బిగ్ బాస్ లవర్స్ కు ఊహించని షాక్.. గ్రాండ్ ఫినాలే చీఫ్ గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్..
బిగ్ బాస్.. బిగ్ బాస్.. ప్రస్తుతం ఎక్కడ చూసిన బిగ్ బాస్ రియాల్టీ షో పై చర్చ జరుగుతుంది. బుల్లి తెర ప్రేక్షకులకు ఎంటర్టైన్ అందిస్తున్న ఈ రియాలిటీ షో చివరి అంకానికి చేరుకుంది. మరో మూడు రోజులలో బిగ్ బాస్ సీజన్ 8 ఫైనల్ ఈవెంట్ జరుగబోతుంది. టాప్ ఫైవ్ కంటెస్టెంట్ గా నిఖిల్, గౌతమ్, నబీల్, ప్రేరణ, అవినాష్ లు నిలిచారు. బిగ్ బాస్ సీజన్ 8 టైటిల్ రేసులో ఎవరు గెలుస్తారనేది సర్వత్ర ఉత్కంఠ భరితంగా మారింది. అదే సమయంలో ఈ సీజన్ ఫైనల్ ఎపిసోడ్ కు చీప్ గెస్ట్ గా ఎవరు వస్తున్నారనేది? కూడా ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇంతకీ బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ ఫైనల్ ఎపిసోడ్ చీఫ్ గెస్ట్ ఎవరంటే?
బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అనే ట్యాగ్ తో ప్రారంభమైంది.అన్నట్టుగానే బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేస్తుంది రియాల్టీ షో. ఈ సీజన్లో ఎన్నడూ ఊహించని ట్విస్టులు, మలుపులు చోటుచేసుకున్నాయి. సరికొత్త కంటెంట్ ఇవ్వడంతో బిగ్బాస్ సీజన్ 8 ను ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. అందుకే టాప్ టిఆర్పి రేటింగ్ తో దూసుకెళ్లింది. ఈ సీజన్ ప్రారంభంలో 14 మంది ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత నాలుగు వారాలకు మరో ఎనిమిది మంది వైల్డ్ కార్డు ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.

ఏ సీజన్ లో లేని విధంగా మొత్తం 22 మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు. బిగ్ బాస్ సీజన్ 8 లో పాల్గొని ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు. ఫైనల్ గా ఐదుగురు మాత్రం టైటిల్ రేసులో నిలిచారు. ఈ సీజన్లో ఎవరు ఊహించని విధంగా ప్రతి కంటెస్టెంట్ డిఫరెంట్ కంటెంట్ను ఇచ్చారు. చివరగా టైటిల్ రేసులో ఐదుగురు నిలిచారు. ఇందులో నిఖిల్, గౌతమ్ లో గట్టి పోటీని ఇస్తున్నారు. దాదాపు వీరిద్దరే 60 శాతం ఓటింగ్ను పొందుతూ టాప్ ప్లేస్ లో నిలుస్తున్నారు. మరోవైపు.. ఇప్పటివరకు బిగ్ బాస్ సీజన్ లో లేడీ కంటెస్టెంట్ విన్నర్ కాకపోవడంతో ఈసారి ప్రేరణ విన్నర్ కావచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
మరోవైపు అవినాష్ పేరు కూడా గట్టిగానే వినిపిస్తుంది. ఇక వరంగల్ పోరడు నబిల్ అప్రిది కూడా తన బెస్ట్ ఇస్తూ.. టైటిల్ పోరులో నిలిచారు. మరి ఈసారి టైటిల్ ఎవరిని వరిస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే డిసెంబర్ 15న జరగనున్న గ్రాండ్ ఫినాలే జరుగుతోంది. అయితే.. ప్రతి సీజన్లో ఓ స్టార్ హీరో చీఫ్ గెస్ట్ గా వస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ సీజన్లో చీఫ్ గెస్ట్ గా ఎవరు రాబోతున్నారు అనేది మాత్రం ఉత్కంఠ గా మారింది.

సోషల్ మీడియా ఇన్పుట్స్ ప్రకారం.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గ్రాండ్ ఫినాలే ఛీప్ గెస్ట్ గా నేషనల్ అవార్డు విన్నర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా రాబోతున్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. పుష్ప 2 సినిమాతో పాన్ ఇండియా వైడ్ గా తన సత్తా చాటిన అల్లు అర్జున్ ఈ బిగ్ బాస్ ఫినాలే కు చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారట. ఇదెలా ఉంటే.. అల్లు అర్జున్ సుకుమార్ లో తెరకెక్కిన పుష్ప 2 సినిమా డిసెంబర్ 5 ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందు వచ్చింది. ఈ సినిమా కేవలం 6 రోజుల్లో 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. పలు రికార్డులను బ్రేక్ చేసింది.
ఇదిలా ఉంటే.. బిగ్ బాస్ సీజన్ 8 ఫైనల్ జరగనున్న నేపథ్యంలో గత అనుభవాలను దృష్టిలో పెంచుకొని.. టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. అన్నపూర్ణ స్టూడియోలోని 7 ఎకరాలలో బిగ్ బాస్ సెట్ వేయగా .. ఫైనల్ కూడా అందులోనే నిర్వహించనున్నారు. అయితే బిగ్బాస్ 7 గ్రాండ్ ఫినాలే సందర్భంగా తలెత్తిన పరిణామాలు, గొడవలు, బస్సుల పై రాళ్లు రూవ్వడం వంటి అవాంఛనీయ ఘటనలను దృష్టిలో పెట్టుకొని అన్నపూర్ణ స్టూడియో చుట్టూ కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. అలాగే ఈ సీజన్ గ్రాండ్ ఫినాలే కి అల్లు అర్జున్ రాబోతున్నారని, ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతున్న నేపథ్యంలో భద్రతపై మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











