Don't Miss!
- Lifestyle
Today Rasi Phalalu:ఈ రోజు మీ ప్రయత్నాలలో విజయం సాధిస్తారు? మీ రోజువారీ జాతకం చెబుతుంది.
- News
టీఆర్ఎస్కు మును‘గోడు’: కూసుకుంట్లను వ్యతిరేకిస్తూ రచ్చ, ఓటమి ఖాయమంటూ వార్నింగ్
- Sports
లక్నో ఫ్రాంచైజీ గ్రూప్ కొన్న జట్టు తరఫున సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఆడబోయే స్టార్లు వీరే..!
- Finance
Investments: చైనా, తైవాన్లలో పెట్టుబడులు పెట్టిన దేశీయ ఇన్వెస్టర్లకు కన్నీళ్లు.. ఎందుకంటే..
- Travel
దక్షిణ మధ్య రైల్వేలో విస్టాడోమ్ కోచ్‌తో నడిచే మొట్టమొదటి రైలు
- Technology
ఇన్స్టాగ్రామ్ వినియోగదారుల డేటాను ట్రాక్ చేస్తోంది!!
- Automobiles
బ్రేకింగ్ న్యూస్: మారుతి సుజుకి స్విఫ్ట్ సిఎన్జి Swift CNG విడుదల, ధర రూ.7.77 లక్షలు
Pushpa: మూడవసారి కూడా టెలివిజన్ లో పుష్ప రాజ్ సంచలనం.. క్రేజ్ మామూలుగా లేదు
సుకుమార్ అల్లు అర్జున్ కలయికలో వచ్చిన మొదటి పాన్ ఇండియా మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కేవలం తెలుగులోనే కాకుండా మిగతా భాషల్లో కూడా భారీ స్థాయిలో రికార్డులను క్రియేట్ చేసింది. మొట్టమొదటిసారి అల్లు అర్జున్ తన స్టార్ హోదా ఏమిటో ఈ సినిమాతో నిరూపించుకున్నాడు. అయితే కేవలం బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రమే కాకుండా పుష్ప సినిమా టెలివిజన్‌లో కూడా భారీ స్థాయిలో రెస్పాన్స్ అందుకోవడం విశేషం. కేవలం మొదటిసారి మాత్రమే కాకుండా టెలికాస్ట్ అయిన మూడోసారి కూడా ఊహించని విధంగా మంచి TRPని సొంతం చేసుకుంది.
ఈ సినిమాలో అల్లు అర్జున్ డైలాగులు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అలాగే సుకుమార్ అంచనాలకు తగ్గట్టుగా స్క్రీన్ప్ ప్లే తో మ్యాజిక్ చేయడం.. ఇలా అన్నీ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ కావడంతో ఇప్పుడు టీవీలలో కూడా ఎగబడి చూస్తున్నారు అనే చెప్పాలి. మొదట పుష్ప సినిమా 22.54 టిఆర్పిని అందుకుంది. ఇక రెండవసారి 12.87 టిఆర్పి సొంతం చేసుకుంది. టెలివిజన్ ప్రీమియర్స్ తోనే టాప్ లిస్టులో చేరిపోయిన పుష్ప సినిమా మూడోసారి పరవాలేదు అనిపించే విధంగా మంచి టీఆర్పీని సొంతం చేసుకోవడం.

ఇటీవల టెలికాస్ట్ అయినా పుష్ప మూడవసారి టెలివిజన్‌లో 9.59 టిఆర్పి ను సొంతం చేసుకుంది. చూస్తుంటే సినిమా హవా అయితే ఇప్పట్లో తగ్గేలా లేదని అనిపిస్తుంది. మరోవైపు సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు పుష్ప కు సంబంధించిన ఏదో ఒక విషయం వైరల్ గానే మారుతుంది. బాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులు కూడా పుష్ప డైలాగ్స్ తో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉండడం విశేషం. అంతే కాకుండా ఇంటర్నేషనల్ క్రికెట్ లో కూడా అప్పుడప్పుడు పుష్పకు సంబంధించిన మేనరిజమ్స్ కనిపిస్తున్నాయి. మొదటి పార్ట్ తోనే అల్లు అర్జున్ ఈ స్థాయిలో క్రేజ్ క్రియేట్ చేసుకున్నాడు అంటే ఇక రెండవ పార్ట్ తో అంతకుమించి అనేలా ఆకట్టుకుంటాడు అని చెప్పవచ్చు. సెకండ్ పార్ట్ ను 2024 లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావచ్చు అని సమాచారం.