నార్త్ లో ఇంకా తగ్గని పుష్ప మేనియా.. తగ్గేదేలే అంటూ ఇద్దరు బడా స్టార్ల సినిమాలను వెనెక్కు నెట్టి!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ 'పుష్ప' తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గత ఏడాది డిసెంబర్ లో విడుదలైంది. ఈ సినిమా ఒకరకంగా కలెక్షన్ల సునామీ సృష్టించింది. కొద్ది రోజులకే ఓటీటీలోకి వచ్చినా జనాలు థియేటర్లలోనే ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపించారు అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. నార్త్ బెల్ట్ లో కేవలం థియేటర్లలో మాత్రమే కాదు టీఆర్పీ రేటింగ్స్ లో కూడా సినిమా రికార్డులు బద్దలు కొడుతోంది. ఆ వివరాల్లోకి వెళితే

జనాల్లో మరింత ఆసక్తి
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన 'పుష్ప' మూవీకి నేటికీ భారీ ఆదరణ దక్కించుకుంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లు అర్జున్ పోషించిన పుష్పరాజ్ పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఆయన సరసన నటించిన రష్మిక మందన సైతం భేష్ అనిపించుకుంది. అనసూయ, సునీల్, ఫహద్ ఫాజిల్ కూడా మన్ననలు పొందారు. అలా సూపర్ సక్సెస్ సాధించిన ఈ సినిమాకు సీక్వెల్ కూడా రానుండటం జనాల్లో మరింత ఆసక్తి పెంచింది.

పెద్ద మైలురాయి
అల్లు అర్జున్ పుష్ప: ది రైజ్ థియేట్రికల్ రన్ ముగియవచ్చు, కానీ రికార్డుల వేట మాత్రం ఇంకా కొనసాగిస్తూనే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా రూ.350 కోట్లకు పైగా వసూళ్లు చేసిన ఈ సినిమా ఇప్పుడు టీవీల్లోనూ తన రికార్డులు నెలకొల్పుతుంది. పుష్ప: ది రైజ్ టీవీ ప్రీమియర్ అక్షయ్ కుమార్ యొక్క సూర్యవంశీ సహా రణవీర్ సింగ్ యొక్క 83 రేటింగ్‌లను అధిగమించింది. తెలుగు సినిమాకు ఇది నిజంగా పెద్ద మైలురాయి అని చెప్పాలి.

స్టార్ హీరోలు అయినా కానీ
ఇటీవల పుష్ప హిందీ వెర్షన్ ని టెలివిజన్ లో ప్రీమియర్ గా ప్రదర్శించారు. పుష్ప తో పాటు ఇతర ఛానల్స్ లో అక్షయ్ కుమార్ సూర్య వంశీ, రణ్ వీర్ సింగ్ 83 చిత్రాలు కూడా అదే సమయంలో టివిలో ప్రదర్శించారు. అక్షయ్ కుమార్, రణ్ వీర్ సింగ్ హిందీలో స్టార్ హీరోలు అయినా కానీ ఊహించని విధంగా అల్లు అర్జున్ పుష్ప చిత్రం ఈ రెండు చిత్రాల టీఆర్పీని అధికమించి అగ్ర స్థానంలో నిలిచింది.

అర్బన్ ప్రాంతంలో
హిందీ స్పీకింగ్ మార్కెట్ అర్బన్ ప్రాంతంలో పుష్ప చిత్రానికి 4.35 టీవీఆర్ నమోదైంది. సూర్య వంశీ చిత్రాన్ని 2.7, రణ్వీర్ 83 చిత్రానికి 1. 7 టీవీఆర్ మాత్రమే నమోదయ్యాయి. అలాగే హిందీ స్పీకింగ్ మార్కెట్ రూరల్ రీజియన్ లో కూడా పుష్ప రికార్డు సృష్టించింది. పుష్ప చిత్రానికి 3.7 టీవీఆర్ నమోదు కాగా.. సూర్యవంశీ 3.1.. 83 చిత్రానికి కేవలం 2. 1 టీవీఆర్ నమోదు అయ్యాయి.
Recommended Video


అర్బన్ అండ్ రూరల్ ప్రాంతంలో
ఇక హిందీ స్పీకింగ్ మార్కెట్ అర్బన్ అండ్ రూరల్ ప్రాంతంలో కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. పుష్ప జోరు ముందు అక్షయ్ కుమార్, రణ్వీర్ చిత్రాలు నిలబడలేక పోయాయనే చెప్పాలి. ఈ కేటగిరీలో పుష్ప 4.2 టీవీఆర్ నమోదు చేసుకోగా సూర్యవంశీ 1.6.. రణ్ వీర్ 83 చిత్రం 1.07 వద్దే ఆగిపోయాయని చెప్పాలి.


Click it and Unblock the Notifications











