డబ్బున్న పిల్లను పట్టిన ప్రిన్స్ యావర్: ఇంతకీ ఆమె ఎవరు? ఇది ఎవరు లీక్ చేశారో తెలిస్తే!
ఎవరూ ఊహించని కాన్సెప్టు.. వినోదాన్ని పంచే ఎంటర్‌టైన్‌మెంట్.. షాకింగ్ ఎలిమినేషన్స్.. నోరెళ్లబెట్టేలా చేసే ట్విస్టులు.. భావోద్వేగాలతో కూడిన కొన్ని సీన్స్ ఇలా ఎన్నో సంఘటనలతో కూడిన షోనే బిగ్ బాస్. నిజమైన సంఘటనల ఆధారంగా నడిచే ఈ కార్యక్రమానికి తెలుగులో విశేషమైన స్పందన దక్కింది.
ఫలితంగా ఇప్పటికే ఎన్నో సీజన్లు కూడా పూర్తి అయ్యాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడో సీజన్ కూడా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయింది. ఇందులో హైలైట్ అయిన ప్రిన్స్ యావర్ లవ్ ట్రాక్ తాజాగా బయటకు వచ్చింది. ఆ వివరాలను మీరే చూడండి!

ఉల్టా పుల్టా సీజన్‌లో హైలైట్: బిగ్ బాస్ ఏడో సీజన్‌ను ఉల్టా పుల్టా కాన్సెప్టుతో తీసుకు వచ్చారు. అందుకు తగ్గట్లుగానే ఎవరూ ఊహించని కంటెంట్‌తో రసవత్తరంగా ప్రసారం చేశారు. ముఖ్యంగా ఇందులో కొత్త కొత్త టాస్కులు, ట్విస్టులు, సర్‌ప్రైజ్‌లను చూపిస్తూ మజా పంచారు. ఇందులోకి మొత్తం 19 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇవ్వగా.. అందులో ప్రిన్స్ యావర్ అదిరిపోయే ఆటతీరుతో హైలైట్ అయ్యాడు.
స్పై బ్యాచ్.. డబ్బు తీసుకుని: బిగ్ బాస్ హౌస్‌లోకి ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చినా.. తనదైన ఆటతీరు, మాటతీరుతో యమా ఫేమస్ అయ్యాడు ప్రిన్స్ యావర్. దీనికితోడు ప్రశాంత్, శివాజితో కలిసి స్పై బ్యాచ్‌గా మారి మరింత క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇలా ఫినాలేలోకి చేరిన ప్రిన్స్ యావర్ రూ. 15 లక్షలు ఆఫర్‌కు ఓకే చెప్పాడు. తద్వారా అంత మొత్తం తీసుకుని షో నుంచి బయటకు వచ్చేశాడు.

షో తర్వాత క్రేజ్.. ఫుల్ బిజీ: బిగ్ బాస్ ఏడో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఉన్నప్పుడు ప్రిన్స్ యావర్ కోట్ల మంది హృదయాలను గెలుచుకున్నాడు. షో ముగిసిన తర్వాత అతడికి క్రేజ్ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఈ కారణంగానే బయటకు వచ్చిన తర్వాత నుంచి అతడు ఇంటర్వ్యూలు, స్పెషల్ ఈవెంట్లు, ప్రైవేట్ సాంగ్స్‌తో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. అలాగే, సినిమా ఆఫర్లనూ అందుకుంటున్నాడు.
యావర్ లవ్ ట్రాక్‌పై అమర్: బిగ్ బాస్ ఏడో సీజన్ కంటెస్టెంట్ టేస్టీ తేజ తన యూట్యూబ్ ఛానెల్ కోసం సహచర సభ్యులను ఇంటర్వ్యూ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా అతడు సీజన్ రన్నరప్ అమర్‌దీప్ చౌదరిని ఇంటర్వ్యూ చేశాడు. ఈ సందర్బంగా అతడు తన తోటి కంటెస్టెంట్ల గురించి వివరించాడు. ముఖ్యంగా ప్రిన్స్ యావర్ లవ్ ట్రాక్ గురించి చెప్పీ చెప్పనట్లు చెప్పేశాడు.

క్యాష్ పార్టీని పట్టేశాడంటూ: టేస్టీ తేజకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమర్‌దీప్ చౌదరి.. ప్రిన్స్ యావర్ గురించి మాట్లాడుతూ.. 'వాడికేం వాడు ఇప్పుడు క్యాష్ పార్టీ అయ్యాడు' అన్నాడు. దీనికి తేజ 'ఓహో.. అవునా' అంటూ డబుల్ మీనింగ్ వచ్చే విధంగా అన్నాడు. ఆ తర్వాత ఇద్దరూ నవ్వుకున్నారు. తర్వాత అమర్ 'యావర్ మంచి క్యాష్ పార్టీని పట్టుకున్నాడు. బెంజ్ కారు ఇంకా చాలా ఉన్నాయి' అన్నాడు.

బిగ్ బాస్ వాళ్లకే తెలుసని: అమర్‌దీప్ చౌదరి చెప్పిన మాటలకు టేస్టీ తేజ.. 'అవును. అది బిగ్ బాస్ వాళ్లకి మాత్రమే తెలుసు' అని అన్నాడు. దీంతో పక్కనే ఉన్న అమర్ భార్య తేజస్విని 'క్యాష్ పార్టీనా.. ఎవరబ్బా.. నాకు తెలీదు' అని చెప్పింది. దీంతో అమర్ 'నీకు తెలియకపోవడమే మంచిదిలే' అనేశాడు. మొత్తానికి ప్రిన్స్ యావర్ బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన అమ్మాయితోనే ప్రేమలో ఉన్నాడని చెప్పారు.
అందరి ఊహలు ఆమెపై: అమర్‌దీప్ చౌదరి, టేస్టీ తేజలు కలిసి ప్రిన్స్ యావర్‌పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. అదే సమయంలో అతడు నయనీ పావనీతోనే ప్రేమలో ఉన్నాడేమో అని అందరూ అనుకుంటున్నారు. అయితే, కొందరు మాత్రం ఈ విషయాన్ని కొట్టిపారేస్తూ.. అమర్‌దీప్‌నే విమర్శిస్తున్నారు. మొత్తానికి ఈ అంశంతో ప్రిన్స్ యావర్ మళ్లీ హైలైట్ అవుతున్నాడు.


Click it and Unblock the Notifications











