Bigg Boss Telugu 7 ప్రియాంకతో నా కొడుకు బంధం అదే.. అందుకే ఆమెతో తేజూ మాట్లాడలేదు.. అమర్‌దీప్ తల్లి

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఉల్టా పుల్టాగా సాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అత్యధిక టీఆర్పీతో దూసుకెళ్లేందుకు బిగ్ బాస్.. అద్భుతమైన టాస్కులు, అంతకు మించిన ఎమోషన్స్ పండించేందుకు బాగానే కష్ట పడుతున్నారు. ముఖ్యంగా పదో వారంలో ఫ్యామిలీ వీక్ ను మాత్రం చాలా రసవత్తరంగా సాగించారు. కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులను ఇంట్లోకి పంపించిన బిగ్ బాస్ ఆదివారం రోజు మరో కుటుంబ సభ్యుడితో పాటు స్నేహితులను తీసుకు వచ్చారు. ఇలా పదో వారం అంతా ఫుల్ ఎమోషన్స్, ఫన్, వార్ తో నింపేశారు. ఇన్ని వారాల్లో పదో వారంలో పండిన ఎమోషన్స్ మరే వారంలోనూ పండలేవు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ఫ్యామిలీ వీక్ లో భాగంగా వచ్చిన కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులు.. తమ వాళ్లతో గొడవలు పడ్డ వారితో మాట్లాడకపోవడం కామన్. కొందరు ఇలా ఎందుకు చేశారంటూ కూడా గత సీజన్లలో గొడవలు పెట్టుకున్న రోజులు ఉన్నాయి. కానీ ఈసారి అలా జరగలేదు. కానీ అందరూ ఆశ్చర్యపోయేలా.. అమర్ దీప్ భార్య తేజస్విని ప్రవర్తించింది. అమర్ దీప్ తో ఎప్పుడూ గొడవ పడుతూ కనిపించే శివాజి, పల్లవి ప్రశాంత్ లతో క్లోజ్ గా ఉన్న ఈమె.. తన భర్తకు క్లోజ్ ఫ్రెండ్ అయిన ప్రియాంక జైన్ తో మాత్రం మాట్లాడలేదు. కనీసం కేక్ కూడా పెట్టేందుకు ఇష్టపడలేదు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే సాగింది.

Amardeeep Mother Comments on Tejaswi And Priyanka Jain Issue in Bigg Boss Telugu 7

అయితే తాజాగా అమర్ దీప్ తల్లి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈక్రమంలోనే పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ముఖ్యంగా తన కొడుకు అమర్ దీప్ చాలా చక్కగా గేమ్ ఆడుతున్నాడని వివరించింది. అలాగే తన కొడుకు ప్రియాంక జైన్ చాలా క్లోజ్ ఫ్రెండ్ అని.. ముందు నుంచి కూడా వాళ్లిద్దరి మధ్య స్నేహం బాగుండేదని వివరించింది. అలాగే శోభా శెట్టికి తన కొడుకు స్నేహితురాలేనని పేర్కొంది. అమర్ దీప్ స్నేహానికి చాలా విలువ ఇస్తాడని.. తన ఫ్రెండ్ అనుకున్న వాళ్ల కోసం ఏదైనా చేస్తాడని చెప్పుకొచ్చింది.

ఈక్రమంలోనే బిగ్ బాస్ ఇంటికి మీ కోడలు తేజూ వెళ్లినప్పుడు ఆమె ప్రియాంక జైన్ తో సరిగ్గా మాట్లాడలేదని అడిగారు. ఇందుకు స్పందించిన అమర్ దీప్ తల్లి.. ఏమోనండి నాకైతే సరిగ్గా తెలియదు అనిచెప్పుకొచ్చింది. మరి నా కొడుకుతో ప్రియాంక చాలా క్లోజ్ గా ఉండి.. చాలా సాయం చేసింది... కానీ నా కోడలు తేజూ ఎందుకు మాట్లాడలేదో మరి నాకైతే అర్థం కావట్లేదు అని వివరించింది. ఈ విషయం గురించి నేరుగా నా కోడలిని అడిగితేనే తెలుస్తుందని చెప్పుకొచ్చింది.

Amardeeep Mother Comments on Tejaswi And Priyanka Jain Issue in Bigg Boss Telugu 7

అలాగే టాప్ -5లో ఎవరెవరు ఉంటారని అడగ్గా.. మొన్న నాగార్జున గారి ముందు చెప్పాను.. ఇప్పుడు కూడా వాళ్లే టాప్ 5లో ఉంటారని అనుకుంటున్నానని అమర్ దీప్ తల్లి చెప్పింది. అమర్ దీప్, శోభా శెట్టి, గౌతమ్ కృష్ణ, శివాజి, పల్లవి ప్రశాంత్ లు టాప్ - 5లో ఉంటారని నేను అనుకుంటున్నానని తెలిపింది. ప్రస్తుతం అమర్ దీప్ తల్లి చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ గా మారాయి. మీరూ ఓసారి ఆమె ఇంటర్వ్యూ చూసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X