Bigg Boss 7 Telugu దుడ్డు ఇచ్చా ముద్దు పెట్టు.. బిగ్‌బాస్ ఇంటిలో అల్లు అర్జున్, రష్మిక మందన్న

బిగ్‌బాస్ తెలుగు 7 మొదటి వారం ఇంటి సభ్యులు సెటిల్ కాకుండానే టాస్కులు మొదలయ్యాయి. ఇంటిలో కంటెస్టెంట్లను టీమ్‌లుగా విడదీసి.. ఫన్నీ టాస్కులను కొనసాగిస్తున్నాడు. 14 మందిని టీములుగా విడదీసి.. వారిలోని నటనా ప్రతిభను బయటకు తీసేందుకు కాన్సెప్టులను ఇచ్చారు. శుభశ్రీ, డాక్టర్ గౌతమ్‌ను ఓ జట్టుగా పెట్టి పుష్ప సీన్ రీ క్రియేట్ చేయమన్నారు. అమర్ దీప్‌కు రవితేజ క్యారెక్టర్ విక్రమ్ రాథోడ్ క్యారెక్టర్ ఇచ్చారు. ఈ సీన్ రీ క్రియేషన్ ఎలా సాగిందంటే..

ఫుష్ప స్కిట్‌లో అల్లు అర్జున్‌గా డాక్టర్ గౌతమ్, రష్మిక మందన్నగా శుభ శ్రీ పాత్రల్లో దూరిపోయారు. రష్మిక తన స్నేహితులతో ఉంటే.. అల్లు అర్జున్ వచ్చి కేశవతో ముద్దు అడిగే సీన్‌ను రీ క్రియేట్ చేయమనడంతో డైలాగ్స్ ప్రాక్టీస్ చేశారు. చిత్తూరు యాసలో డైలాగ్స్ చెప్పడానికి డాక్టర్ గౌతమ్, శుభశ్రీ కష్టపడ్డారు. అయితే శివాజీ, ఇతర ఇంటి సభ్యులు పుష్ప డైలాగ్స్ ఎలా చెప్పాలో వారికి నేర్పించాడు.

Allu Arjun, Rashmima Mandanna in Bigg Boss Telugu 7: Pushpa scene recreation goes Hillarious

శ్రీవల్లిగా రష్మికను చూసి పుష్ప (అల్లు అర్జున్‌) దుడ్డు ఇస్తాను.. ముద్దు పెట్టు అంటూ డాక్టర్ గౌతమ్ వెంటపడ్డాడు. అయితే అయ్యో నా భర్తకు ముద్దు ఇవ్వాలని దాచి పెట్టుకొన్నాను. ఇప్పుడు పుష్పకు ముద్దు పెట్టానే అంటే.. దుడ్డు తీసుకొన్నావు కదా అంటూ ఫన్ క్రియేట్ చేశారు. నా మొగుడికి ముద్దు దాచుకొంటే.. ఎట్టా అయిపోయిందే అంటూ శ్రీవల్లిగా శుభశ్రీ తన రేంజ్‌ ఫెర్ఫార్మ్ చేశారు.

ఇక కార్తీకదీపం మోనిత శోభా శెట్టి డ్యాన్సులతో ఇరుగ దీసింది. ఆట సందీప్‌ వద్ద అబ్బ నీ తీయని దెబ్బ పాటకు డ్యాన్సులు నేర్చుకొన్నది. తన పార్టనర్‌ ప్రిన్స్ యావర్‌తో ముద్దు ముద్గుగా రొమాన్స్ చేసింది. ప్రిన్స్ యావర్ ముందు శృంగార భంగిమలతో స్టెప్పులేసి మతి పొగొట్టింది.

బిగ్‌బాస్ ఇంటిలో శివాజీ, రతిక, పల్లవి ప్రశాంత్, దామిని తదితరులు బిగ్‌బాస్ టాస్కులతో అలరించారు. తొలివారం ఎలిమినేషన్‌లో నామినేట్ అయిన వారు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి తమ టాలెంట్ ప్రదర్శించారు. తొలివారమే ఆట పుంజుకొన్నది.

బిగ్‌బాస్ తెలుగు 7 షోలో తొలివారం ఇంటి నుంచి వెళ్లడానికి నామినేట్ అయిన వారిలో ఎనిమిది మంది ఉన్నారు. వారిలో శోభా శెట్టి, రతిక రోజ్, ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్, కిరణ్ రాథోడ్, డాక్టర్ గౌతమ్, యాక్టర్ షకీలా, సింగర్ దామిని తదితరులు ఉన్నారు. ఈ వారం నామినేట్ అయిన వారిలో అందరూ టాప్ కంటెస్టెంట్లు ఉండటంతో ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయం ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X