Bigg Boss Telugu 7: ప్రశాంత్‌పై రతిక, అమర్ వెకిలి చేష్టలు... తగ్గేదేలే.. పుష్ప మేనరిజం చూపించిన రైతుబిడ్డ
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రోజు రోజుకు ఆసక్తి పెంచుతోంది. మునుపెన్నడూ జరగని షో అన్నట్లుగా రసవత్తరంగా సాగుతోంది. ఇక ఇందులోకి వచ్చిన కంటెస్టెంట్స్ కూడా ప్రత్యేకం అని చెప్పాలి. ముఖ్యంగా రతిక రోజ్ అయితే... రోజుకో విధంగా ఉంటూ... ప్రేక్షకులకు షాక్ ఇస్తుంది. ఇక తాజా ఎపిసోడ్ లో రతిక... పల్లవి ప్రశాంత్ పై రెచ్చిపోయింది. ఇక పవర్ అస్త్ర గెలవకుండా ఉండేందుకు అమర్ దీప్ తో కలిసి చిల్లర చేష్టలు చేసింది. ఆ వివరాల్లోకి వెళితే....
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ప్రారంభం అయి... నాలుగు వారాలు కావొస్తుంది. ఇక వీకెండ్ ఎపిసోడ్ కూడా దగ్గర పడుతుంది. ఇక పవర్ అస్త్ర కోసం కంటెండర్స్ పోటీ పడుతున్నారు. ఈ వారం కంటెండర్స్ గా ఎన్నికైన పల్లవి ప్రశాంత్, యావర్, శుభ శ్రీ రాయగురు... వీరంతా పవర్ అస్త్ర కోసం తెగ ఆరాట పడుతున్నారు. ఈ ముగ్గురిలో ఎవరు పవర్ అస్త్ర సాధిస్తారో ఈ వారం తేలిపోనుంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో ఒకటి రిలీజ్ అయింది.

ఇప్పటికే హౌజ్ మేట్స్ గా... ఆట సందీప్, శివాజీ, శోభాశెట్టి ఎంపిక అయ్యారు. ఇక ఈ వారం ఒక హౌజ్ మేట్ గా ఎవరు గెలుస్తారు అనేది ఆసక్తిగా మారింది. ఈ వారం పవర్ అస్త్ర కోసం పల్లవి ప్రశాంత్, యావర్, శుభ శ్రీ పోటి పడుతున్నారు. ఈ పవర్ అస్త్ర గెలిస్తే... హోజ్ మేట్ గా అవ్వడమే కాకుండా రెండు వారాలు ఎలిమినేషన్ అవ్వకుండా ఇమ్యూనిటీ వస్తుంది. అయితే పోటీదారులుగా ఉన్న ముగ్గురు కంటెస్టెంట్స్ శుభ శ్రీ, యావర్, ప్రశాంత్‌లకు పట్టువదలకు డింభకా అనే టాస్క్ ను బిగ్ బాస్ ఇచ్చాడు.
ఇక ఈ టాస్క్ లో పాల్గొన్న వీరు.. పవరాస్త్ర ను వదలకుండా పట్టుకోవాలి. ఎవరు ఎక్కువ సేపు పట్టుకుంటారో వారే.. పవరాస్త్ర పొందుతారని బిగ్ బాస్ చెప్తాడు. ఇక పల్లవి ప్రశాంత్ పై రతిక, అమర్ దీప్ చిల్లర జోక్స్ వేస్తూ... గేమ్ ఓడిపోయేందుకు తెగ ప్రయత్నిస్తారు. అతని ఆటను చెడగొట్టడానికి రతిక..... మరోసారి ప్రశాంత్ ను టార్గెట్ చేసింది.

ప్రశాంత్... రతికాకి ఏదో డౌట్ ఉందంట్రా... అని అమర్ అంటాడు. అక్కని నిన్ను ఎందుకు అన్నాడు అని అమర్ రతికను అడుగుతాడు. దానికి రతిక... బుర్రలేదు.. బుర్రలో మట్టి మన్ను మశానం ఉంది అంటూ వెకిలిగా నవ్వుతుంది. దానికి ప్రశాంత్ కోపంగా చూస్తాడు. ప్రశాంత్ నీకేదో ప్రాబ్లం ఉందిరా అంటూ అమర్ కూడా వెకిలి చేష్టలు చేస్తాడు. ఇక పుష్ప స్వాగ్ తో ప్రశాంత్ మీసాలు తీప్పుతూ... తగ్గేదేలే అన్నట్లు పుష్ప మేనరిజం చూపిస్తాడు.

ఇక ఈ పవర్ అస్త్ర టాస్కులో శుభ శ్రీ ఏడ్వడం మొదలు పెడుతుంది. ఏడుపు అడ్డం పెట్టుకుంటే వర్కౌట్ కాదని రతిక అంటుంది. పవరాస్త్ర నుంచి ఎవరు వైదొలిగితే బాగుంటుందని నువ్వు అనుకుంటున్నావ్ అని.. రతికని టేస్టీ తేజా అడుగుతాడు. దానికి ఆమె.... ఇంకెవ్వరు.. క్రయింగ్ స్టార్ ప్రశాంత్ అని అంటుంది రతిక. ఇక బిగ్ బాస్ ఆ పవర్ అస్త్ర టాస్కును రద్దు చేస్తాడు. ఇక ఆ తర్వాత కదలకురా వదలకురా అనే టాస్కు ఇస్తాడు. ఇక ఇందులో ఎవరు గెలిచి.. పవర్ అస్త్రను గెలుచుకున్నారో తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్ చూడాలి.


Click it and Unblock the Notifications











