Pushpa TRP: టాప్ 5లో అల్లు అర్జున్.. రికార్డులకు దూరంగా మహేష్!
ఇటీవల కాలంలో స్టార్ హీరోల సినిమాలు కేవలం బాక్సాఫీసు వద్ద మాత్రమే కాకుండా టెలివిజన్ రంగంలో కూడా ఊహించని విధంగా రికార్డులో అందుకుంటున్నాయి. ఇక మొదటి సారి టెలివిజన్లో ప్రసారమయ్యే ప్రీమియర్ TRP ఏ విధంగా ఉంటుందనే విషయం కూడా హీరోల మార్కెట్ ను చేంజ్ చేస్తోంది అనే చెప్పాలి. ఇక అభిమానుల్లో కూడా టీఆర్పీ రికార్డులు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఇక రీసెంట్ గా వచ్చిన పుష్పరాజ్ బాగానే క్రేజ్ అందుకున్నప్పటికీ కూడా మహేష్ బాబు పాత సినిమా రికార్డును కూడా బ్రేక్ చేయలేక పోవడం విశేషం.
Recommended Video


టీఆర్పీతో మార్కెట్..
ఇటీవల కాలంలో కేవలం సినిమాలు థియేట్రికల్ గానే కాకుండా శాటిలైట్ ఓటీటీ రూపంలో కూడా మంచి లాభాలను అందిస్తున్నాయి. కొన్ని సినిమాలు అయితే బాక్సాఫీస్ వద్ద అపజయాలు అందుకున్నప్పటికీ కూడా శాటిలైట్ డిజిటల్ రూపంలో మాత్రం ఏ మాత్రం నష్టాలను మిగిల్చడం లేదు. ఇక స్టార్ హీరోలకు ప్రతిసారి టీఆర్పీ ని బట్టి వారి మార్కెట్ కూడా పెరుగుతోంది అనే చెప్పాలి.

అంచనాలను అందుకోలేక పోయిన పుష్ప
ఇక రీసెంట్ గా టెలికాస్ట్ అయిన పుష్ప పార్ట్ 1 ఏ సినిమా స్థాయిలో రేటింగ్స్ అనుకుంది అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో ఈ సినిమా టీఆర్పీ కి సంబంధించిన అనేక రకాల కథనాలు వైరల్ గా మారుతున్నాయి. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న పుష్ప టెలివిజన్లో మాత్రం ఇంకా అనుకున్నంత స్థాయిలో అయితే క్రేజ్ అందుకోలేదు.

పుష్ప పార్ట్ 1 టీఆర్పీ ఎంతంటే?
క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమాలో అల్లు అర్జున్ కు జోడిగా రష్మిక మందన్న నటించగా సునీల్ అనసూయ ముఖ్యమైన పాత్రలో కనిపించారు. ఇక మలయాళం టాలెంటెడ్ డైరెక్టర్ ఫహాద్ ఫాజిల్ మేయిన్ విలన్ గా నటించిన విషయం తెలిసిందే. ఇక మార్చి 13 వ తేదీన స్టార్ మా లో టెలికాస్ట్ అయిన పుష్ప సినిమా మొదటిసారి 22.50 టిఆర్పీ అందుకుంది.

నెంబర్ వన్ స్థానంలో
అసలైతే పుష్ప సినిమా బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సంచలనం తో తప్పకుండా టీవీలలో కూడా అదే తరహాలో ఒక సెన్సేషన్ టీఆర్పి రేటింగ్ అందుకుంటుంది అని అందరూ అనుకున్నారు. కానీ సినిమా టాప్ ఫైవ్ చివరిలో స్థానం సంపాదించుకోవడం విశేషం. అల వైకుంఠపురములో టెలివిజన్ ప్రీమియర్ కు 29.4 టిఆర్పీ అందుకోని టాలీవుడ్ లోనే నెంబర్ వన్ స్థానంలో ఉంది.

శ్రీమంతుడు.. కంటే తక్కువగా..
ఇక రెండవ స్థానంలో అత్యధిక టిఆర్పీ అందుకున్న సినిమాగా మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు 23.4 టిఆర్పీతో కొనసాగుతోంది. బాహుబలి 22.7 టిఆర్పీతో మూడవ స్థానంలో ఉండగా శ్రీమంతుడు 22.54 టిఆర్పీతో నాలుగవ స్థానంలో ఉంది. ఇక ఆ తరువాత 5వ స్థానంలో పుష్ప 22.50 టీఆర్పీతో నిలిచింది.

టాప్ 10లో..
ఒక విధంగా మహేష్ బాబు శ్రీమంతుడు సినిమా కంటే తక్కువ టిఆర్పీ అందుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇక 6వ స్థానంలో ఉన్న DJ టెలివిజన్ ప్రీమియర్స్ కు 21.7 టీఆర్పీ రాగా ఆ తరువాత స్థానంలో బాహుబలి 1 21.54, ఫిదా 21.31 టీఆర్పీ, గీతగోవిందం 20.8 టీఆర్పీ, జనతా గ్యారేజ్ 20.69 టీఆర్పీలతో టాప్ 10లో కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications











