Bigg Boss Telugu 7: ఈవారం ఎలిమినేట్ అయ్యేది ఆ ఇద్దరిలో ఒక్కరు.. కన్ఫార్మ్ చేస్తున్న నామినేషన్స్ వార్!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో అద్భుతంగా సాగుతందో. ఇప్పటికే విజయవంతంగా 12 వారాలు పూర్తి చేసుకున్న ఈ షో ఈరోజుటితో 13వ వారంలోకి అడుగు పెడుతుంది. ఎవరూ ఊహించని విధంగా టీఆర్పీని సొంతం చేసుకుంటూ అద్భుతమైన ట్విస్ట్ లు అంతకు మించిన ఎమోషన్స్ తో బుల్లితెర ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. అయితే ప్రస్తుతం ఇంట్లో మొత్తం ఎనిమిది మంది మాత్రమే ఉండగా.. ఈ వారం నామినేషన్లలో చాలా మందే ఉన్నారు. ఒక్క ప్రశాంత్ తప్ప మిగిలిన వారంతా నామినేషన్లలోకి వచ్చినట్లు అర్థం అవుతుంది.
ముఖ్యంగా శివాజి, ప్రిన్స్ యావర్, అమర్ దీప్, శోభాశెట్టి, ప్రియాంక జైన్, అంబటి అర్జున్, గౌతమ్ కృష్ణలు నామినేషన్లలో ఉండగా... ఈ వారం ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఆ ఇద్దరికే ఎక్కువాగ ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ఇద్దరు ఎవరు, అసలు వారు ఇద్దరూ డేంజర్ జోన్ లో ఎలా ఉన్నారు, ఎందుకు ఎలిమినేట్ అవుతారు వంటి విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. గత వారం ఓటింగ్ లిస్టులో చివరగా ఉన్నది అంబటి అర్జున్, గౌతమ్ కృష్ణలే. అయితే ప్రస్తుతం వీరిద్దరే డేంజర్ జోన్ లో ఉన్నారు. మరీ ఎక్కువగా అంటే అంబటి అర్జన్ ఈ వారం ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ మరింత ఎక్కువగా కనిపిస్తోంది. ఎందుకు అంటారా..?

వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఇంట్లో అడుగు పెట్టిన అంబటి అర్జున్ గేమ్ చూసి వచ్చి భలేగా గేమ్ ప్లే చేశాడు. ముఖ్యంగా తన స్నేహితుడైన అమర్ దీప్ కు దూరంగా ఉంటూనే... బయట ఫుల్ ఫాలోయింగ్ ఉన్న శివాజి, పల్లవి ప్రశాంత్ లతో స్నేహం చేశాడు. ఎక్కువగా వారితో ఉంటూనే గేమ్ ఆడాడు. మెల్లి మెల్లిగా తన గేమ్ ఏంటో అర్థం అయ్యేలా చేశాడు. ముందుగా యావర్ ను, ఆ తర్వాత పల్లవి ప్రశాంత్ ను టార్గెట్ చేసిన అంబటి అర్జున్ ఇప్పుడు నేరుగా శివాజినే టార్గెట్ చేశాడు. నిజానికి తనతో చాలా నిజాయితీగా ఉంటున్న శివాజిని కావాలని అర్జున్ నామినేట్ చేయడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ముఖ్యంగా గౌతమ్ కృష్ణ కూడా శివాజిని నామినేట్ చేసేలా ప్రోత్సహించిన ఈయనను బిహేవియర్ ను బుల్లితెర ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. మాటలు మారుస్తూ... తనకోసం, తాను కెప్టెన్ అవ్వడం కోసం ప్రయత్నించిన శివాజిపైనే నిప్పులు చెరగడం దారుణం. నామినేషన్లలో తానే తప్పు చేసినట్లు ఒప్పుకున్న ఈయన ఈ వారం సేవ్ అవ్వడం చాలా కష్టం. అలాగే ఇతడితో పాటు గౌతమ్ కృష్ణ కూడా డేంజర్ జోన్ లోనే ఉన్నాడు. ఈయన కూడా అనవసరంగా శివాజిపై పడడం.. నామినేషన్ రీజన్స్ కూడా సరిగ్గా లేవు. అసలే ఓటింగ్ కూడా తక్కువగా ఉంది.

వీరిద్దరితో పాటు శోభాశెట్టికి కూడా నెగిటివిటీ ఎక్కువగానే ఉంది. కానీ బిగ్ బాస్ కు ఈమె దత్తపుత్రిక కావడంతో ఎప్పటికప్పుడు ఈమెను సేవ్ చేసుకుంటూ వస్తున్నారు బిగ్ బాస్ టీం నిర్వాహకులు. సో ఈసారి కూడా కాపాడుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో డేంజర్ జోన్ లో ఉన్నది అంబటి అర్జున్, గౌతమ్ కృష్ణలు. చూడాలి మరి వీరిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవాతరనేది.


Click it and Unblock the Notifications











