.. సినిమాలో కామెడీ బాగుందని అంటారు కానీ.. కామెడీ బాగా చేశారని అనరు.. అదే గమ్యం, శంభో శివ శంభో వంటి చిత్రాలైతే అల్లరి నరేష్ బాగా నటించాడురా అని గుర్తిస్తారంటూ చెప్పుకొచ్చాడు.

అలా ఎత్తేశాడు..
జడ్జ్‌గా ఉన్న రోజా స్టేజ్ మీదకు ఎక్కిందంటే దడదడలాడిస్తుంటుంది. రోజా డ్యాన్సులు వేస్తే ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. ఆమె గ్రేస్, ఆమె స్టైల్ అన్నీ కూడా అందరినీ కట్టిపడేస్తుంటాయి. తాజాగా అల్లరి నరేష్‌తోనూ రోజా కాలు కదిపింది.

హీరోగా చేయలేదు..
నువ్వానేనా? అనే సినిమాలోని వయ్యారి బ్లాకు బెర్రీ ఫోనులే.. అంటూ ఊర్రూతలూగించిన మాస్ సాంగ్‌కు రోజా అల్లరి నరేష్ స్టెప్పులు వేశారు. అనంతరం అల్లరి నరేష్ రోజాను అమాంతం ఎత్తేశాడు. ఆ తరువాత నరేష్ మాట్లాడుతూ.. ‘ఎనిమిదేళ్ల తరువాత మళ్లీ రోజాగారితో చేయడం.. చాలా హ్యాపీగా ఉంది. ఆవిడతో యాక్ట్ చేశా కానీ.. హీరోగా ఎప్పుడూ చేయలేదు. జబర్దస్త్‌కి వచ్చినప్పుడల్లా ఆ ఫీలింగ్ ఉంటుంది' అని మనసులోని కోరికను బయటపెట్టేశాడు.

అప్పుడు అలా..
మరోవైపు రోజా మాట్లాడుతూ.. సీతారత్నం గారి అబ్బాయి సినిమా సమయంలో అల్లరి నరేష్ స్కూల్‌కి వెళ్లేవాడు. అప్పుడు నేను ఎత్తుకొని ఆడేదాన్ని. ఇప్పుడు నన్ను ఎత్తుకొని ఆడుతున్నాడు అంటూ రోజా నాటి రోజులను గుర్తు చేసుకుంది.