రహస్యంగా ప్రియుడిని పెళ్లాడిన టీవీ నటి, చివరకు ఒప్పుకున్నారు!
విజయ్ టీవీలో ప్రసారమైన 'రాజా రాణి' టీవీ సిరీస్ ద్వారా పాపులర్ అయిన తమిళ టీవీ నటులు ఆల్య మానస, సంజీవ్ కార్తీక్ దాదాపు రెండేళ్ల ప్రేమాయణం అనంతరం రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. కొన్ని రోజుల క్రితమే వివాహం జరిగినప్పటికీ... ఎట్టకేలకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని ఖరారు చేస్తూ ఓ లెటర్ పోస్ట్ చేశారు.
వీరు పెళ్లి చేసుకున్నట్లు గాసిప్స్ ప్రచారంలోకి రావడంతో సంజీవ్ కార్తీక్ స్పందించారు. ''అవును మేము పపు కుట్టీ(ఆల్య మానస) బర్త్ డే రోజే పెళ్లి చేసుకున్నాం. అయితే అపుడు కొన్ని కారణాల వల్ల ఈ విషయాన్ని బయటకు చెప్పలేకపోయాం. ఇపుడు సమయం వచ్చింది కాబట్టి చెబుతున్నాం. మాకు మీ అందరి ఆశీర్వాదం కావాలి'' అని సంజీవ్ కార్తీక్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పేర్కొన్నారు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న అభిమానులు
సంజీవ్ కార్తీక్ ఈ విషయం ప్రకటించిన వెంటనే అభిమానులు వారికి విషెస్ తెలియజేస్తూ కామెంట్ల వర్షం కురిపించారు. మీ జోడీ బావుంటుందని, మీరు సంతోషకర జీవితం గడపాలి అంటూ పలువురు ఫ్యాన్స్శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వీరి సీక్రెట్ మ్యారేజ్ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Recommended Video

ఆ సమయంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు
అనుప్ ఉదీప్ డైరెక్షన్లో వచ్చిన ‘కులిర్ 100' అనే సినిమా ద్వారా సంజీవ్ కార్తీక్ నటుడిగా తన ప్రస్తానం మొదలు పెట్టారు. అయితే ఆ తర్వాత వరుస ప్లాపులు ఎదుర్కొన్నాడు. తర్వాత టీవీ రంగం వైపు అడుగులు వేశాడు. విజయ్ టీవీలో ప్రసారమైన ‘రాజా రాణి' సీరియల్ అతడికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ క్రమంలోనే అదే సీరియల్‌లో ఫిమేల్ లీడ్‌గా నటించిన ఆల్య మానసతో ప్రేమలో పడ్డారు.

తన ప్రేమను ప్రపోజ్ చేశాడు
ఇద్దరి మధ్య ప్రేమాయణం సాగుతోందని కొంతకాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఒక కార్యక్రమంలో ఆమె ఉత్తమ నటి అవార్డు అందుకున్న తరువాత అతను తన ప్రేమను ప్రపోజ్ చేస్తూ ఓ పోస్ట్ పెట్టాడు. అప్పటి నుంచి వీరి విషయం మరింత హాట్ టాపిక్ అయింది.

అలా తన ప్రేమను వ్యక్తపరిచాడు
‘‘థాంక్సూ సో మచ్ విజయ్ టీవీ, ఇది నాకు ఒక స్పెషల్ సర్‌ప్రైజ్... పపు కుట్టీ బెస్ట్ హీరోయిన్ అవార్డ్ అందుకోవడం ఊహించని అనుభవం. చాలా సంతోషంగా ఉంది.'' అంటూ తన మనసులో ఆమెపై ప్రేమను వ్యక్తం పరచడం ద్వారా సంజీవ్ కార్తిక్ లవ్ విషయంలో ఓపెన్ అయ్యాడు.


Click it and Unblock the Notifications