ఇండియాను షేక్ చేయబోతున్న పుష్పరాజ్.. ఈ డేట్ గుర్తుపెట్టుకోండి
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చివరిగా 'పుష్ప 2 : ది రూల్' చిత్రంతో ప్రేక్షకుల మందుకు వచ్చిన సంగతి తెలిసిందే. 2021లో వచ్చిన పుష్ప చిత్రంతో అల్లు అర్జున్ ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేశారు. పుష్పరాజ్ మ్యానరిజానికి వరల్డ్ ఆడియెన్స్ కూడా ఫిదా అయ్యారు. పైగా అల్లు అర్జున్ టెర్రిఫిక్ పెర్ఫామెన్స్ కు బెస్ట్ యాక్టింగ్ కేటగిరీలో ఏకంగా నేషనల్ అవార్డు కూడా దక్కడం విశేషం. టాలీవుడ్ లో మొట్టమొదటిసారిగా ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకుని రికార్డు క్రియేట్ చేశారు.
ఇక 'పుష్ప 2 : ది రూల్' చిత్రంతో మరోసారి ఇండియాన్ షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో ఏకంగా అల్లు అర్జున్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేశారు. రూ.1870 కోట్ల గ్రాస్ ను వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసి సంచలనంగా సృష్టించారు అల్లు అర్జున్. ఇండియాలోనే హ్యయేస్ట్ గ్రాస్ వసూల్ చేసిన 2వ చిత్రంగా కూడా పుష్ప 2 ది రూల్ రికార్డు లోకి ఎక్కింది. ఆ స్థానంలో బాహుబలి రూ.1810 కోట్ల వరకు కలెక్ట్ చేసి పుష్ప2 ముందు వరకు ఉంది. బాహుబలి రికార్డును బ్రేక్ చేసిన చిత్రంగానూ ఈ సినిమా రికార్డు క్రియేట్ చేయడం విశేషం.

పుష్ప2 ది రూల్, రిలోడెడ్ వెర్షన్ తో లాంగ్ రన్ లో థియేట్రికల్ గా ప్రేక్షకులను అలరించింది. ఇండియా, జపాన్ తోపాటు ఓవర్సీస్ లో మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది ఇక ఇప్పటికే ఓటీటీలోనూ దుమ్ములేపింది. ఆ సెన్సేషనల్ మూవీని నెట్ ఫ్లిక్స్ 275 కోట్లతో డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకుంది. అయితే మళ్లీ 'పుష్ప 2 : ది రూల్' చిత్రం ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే థియేట్రికల్, డిజిటల్ లో దుమ్ములేపిన ఈ చిత్రం ప్రస్తుతం టెలివిజన్ ప్రీమియర్ లోనూ టెలికాస్ట్ కాబోతోంది. డేట్ కూడా ఫిక్స్ అయ్యింది.
పుష్ప 2 : ది రూల్ చిత్రం ఏప్రిల్ 13న ఇండియా వ్యాప్తంగా ఒకే రోజు టెలివిజన్ ప్రీమియర్ కాబోతుందని ప్రకటించారు. ఈ చిత్రం టెలివిజన్ రైట్స్ ను జియోస్టార్ నెట్ వర్క్ సొంతం చేసుకుంది. ఏప్రిల్ 13న తెలుగు భాషలో స్టార్ మా ఛానెల్ లో 5:30 సాయంత్రం, మలయాళం భాషలో ఏపియా నెట్ లో సాయంత్రం 6.30 గంటలకు, కన్నడ భాషలో కలర్స్ కన్నడ ఛానెల్ లో సాయంత్రం 7 గంటలకు ప్రసారం కాబోతోంది. తమిళంలో మాత్రం ఏప్రిల్ 14న స్టార్ విజయ్ ఛానెల్ లో మధ్యాహ్నం 3 గంటలకు ప్రసారం కాబోతోంది.
దీంతో పుష్ప2 ది రూల్ చిత్రం టెలివిజన్ లో కూడా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందోనని ఆసక్తికరంగా మారింది. అయితే ఈ చిత్రానికి ఏ రేటింగ్ వస్తుందో ఇక చూడాలి. పుష్ప2 చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ గ్రాండ్ గా నిర్మించింది. పుష్ప 3 : ర్యాంపేజ్ కూడా రానుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ తన 22వ చిత్రాన్ని తమిళ దర్శకుడు అట్లీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగతో సినిమాలు లైనప్ లో ఉన్నాయి.


Click it and Unblock the Notifications











