Pushpa The Rule: ఊహించని పని చేసిన అవినాష్.. బన్నీ ఫ్యాన్స్ వార్నింగ్.. ఘోరమైన బూతులతో దాడి
మన బుల్లితెరపై చాలా కాలంగా ఎంతో మంది ఆర్టిస్టులు తమదైన శైలి టాలెంట్లతో సందడి చేస్తున్నారు. అయితే, అందులో కొందరు మాత్రమే ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్నారు. అందులో కమెడియన్ ముక్కు అవినాష్ ఒకడు. చాలా కాలం క్రితమే ఈ రంగంలోకి అడుగు పెట్టిన అతడు.. ఆరంభంలోనే అద్భుతమైన టైమింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. అదే సమయంలో వరుసగా అవకాశాలను అందుకుంటూ తన సత్తాను నిరూపించుకున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అతడికి వార్నింగ్ ఇస్తున్నారు. ఆ వివరాలు మీరే చూడండి!
జబర్ధస్త్‌తో మొదలైన ప్రయాణం:మిమిక్రీ ఆర్టిస్టుగా తన కెరీర్‌ను ఆరంభించిన ముక్కు అవినాష్.. హీరోల వాయిస్‌లు, బాడీ లాంగ్వేజ్‌లను అనుకరిస్తూ అలా స్టేజ్ షోలు, ఈవెంట్లలో సత్తా చాటాడు. ఆ సమయంలోనే జబర్ధస్త్ కమెడియన్ల దృష్టిలో పడ్డాడు. అలా ఆ షోలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఏమాత్రం అంచనాలు లేకుండానే అందులోకి ప్రవేశించిన అవినాష్.. చాలా తక్కువ సమయంలోనే ఫుల్ ఫేమస్ అయ్యాడు.

బిగ్ బాస్ ఛాన్స్.. జబర్ధస్త్‌కు షాక్:జబర్ధస్త్‌లో టీమ్ లీడర్‌గా వెలుగొందుతోన్న సమయంలోనే.. ముక్కు అవినాష్‌కు ఎన్నో ఆఫర్లు వచ్చాయి. అలా వాటిని కూడా చేస్తూ ఆ షోలో కొనసాగాడు. కానీ, బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇవ్వడంతో జబర్ధస్త్‌కు గుడ్‌బై చెప్పాడు. అంతేకాదు.. లైఫ్ ఇచ్చిన షోపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. అప్పటి నుంచి ఈ షోకు, ఈటీవీకి దూరంగానే ఉంటూ వస్తున్న విషయం తెలిసిందే.
ఎంటర్‌టైనర్.. యమ ఆఫర్లతో:జబర్ధస్త్ షో ద్వారా దక్కిన పాపులారిటీతో బిగ్ బాస్ షోలోకి వెళ్లిన అవినాష్.. చాలా వారాల పాటు నామినేషన్స్‌లోకి కూడా రాలేదు. దీంతో ఈ యంగ్ కమెడియన్ టైటిల్ గెలవడం ఖాయం అన్న టాక్ కూడా వినిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో షో నుంచి ఎలిమినేట్ అయ్యాడు. కానీ, బెస్ట్ ఎంటర్‌టైనర్ అనిపించుకున్నాడు. అప్పటి నుంచి అతడు వరుస ఆఫర్లతో దూసుకుపోతోన్నాడు.

బీబీ జోడీ.. రన్నరప్‌గా నిలిచి:ఈ మధ్య కాలంలో వరుసగా షోలు మీద షోలు చేసుకుంటూ దూసుకుపోతోన్న ముక్కు అవినాష్.. ఇటీవలే స్టార్ మాలో ప్రసారం అయిన 'బీబీ జోడీ' డ్యాన్స్ కార్యక్రమంలో ఆరియానా గ్లోరీతో కలిసి పాల్గొన్నాడు. ఇందులో వీళ్లిద్దరూ అదిరిపోయే పెర్ఫార్మెన్స్‌లతో అలరించారు. తద్వారా క్రేజ్‌ను సొంతం చేసుకోవడంతో పాటు ఈ షోలో రన్నరప్స్‌గా నిలిచి సత్తా చాటుకున్నారు.
సోషల్ మీడియాలో సందడిగా:వరుసగా షోలు, స్పెషల్ ఈవెంట్లు, సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా సత్తా చాటుతోన్న ముక్కు అవినాష్.. సోషల్ మీడియాలోనూ యమ యాక్టివ్‌గా ఉంటోన్నాడు. ఇందులో భాగంగానే తరచూ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌కు చెబుతున్నాడు. అలాగే, భార్యతో కలిసి తీసుకున్న ఫన్నీ వీడియోలను కూడా షేర్ చేస్తూ అలరిస్తున్నాడు.

బన్నీ గెటప్‌తో షాకిచ్చాడుగా:సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉండే ముక్కు అవినాష్.. అల్లు అర్జున్ పుట్టినరోజును పురస్కరించుకుని ఓ ఫొటోను షేర్ చేశాడు. ఇందులో 'పుష్ప ది రూల్' మూవీలో బన్నీ అమ్మవారి గెటప్ వేసుకున్నట్లుగానే అవినాష్ కూడా ట్రై చేశాడు. అంతేకాదు, 'అల్లు అర్జున్ గారు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇది పుష్ప 2 మ్యాడ్‌నెస్. సినిమా కోసం వెయిటింగ్' అని పోస్ట్ చేశాడు.
బూతులతో వార్నింగ్‌లు ఇస్తూ:అల్లు అర్జున్‌ను ఇమిటేట్ చేస్తూ ముక్కు అవినాష్ షేర్ చేసిన ఫొటోపై యమ ట్రోల్స్ వస్తున్నాయి. ముఖ్యంగా బన్నీ అభిమానులు ఆ ఫొటో డిలీట్ చేయమంటూ ఈ కమెడియన్‌కు వార్నింగ్‌లు ఇస్తున్నారు. అంతేకాదు, రాయడానికి వీలులేని భాషలో బూతులు తిడుతున్నారు. దీంతో ఇప్పుడిది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి దీనిపై అవినాష్ ఎలా స్పందిస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











