For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ప్రియమణి బాడీపై బన్నీ షాకింగ్ కామెంట్స్: బుగ్గ పట్టుకుని నాటీగా.. ఎప్పటికైనా అవకాశం వస్తుందంటూ!

  |

  మెగా కాంపౌండ్ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. స్టార్ హీరో అయిన తర్వాత వెనుదిరిగి చూడకుండా దూసుకెళ్తున్నాడు. ఇక, గత ఏడాదే 'అల.. వైకుంఠపురములో' అనే మూవీతో ఇండస్ట్రీ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు 'పుష్ప' అనే పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నాడు. కొద్ది రోజుల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ క్రమంలోనే హీరోయిన్ ప్రియమణి, పూర్ణపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

  తెలుగు బుల్లితెరపై ప్రత్యేకమైన షో

  తెలుగు బుల్లితెరపై ప్రత్యేకమైన షో

  తెలుగు బుల్లితెరపై ఎన్నో రకాల షోలు ప్రసారం అవుతూ ఉంటాయి. అందులో కొన్నింటికి మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతూ ఉంటుంది. అందులో బిగ్గెస్ట్ డ్యాన్స్ రియాలిటీ షోగా పేరొందిన 'ఢీ' ఒకటి. దాదాపు పదమూడేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ షోకు.. రోజురోజుకూ ఆదరణ పెరుగుతూనే ఉంది. దీంతో ఈ షో సీజన్ల మీద సీజన్లు జరుపుకుంటోంది.

  Bigg Boss Elimination: 13వ వారం షాకింగ్ ఓటింగ్.. మొదటి రోజు అలా ఇప్పుడిలా.. డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు

  పదమూడు సీజన్లు.. గ్రాండ్ ఫినాలే

  పదమూడు సీజన్లు.. గ్రాండ్ ఫినాలే

  'ఢీ' షో పదమూడో సీజన్ 'కింగ్ వర్సెస్ క్వీన్స్' పేరిట ప్రసారం అవుతోంది. ఈ సీజన్‌లో.. గతంలో మాదిరిగా కాకుండా మొత్తం కొత్త వాళ్లను తీసుకొచ్చారు. దీంతో ఈ సీజన్ పోటీ పోటీగా జరుగుతూ వచ్చింది. అందుకే గత వాటి కంటే ఈ సీజన్‌కు మరింత రెస్పాన్స్ వస్తోంది. ఇక, ఇప్పుడు గ్రాండ్ ఫినాలే దశకు చేరుకుంది. వచ్చే వారమే ఇందులో విజేతను ప్రకటించబోతున్నారు.

  ఆ ఇద్దరి మధ్య ఢీ 13 టైటిల్ ఫైట్

  ఆ ఇద్దరి మధ్య ఢీ 13 టైటిల్ ఫైట్

  'కింగ్ వర్సెస్ క్వీన్స్' సీజన్‌ను అమ్మాయిలు, అబ్బాయిలకు మధ్య పోటీగా మొదలెట్టారు. కింగ్స్ టీమ్‌కు సుడిగాలి సుధీర్, హైపర్ ఆది.. క్వీన్స్ జట్టుకు రష్మీ గౌతమ్, దీపిక పిల్లి మెంటర్లుగా వ్యవహరిస్తున్నారు. జడ్జ్‌లుగా గణేష్ మాస్టర్, పూర్ణ, ప్రియమణిలు ఉన్నారు. స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు హోస్ట్ చేస్తున్నాడు. కార్తీక్, కావ్యశ్రీ మధ్య వచ్చే వారం టైటిల్ ఫైట్ జరగనుంది.

  స్విమ్‌సూట్‌తో షాకిచ్చిన భూమిక: తడిచిన అందాలతో ఘాటుగా.. ఆమెనిలా చూశారంటే తట్టుకోలేరు!

   పదేళ్ల తర్వాత వచ్చిన ఐకాన్ స్టార్

  పదేళ్ల తర్వాత వచ్చిన ఐకాన్ స్టార్

  వచ్చే బుధవారం ఢీ పదమూడవ సీజన్ 'కింగ్ వర్సెస్ క్వీన్స్' ఫినాలే ఎపిసోడ్ జరగబోతుంది. దీని కోసం ముఖ్య అతిథిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వచ్చాడు. దీనికి సంబంధించిన ప్రోమో కూడా ఇప్పటికే విడుదలైంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో ప్రోమోను కూడా విడుదల చేశారు. ఇందులో అల్లు అర్జున్ పంచులు, ప్రాసలతో పాటు అదిరిపోయే డైలాగులతో అలరించాడు.

  హీరోయిన్లను పరిచయం చేశాడు

  హీరోయిన్లను పరిచయం చేశాడు

  తాజాగా విడుదలైన ప్రోమోలో అల్లు అర్జున్‌కు యాంకర్ ప్రదీప్ అందరినీ పరిచయం చేశాడు. మరీ ముఖ్యంగా జడ్జ్‌లుగా ఉన్న ప్రియమణి, పూర్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాడు. బాగా డ్యాన్స్ చేస్తే ప్రియమణి హగ్ ఇస్తారని, పూర్ణ బుగ్గలు కొరుకుతారని చెప్పాడు. అప్పుడు బన్నీ 'ఇంకా బాగా పెర్ఫార్మ్ చేస్తే ఏం చేస్తారు' అని పంచ్ వేశాడు. దీంతో సెట్‌లో అందరూ నవ్వుకున్నారు.

  బట్టలు లేకుండా ఇలియానా ఫోజులు: అదొక్కటే అడ్డుగా పెట్టి.. ఆమెనిలా చూస్తే షాక్ అవుతారు!

  బుగ్గ పట్టుకుని ఫీల్ అయిన బన్నీ

  ఫినాలే ఎపిసోడ్‌లో భాగంగా క్వీన్స్ టీమ్ నుంచి కావ్యశ్రీ అదిరిపోయే డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేసింది. దీంతో జడ్జ్ పూర్ణ ఆమె బుగ్గను కొరికేసింది. ఆ సమయంలో బన్నీ తన బుగ్గను కొరుకుతున్నట్లుగా ఫీల్ అయ్యాడు. అంతేకాదు, 'ఆ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు. ఎందుకంటే ఇంకా బాగా డ్యాన్స్ చేసుంటే ఏమైపోదునో' అంటూ పూర్ణపై నాటీ కామెంట్స్ చేశాడు.

  Recommended Video

  Pawan Kalyan Song In World Of Dance International Dance Show || Filmibeat Telugu
   ప్రియమణి ఫిగర్‌పై హాట్ కామెంట్

  ప్రియమణి ఫిగర్‌పై హాట్ కామెంట్

  ఈ ప్రోమోలో భాగంగా ప్రియమణి మాట్లాడుతూ.. 'నాకు ఇప్పటికీ ఒక బాధ ఉంది. బన్నీతో ఇప్పటి వరకూ వర్క్ చేయలేదు' అని చెప్పుకొచ్చింది. దీంతో అల్లు అర్జున్ 'వర్క్ చేయలేదని అనుకోవద్దు. ఇప్పటికీ ఇంకా ఛాన్స్ ఉంది. ఎప్పుడైనా చేయొచ్చు. పైగా ఇప్పుడు బాగా సన్నబడిపోయావ్. మాంచి హాట్‌గా తయారయ్యావ్' అని చెప్పడంతో ఆమె తెగ పొంగిపోయింది.

  English summary
  Dhee is an Indian dance reality show. Allu Arjun Chief Guest for DHEE 13 Kings vs Queens Finale. Now He Did Shocking Comments on Priyamani and Shamna Kasim.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X