Bigg Boss Telugu 7 Finale: రవితేజకే షాకిచ్చిన అమర్​దీప్‌.. ఏం చేయాలో తెలీక ఏడ్చేసిన మాస్ మహారాజా!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో గురించి, అందులో ఉన్న కంటెస్టెంట్ల అందరి గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకుకలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొత్తం 19 మంది కంటెస్టెంట్లు హౌస్ లో అడుగు పెట్టగా... అత్యంత ప్రాచుర్యం పొందిన వాళ్లలో కనీసం 15 మంది అయినా ఉంటారు. ముందు వారాల్లో ఎలిమినేట్ అయిపోయిన వారు తప్ప అందరి గురించి బాగా తెలిసే ఉంటుంది మనకు. ముఖ్యంగా సీరియల్ హీరోగా దూసుకెళ్తున్న అమర్ దీప్ గురించి ఆయన ఆట గురంచి అయితే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు చాలా బాగా తెలుసు. ఆయన మెంటాల్టీ గురించి కూడా బాగానే అర్థం చేసుకున్నారు.

మొదటి వారంలో హౌస్ లో ఆయన అడుగు పెట్టగానే.. అందరూ అతడే విన్నర్ గా నిలుస్తాడని అనుకున్నారు. కానీ రెండో వారం నామనేషన్ల సమయంలో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ పై ఫైర్ అయి.. అతడిని అంతా కలిసి కార్నర్ చేయడం, ముఖ్యంగా అమర్ దీప్ మరీ ఎక్కువ స్థాయిలో విరుచుకు పడడంతో కథంతా ఉల్టాపుల్టాగా మారిపోయింది. ఒక్క సంఘటనతో ఫుల్ నెగిటివిటీ సంపాధించుకున్న ఈయన విన్నర్ కాదు కదా టాప్ 5కి కూడా రాలేడని తెలిసిపోయింది. ముఖ్యంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చే వరుకు కూడా అమర్ దీప్ అలాగే ప్రవర్తించాడు.

Recommended Video

బిగ్ బాస్ విజేత Pallavi Prashanth..ఆఖర్లో పిచ్చెక్కించే ట్విస్ట్ .. | FilmiBeat Telugu

Amardeep Big Shock To hero Raviteja in Bigg Boss Telugu 7 Finale

ముఖ్యంగా ప్యామిలీ వీక్ తర్వాత తన గేమ్ అంతా మార్చుకున్నాడు. చక్కగా ఆడడం ప్రారంభించాడు. 11,12 వారాల్లో అయితే అతడే విన్నర్ గా నిలుస్తాడని కూడా టాక్ నడిచింది. కెప్టెన్సీ కోసం అతడు కష్ట పడ్డ తీరు చూసిన ప్రతీ ఒక్కరూ ఓటు వేయడంతో అతడి గ్రాప్ విపరీతంగా పెరిగిపోయింది. అప్పటి వరకు అంతా పల్లవి ప్రశాంత్, శివాజీలే విన్నర్ గా నిలుస్తారని అనుకోగా.. అమర్ దీప్ టాప్ లోకి రావడం ఆశ్చర్యం కల్గించింది. మళ్లీ అతడి గ్రాఫ్ తగ్గిపోయింది. ఈసారి కన్ఫార్మ్ గా అతడు టాప్ 3కే అంకితం అవుతాడని భావించారు.

కానీ మళ్లీ కథ మొత్తం తారుమారు అయింది. శివాజిని మించి ఆయనకు ఓట్లు వచ్చినట్లు తెలుస్తోంది. అమర్ దీప్ రన్నరప్ గా నిలిచాడని కూడా అంతా అనుకుంటున్నారు. అయితే బిగ్ బాస్ తెలుగు 7 షో ఫినాలేకు సంబంధించిన ప్రోమోలో అమర్ దీప్ ఓ షాకింగ్ డెసీషన్ తీసుకున్నాడు. ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. ముఖ్యంగా నాగార్జున బిగ్ బాస్ టైటిల్ రేసు నుంచి బయటకు వచ్చేస్తే.. రవితేజ సినిమాలో నీకు సినిమా ఆఫర్ ఇస్తానని చెప్పాడు. అయితే ఇందుకు అమర్ దీప్ ఏమాత్రం ఆలోచించకుండా.. కప్పు వద్దని రవితేజ సినిమాలో అవకాశమే ముద్దని చెప్పాడు.

అంతేనా ఎంతో హుషారుగా బిగ్ బాస్ హౌస్ గేట్లు ఓపెన్ చేస్తే బయటకు వచ్చేస్తానంటూ.. లివింగ్ ఏరియా నుంచి గేట్ల వరకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అయితే 105 రోజులు ఇంత కష్టపడి గేమ్ ఆడిన అమర్ దీప్.. తన కోసం, తన సినిమాలో ఛాన్స్ కోసం అలా రావడం చూసిన మాస్ మాహారాజ రవితేజ షాకయ్యాడు. మరీ ఇంత ప్రేమ ఏంటంటూ కన్నీరు పెట్టుకున్నాడు. నాకేం మాట్లాడాలో కూడా తెలియట్లేదంటూ చెప్పుకొచ్చాడు. పూర్తి ఎపిసోడ్ చూస్తే తప్ప ఏం జరిగిందో తెలిసేలా లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X