తొలిసారి వెబ్ సిరీస్‌లో నటిస్తున్న అమలా అక్కినేని!
నాగార్జునతో పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దురమైన అమల అక్కినేని.... ఆ మధ్య శేఖర్ కమ్ముల మూవీ 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వచ్చిన పలు చిత్రాల్లో ఆమె నటించిప్పటికీ అతిథి పాత్రకే పరిమితం అయ్యారు. బాలీవుడ్ లేటెస్ట్ మూవీ 'కార్వాన్' చిత్రంలో కూడా ఆమె చిన్న పాత్ర పోషించారు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అమలా అక్కినేని త్వరలో ఓ వెబ్ సిరీస్‌లో కనిపించబోతేన్నారు. పుష్పా ఇగ్నటిస్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ 'జీ5' అనే ఆన్ లైన్ స్ట్రిమింగ్ సైట్లో త్వరలో ప్రసారం కాబోతోంది. 'హై ప్రీస్టెస్' పేరుతో రూపొందిన ఈ సిరీస్ తెలుగు, తమిళం, హిందీ, మరాఠీ, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది.

ఈ వెబ్ సిరీస్‌లో అమలా అక్కినేని కీలకమైన పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఆమె పాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి. ఇందులో తమిళ నటి సునైనా కూడా నటిస్తున్నారు. డిసెంబర్లో ఈ వెబ్ సిరీస్ లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
సినిమాలకు దూరమైన తర్వాత అమలా అక్కినేని యానిమల్ వెల్ఫేర్ బ్లూక్రాస్ సంస్థను రన్ చేస్తున్న సంగతి తెలిసిందే. సమయం దొరికినప్పుడల్లా ఆమె తెలుగు, హిందీ చిత్రాల్లో కూడా మెరుస్తున్నారు. అయితే ఆమె నటనపై సిరీయస్‌గా దృష్టి పెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











