Bigg Boss Telugu 7: ప్రియాంకకు షాకిచ్చిన అమర్‌దీప్.. టికెట్ టు ఫినాలే గెలుచుకుంది అతడేగా!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో అద్భుతంగా సాగుతోంది. ఎవరూ ఊహించని విధంగా అద్భుతమైన ట్విస్టులు చోటు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రతీ రోజూ ఓ టాస్క్ ఇస్తూ.. బిగ్ బాస్ అందరి మధ్య గొడవలు పెడుతున్నాడు. ఇన్నాళ్లూ రెండు గ్రూపులుగా విడిపోయి కొట్టుకున్న, తిట్టుకున్న వాళ్లు.. ఇప్పుడు తమలో తాము కొట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఇన్నాళ్లూ ఒకే గ్రూపుగా కలిగి గేమ్ ఆడిన సీరియల్, స్పా, స్టార్ మా బ్యాచ్ ఇప్పుడు... టికెట్ టు ఫినాలే కోసం కొట్టుకోవడం గమనార్హంగా మారింది. ముఖ్యంగా ఎప్పుడూ తనతోనే కలిసి ఉన్న ప్రియాంకకే అమర్ దీప్ గట్టా షాకిచ్చాడు. ఏం జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఇప్పటికే 12 వారాలు ఘనవిజయంగా పూర్తి చేసుకున్న ఈ షో.. 13వ వారంలోకి అడుగు పెట్టగా.. చాలా వాడీవేడిగా నామినేషన్ల పర్వం సాగింది. ఇక తాజాగా టికెట్ టు ఫినాలే కోసం బిగ్ బాస్ మొత్తం మూడు టాస్క్ లు ఇచ్చాడు. ముందు టాస్క్ లో అంబటి అర్జున్ గెలవగా.. రెండో టాస్క్ లో శివాజి, శోభా శెట్టిలు ఔట్ అయిపోయారు. అయితే వారిద్దరికీ తప్పు మిగతా ఆరుగురికి బిగ్ బాస్ మూడో టాస్క్ ఇచ్చారు. ఇందులో ఎవరు గెలిస్తే వారికే టికెట్ టు ఫినాలే ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందుకోసం బిగ్ బాస్.. గాళం వెయ్ బుట్టలో పడెయ్ అనే టాస్క్ ఇఛ్చాడు.

అమర్ దీప్, గౌతమ్ కృష్ణ, పల్లవి ప్రశాంత్, అంబటి అర్జున్, ప్రియాంక జైన్, ప్రిన్స్ యావర్ లు.. ఈ గేమ్ ఆడారు. అయితే ఇందులో మొదటి రౌండ్ లో అంబటి అర్జున్ గాలం వేసి కరెక్టుగా బాల్ ను లాగేశాడు. ఆ తర్వాత బాల్ వేయగా... ప్రియాంక లాగేసింది. కానీ పక్కనే ఉన్న రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ మాత్రం ఆ బాల్ సర్కిల్ బయటకు రాగానే ఆమె చేతిలోకి రాకుండా లాక్కెళ్లిపోయాడు. ఇక ఆ తర్వాత అమర్ దీప్.. పల్లవి ప్రశాంత్ లాగే గేమ్ ఆడడం ప్రారంభించాడు.
మూడో రౌండ్ లో ప్రిన్స్ యావర్ బాల్ ను లాగగా... పక్కనే ఉన్న అమర్ దీప్ ఆ బాల్ ను లాక్కునే ప్రయత్నం చేశాడు. ఈక్రమంలోనే యావర్, అమర్ దీప్ లు ఇద్దరూ పోటాపోటీగా కొట్టుకునే ప్రయత్నం చేశారు. చివరకు ఎలాగోలా బాల్ ను దక్కించుకున్న ప్రిన్స్ యావర్.. అమర్ దీప్ పై కాస్త ఫైర్ అయ్యాడు. అయితే చివరగా మరో రౌండ్ పెట్టగా.. బాల్ ను ప్రియాంక జైన్ లాగేసింది. అయితే మరోసారి అమర్ దీప్ అదే స్ట్రాటెజీని ప్లే చేశాడు. తన స్నేహితురాలని కూడా చూడకుండా ఆమెపై పడి మరీ బాల్ ను లాక్కునే ప్రయత్నం చేశాడు.

ఈక్రమంలోనే వీరిద్దరూ బాల్ కోసం చాలా ప్రయత్నం చేశారు. అయితే చివరకు అమర్ దీప్ ప్రియాంక నుంచి బాల్ లాక్కున్నట్లు ప్రోమో చూస్తుంటే తెలుస్తోంది. ఈక్రమంలోనే తన క్లోజ్ ఫ్రెండే ఇలా చేయడంతో ఆమె విపరీతంగా బాధ పడిపోయింది. ఇలా ఎవరూ ఊహించని విధంగా ప్రియాంకనే ఓడించిన ఇతడు.. టికెట్ టు ఫినాలే కూడా గెలుచుకోనట్లు తెలుస్తోంది. చివరకు అంబటి అర్జున్ ఈ గేమ్ లో విన్ అయి టికెట్ టు ఫినాలే గెలుచుకున్నట్లు తెలుస్తోంది. అయితే పూర్తిగా ఏం జరిగిందో తెలియాలంటే మాత్రం ఊరోజుటి ఎపిసోడ్ అయిపోయే వరకూ ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











