పదేళ్ల తర్వాత బుల్లితెరపైకి అల్లు అర్జున్: తారక్ తర్వాత అతడే.. ఆ రియాలిటీ షో కోసం స్పెషల్‌గా!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పుడున్న స్టార్ హీరోల్లో అల్లు అర్జున్ ఒకడు. బడా ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం అయినా.. ఆరంభంలోనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. దీంతో చాలా తక్కువ టైంలోనే స్టార్‌గా ఎదిగిపోయాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకెళ్తున్నాడు. ఇక, గత ఏడాదే 'అల.. వైకుంఠపురములో' అనే మూవీతో ఇండస్ట్రీ హిట్‌ను అందుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు 'పుష్ప' అనే పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నాడు. కొద్ది రోజుల్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ బుల్లితెరపైకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అది కూడా పదేళ్ల తర్వాత కావడం విశేషం. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

 ఎన్నో షోలు.. ఇది మాత్రం ప్రత్యేకం

ఎన్నో షోలు.. ఇది మాత్రం ప్రత్యేకం

తెలుగు బుల్లితెరపై సాంగ్స్, డ్యాన్స్, కామెడీ, రియాలిటీ ఇలా ఎన్నో రకాల షోలు ప్రసారం అవుతూ ఉంటాయి. అందులో కొన్నింటికి మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతూ ఉంటుంది. అందులో బిగ్గెస్ట్ డ్యాన్స్ రియాలిటీ షోగా పేరొందిన 'ఢీ' ఒకటి. దాదాపు పదమూడేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ షోకు.. రోజురోజుకూ ఆదరణ పెరుగుతూనే ఉంది.

టాలీవుడ్‌లో ఇప్పుడు వాళ్లదే అంతా

టాలీవుడ్‌లో ఇప్పుడు వాళ్లదే అంతా

ఈటీవీలో ప్రసారం అవుతోన్న ఢీ షో వల్ల ఎంతో మంది టాలెంట్ బయటకు వచ్చింది. సుదీర్ఘమైన ప్రయాణంలో ఈ కార్యక్రమం వల్ల ఎంతో మంది కొరియోగ్రాఫర్లుగా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. మరీ ముఖ్యంగా 'ఢీ' ద్వారా శేఖర్, గణేశ్, జానీ, రఘు, యశ్వంత్ మాస్టర్లు కొరియోగ్రాఫర్లుగా మారారు. వీళ్లంతా దక్షిణాదిలోని ఇండస్ట్రీల్లో హవా చూపిస్తూ దూసుకెళ్తున్నారు.

ఒకటి కాదు... రెండు కాదు... 13వది

ఒకటి కాదు... రెండు కాదు... 13వది

ఇప్పటికే పన్నెండు సీజన్లు పూర్తి చేసుకుంది 'ఢీ' షో.. పదమూడో దానిని కూడా చాలా రోజుల క్రితమే ప్రారంభించారు. 'కింగ్ వర్సెస్ క్వీన్స్' పేరిట ప్రసారం అవుతున్న ఈ సీజన్‌లో.. గతంలో మాదిరిగా కాకుండా మొత్తం కొత్త వాళ్లను తీసుకొచ్చారు. దీంతో ఈ సీజన్ పోటీ పోటీగా జరుగుతూ వచ్చింది. అందుకే గత వాటి కంటే ఈ సీజన్‌కు మరింత రెస్పాన్స్ వచ్చింది.

ఎంటర్‌టైన్‌మెంట్ తగ్గకుండా ప్లాన్

ఎంటర్‌టైన్‌మెంట్ తగ్గకుండా ప్లాన్

'కింగ్ వర్సెస్ క్వీన్స్' సీజన్‌ను అమ్మాయిలు, అబ్బాయిలకు మధ్య పోటీగా మొదలెట్టారు. కింగ్స్ టీమ్‌కు సుడిగాలి సుధీర్, హైపర్ ఆది.. క్వీన్స్ జట్టుకు రష్మీ గౌతమ్, దీపిక పిల్లి మెంటర్లుగా వ్యవహరిస్తున్నారు. జడ్జ్‌లుగా గణేష్ మాస్టర్, పూర్ణ, ప్రియమణిలు ఉన్నారు. స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు హోస్ట్ చేస్తున్నాడు. వీళ్ల కామెడీతో ఎంటర్‌టైన్‌మెంట్ కూడా బాగా వస్తోంది.

 పూర్తైన సెమీ ఫైనల్స్.. నలుగురితో

పూర్తైన సెమీ ఫైనల్స్.. నలుగురితో

ఢీ పదమూడవ సీజన్ 'కింగ్ వర్సెస్ క్వీన్స్' ఆరంభం నుంచే ఎంతో ఆసక్తికరంగా సాగుతూ వచ్చింది. గత వారమే ఈ సీజన్‌కు సంబంధించిన సెమీ ఫైనల్స్ కూడా పూర్తయ్యాయి. ఇందులో క్వీన్స్ టీమ్ తరపున నైనిక, కావ్య ఫినాలేకు చేరుకున్నారు. కింగ్స్ టీమ్ నుంచి సాయి, కార్తీక్ వచ్చారు. వీళ్లలో తుది దశకు ఒక కింగ్, ఒక క్వీన్ వస్తారు. వాళ్లలో ఒకరు విజేతగా నిలవబోతున్నారు.

మళ్లీ రెచ్చిపోయిన అషు రెడ్డి: ఎద అందాలు మొత్తం కనిపించేలా.. వామ్మో ఆమెనిలా చూస్తే తట్టుకుంటారా!
https://telugu.filmibeat.com/television/ashu-reddy-hot-photoshoot-gone-viral-104852.html

పదేళ్ల తర్వాత బుల్లితెరపైకి బన్నీ

వచ్చే బుధవారం నుంచి ఢీ పదమూడవ సీజన్ 'కింగ్ వర్సెస్ క్వీన్స్' ఫినాలే ఎపిసోడ్ జరగబోతుంది. దీని కోసం ముఖ్య అతిథిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాబోతున్నాడు. దీనికి సంబంధించిన ప్రకటనను గత ఎపిసోడ్ చివర్లో చేశారు. అలాగే, తాజాగా ఢీ సెట్స్‌లోకి అల్లు అర్జున్ ఎంట్రీ ఇచ్చిన ప్రోమోను షో నిర్వహకులు విడుదల చేశారు. ఇది వైరల్ అవుతోంది.

Recommended Video

Pawan Kalyan Song In World Of Dance International Dance Show || Filmibeat Telugu
ఎన్టీఆర్ తర్వాత అతడు మాత్రమే

ఎన్టీఆర్ తర్వాత అతడు మాత్రమే

ఇప్పటి వరకూ ఢీ షోకు 12 సీజన్లు జరిగాయి. ఆయా సీజన్ల ఫినాలే ఎపిసోడ్లకు ఎంతో మంది హీరోలు, దర్శకులు గెస్టులుగా వచ్చారు. అందులో జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే ఇప్పటి వరకూ రెండు సార్లు గెస్టుగా వచ్చాడు. ఇప్పుడు బన్నీ కూడా రెండోసారి రాబోతున్నాడు. గతంలో అతడు ఓ సీజన్‌కు గెస్టుగా వచ్చాడు. దాదాపు పదేళ్ల తర్వాత దాన్ని ఇప్పుడు రిపీట్ చేయబోతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X