twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బుల్లి తెరకు షాక్ ఇచ్చిన “అల్లుడు శ్రీను”

    By Srikanya
    |

    హైదరాబాద్ : ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కుమారుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా పరిచయమవుతూ రూపొందిన చిత్రం 'అల్లుడుశీను' . వివి వినాయిక్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం డిసెంబర్ 28(ఆదివారం) జెమినీ టీవిలో సాయింత్రం ఆరు గంటలకుప్రసారం అయ్యింది. ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద ఓకే అనిపించుకున్నా... బుల్లితెరపై సూపర్ హిట్ అయ్యింది.

    16.91 టీఆర్పీ రేటింగ్ తెచ్చుకుంది అందరికీ షాక్ ఇచ్చింది. సమంత హీరోయిన్ కావటం, వివి వినాయిక్ డైరక్షన్, తమన్నా ఐటం సాంగ్ వంటివి ఈ టీఆర్పీకు కారణమని అంటున్నారు. అలాగే...పెద్ద తెరపై ఇవన్నీ ఉన్నా కొత్త కుర్రాడు సినిమా ఏం చూస్తాము అనుకున్నవారంతా ఆసక్తిగా టీవిల ముందు కూర్చోవటం కలిసి వచ్చిందంటున్నారు. లాంచింగ్ సినిమా అయినా మొత్తానికి టీవిల్లో కుర్రాడు దడదడలాడించాడన్నమాట.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    Alludu Seenu Super Hit on Small Screen

    చిత్రం కథేమిటంటే...నల్గొండలో ఉండే అల్లుడు శ్రీను (బెల్లంకొండ శ్రీనివాస్) తన మామ నరసింహా (ప్రకాష్ రాజ్)తో కలిసి అప్పులు పాలై , పారిపోయి హైదరాబాద్ సిటీకి వచ్చేస్తాడు. అక్కడ శ్రీనుకి తన మామ పోలికలతోనే...సెటిల్ మెంట్స్ చేస్తూ బ్రతికే లోకల్ డాన్ భాయ్(ఇంకో ప్రకాష్ రాజ్) కనిపిస్తాడు. ఇది గమనించిన అల్లుడు శ్రీను...దాన్ని అడ్వాంటేజి గా తీసుకుని... ఓ ట్రిక్ ప్లే చేస్తాడు. తన మామ గెటప్ మార్చి..భాయ్ గా తయారు చేసి, అతన్ని అడ్డం పెట్టి దందా చేస్తూ డబ్బు సంపాదించటం మొదలెడతాడు. ఈ లోగా భాయ్ కూతురు అంజలి(సమంత) కూడా సినిమాటెక్ గా శ్రీను తో ప్రేమలో పడిపోతుంది.

    ఇదిలా ఉంటే ...తన గెటప్ తో ఛీట్ చేస్తున్నారనే విషయం భాయ్ కి తెలిసిపోతుంది. తన లాగే ఉన్న నరసింహాన్ని, శ్రీను ని చంపేయటానికి ప్రయత్నం చేస్తాడు. అంతేకాకుండా తన కూతురుకు తన బిజినెస్ పార్టనర్(ప్రదీప్ రావత్)కొడుక్కి ఇచ్చి షార్జాలో వివాహం చేయాలని నిర్ణయిస్తాడు. ఇది తెలుసుకున్న శ్రీను ఏం చేసాడు. భాయ్ కి ఎలా బుద్ది చెప్పాడు. అసలు భాయ్ కి, నరసింహా కు ఉన్న సంభందం ఏంటి... అంజలిని ఎలా సొంతం చేసుకున్నాడు...డింపుల్ గా ఈ చిత్రంలో బ్రహ్మానందం పాత్ర ఏమిటి అనే విషయాలు తెలియాలంటే చిత్రం చూడాల్సిందే.

    ప్రకాష్‌రాజ్, తనికెళ్ల భరణి, రఘుబాబు, వెన్నెల కిశోర్, వేణు, ఫణి, ఫిష్ వెంకట్, పృధ్వి, జెన్ని, ప్రదీప్ రావత్, రవిబాబు, భరత్, ప్రవీణ్, ఆనంద్ భారతి, గుండు సుదర్శన్, అనంత్, అమిత్, నవీన్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు:కోన వెంకట్, రచన:గోపిమోహన్, కథ:కె.ఎస్.రవీంద్రనాధ్, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, స్టన్ శివ, రవివర్మ, వెంకట్, పాటలు:చంద్రబోస్, రామజోగయ్యశాస్ర్తీ, భాస్కరభట్ల, ఎడిటింగ్:గౌతమ్‌రాజు, సంగీతం:దేవిశ్రీ ప్రసాద్, కెమెరా:ఛోటా కె.నాయుడు, సమర్పణ:బెల్లకొండ సురేష్, నిర్మాత:బెల్లంకొండ గణేష్‌బాబు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:వి.వి.వినాయక్.

    English summary
    Sreenivas' maiden movie Alludu Seenu turned out to be "super hit" on small screen. The film was aired on a leading entertainment channel on Dec 28 (Sunday) and what's surprising is that it said to have got a huge TRP of 16.91.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X