Bigg Boss Telugu 7: రైతుబిడ్డపై మరోసారి అమర్‌దీప్ అటాక్.. మారుతున్న టైటిల్ రేస్ లెక్కలు!
బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు షో అద్భుతంగా సాగుతోంది. మొదటి వారంలో 14 మంది కంటెస్టెంట్లు ఇంట్లో అడుగు పెట్టగా ఐదో వారంలో మరో ఐదుగురు కంటెస్టెంట్లు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా లోపలికి అడుగు పెట్టారు. అలాగే ముందు వారంలో ఎలిమినేట్ అయిన రతికా ను రీఎంట్రీతో మరోసారి లోపలికి తీసుకొచ్చి గేమ్ ఆడించారు. ఉల్టాపుల్టా కాన్సెప్ట్ తో అందరినీ తెగ అలరిస్తున్న ఈ షోలో వార్ అంతా వన్ సైడే అన్నట్లు సాగింది పదో వారం వరకు. ముఖ్యంగా అమర్ దీప్ వర్సెస్ పల్లవి ప్రశాంత్ గొడవ సాగగా.. శివాజి, యావర్ లు రైతుబిడ్డ వెంట నిలిచారు. మిగతా వారంతా ముఖ్యంగా సీరియల్ బ్యాచ్ అంతా అమర్ దీప్ వెంట ఉన్నారు.
ఇలా మొదటి వారం నుంచి రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ను కార్నర్ చేసి విపరీతమైన నెగిటివిటీ సంపాధించుకున్నాడు అమర్ దీప్. ఆ తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీలు లోపలికి వచ్చి చెప్పగా కాస్త తన గేమ్ మార్చుకున్నాడు. ఇక ఫ్యామిలీ వీక్ తర్వాత అయితే పూర్తిగా మారిపోయి చక్కగా గేమ్ ఆడాడు. ఈక్రమంలోనే రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ తో అమర్ దీప్ బాగుండడం, చిన్న పిల్లాడిలా కెప్టెన్సీ కోసం ఏడవడం చూసిన ప్రేక్షకులు.. అమర్ దీప్ మెంటాల్టీకి చలించిపోయారు. చిన్న పిల్లాడి బిహేవియర్ అంటూ సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసేశారు.

ఈక్రమంలో పదో వారం పూర్తయ్యే వరకు శివాజి విన్నర్ గా నిలుస్తాడని భావించిన అందరూ.. అమర్ దీప్ గ్రాఫ్ పెరగడం చూసి అతనే విన్ అవుతాడని అనుకున్నారు. కానీ మరోసారి అమర్ దీప్ తనలోని నెగిటివ్ క్వాలిటీస్ ను అందరికీ చూపిస్తున్నాడు. ఆదివారం ఎపిసోడ్ నుంచి ముఖ్యంగా తనకు శివాజి కెప్టెన్సీ టాస్క్ లో సపోర్ట్ చేయనప్పటి నుంచి మళ్లీ స్పై బ్యాచ్ పై ఫైర్ అవుతున్నాడు. ముఖ్యంగా ఈరోజు జరిగిన నామినేషన్స్ ప్రక్రియలో తనలోని కోపాన్ని అంతా వెళ్లగక్కాడు. ఈక్రంలోనే శివాజితో పాటు పల్లవి ప్రశాంత్ ను నామినేట్ చేశాడు.
నామినేట్ చేయడమే కాకుండా ఫుల్లుగా గొడవ పెట్టుకున్నాడు. నువ్వు సరైనవాడివి కావంటూ కామెంట్లు చేశాడు. 12వ వారంలో కెప్టెన్సీ టాస్క్ తో పాటు అంతకు ముందు వారం నుంచి పల్లవి ప్రశాంత్ అమర్ తో చాలా క్లోజ్ గా ఉంటున్నాడు. వాస్తవానికి అమర్ కెప్టెన్ అయ్యేందుకు చాలా సపోర్ట్ చేశాడు. ముఖ్యంగా అమర్ దీప్ పిచ్చి పట్టినట్లుగా ఏడుస్తుంటే పక్కనే ఉండి ఓదార్చాడు. అమర్ దీప్ ను ఏడవకుండా చూసి వెన్నంటే ఉన్న రైతుబిడ్డపైనే అమర్ దీప్ మరోసారి ఫైర్ అవ్వడాన్ని ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా సీరియల్ బ్యాచ్ తో పాటు అంబటి అర్జున్, గౌతమ్ కృష్ణలు కూడా.. పల్లవి ప్రశాంత్, యావర్, శివాజిలను టార్గెట్ చేయడం వారికే మైనస్ అవుతున్నట్లు తెలుస్తోంది.
నిజంగా గనుక ఇదే జరిగితే మాత్రం శివాజి విన్నర్ గా నిలవడం కన్ఫార్మ్.. అలాగే రైతుబిడ్డతో మరోసారి గొడవ పెట్టుకున్న అమర్ దీప్ టాప్ 5 కి చేరడం కూడా చాలా కష్టం అని తెలుస్తోంది. గతంలో ఓసారి గొడవ పెట్టుకున్న విపరీతమైన నెగిటివిటీ సంపాధించుకున్న అమర్ దీప్.. మరోసారి రైతుబిడ్డతో పెట్టుకుని.. ఏమైపోతాడే ఏమోనని చాలా మంది అనుకుంటున్నారు. చూడాలి మరి పల్లవి ప్రశాంత్ దెబ్బకు నేరుగా ఇంటికి వచ్చేస్తాడా లేక తట్టుకొని టాప్ 5లో నిలబడతాడా అనేది.


Click it and Unblock the Notifications











