Bigg Boss Telugu 7: పల్లవి ప్రశాంత్‌ను కొరికిన అమర్‌దీప్.. ఆపై పిచ్చిపట్టిన వాడిలా కేకలు. ఎందుకంటే?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన కాన్సెప్ట్ తో వచ్చి అందరినీ అలరిస్తున్న ఈ షోలోకి ముందుగా 14 మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత నాలుగు వారాలకే మరో ఐదుగురు కంటెస్టెంట్లు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఇంట్లోకి వచ్చేశారు. అలాగే అంతకు ముందు వారాల్లో ఎలిమినేట్ అయిపోయిన రతికా రోజ్ తో రీఎంట్రీ ఇప్పించారు. ఇలా ఎవరూ ఊహించని ట్విస్ట్ లు ఇస్తూ షోను మరింత రసవత్తరంగా మలుస్తున్నారు. మరో 10 రోజుల్లో షో ముగుస్తుండడంతో మరింత ఆసక్తిగా టీవీలు చూస్తున్నారు అందరూ.
ప్రస్తుతం ఇంట్లో ఏడుగురు కంటెస్టెంట్లు ఉన్నారు. శోభాశెట్టి, అమర్ దీప్, పల్లవి ప్రశాంత్, ప్రియాంక జైన్, శివాజి, అంబటి అర్జున్, ప్రిన్స్ యావర్ లు ఇంట్లో ఉన్నారు. అయితే మొదటి వారంలో విన్నర్ గా నిలుస్తాడని భావించిన వాళ్లలో మొదటి వాడు అమర్ దీప్. కానీ ఆ తర్వాత ఆయనకు వచ్చిన నెగిటివిటీతో లీస్ట్ కు వచ్చేశాడు. టాప్ 5లో కూడా ఉండడు అనుకున్నారు. కానీ ఫ్యామిలీ వీక్ తర్వాత తన గేమ్ మార్చుకొని అందిరకీ షాకిచ్చాడు. మళ్లీ ఓటింగ్ లో టాప్ కి వచ్చేశాడు. కానీ ఈ వారం ఆయన చేస్తున్న పర్ఫార్మెన్స్ కు మరోసారి కిందకు పడిపోయారు.

ఓటింగ్ సంగతి పక్కన పెడితే.. అమర్ దీప్ రోజురోజుకూ పిచ్చి పట్టిన వాడిలా ప్రవర్తిస్తున్నాడు. మొన్నటికి మొన్న శోభాను కాలితో తన్ని.. ప్రియాంక మూతిపై కొట్టాడు. తాజాగా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ను కొరికాడు. ఆపై పిచ్చి పట్టిన వాడిలా అరిచాడు. అయితే అతను అలా ఎందుకు ప్రవర్తించాడు, అసలు ఏం జరిగింది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. బిగ్ బాస్ ఫన్ టాస్క్ లో భాంగగా ఈరోజు మరో టాస్క్ ఇచ్చాడు. ముఖ్యంగా ఓ కోట్ ను వేసుకొని బాల్స్ తో కొట్టుకోవాల్సి ఉంటుంది. అలా కొట్టుకుంటే ఎవరికి ఎక్కువగా బాల్స్ అంటుకుంటే వాళ్లు ఈ టాస్క్ నుంచి ఔట్ అయినట్లు.
ఇలా టాస్క్ ఆడుతుండగా.. ముందుగా శోభాశెట్టి, యావర్ లు బయటకు వెళ్లిపోయారు. ఇక ఆ తర్వాత అమర్ దీప్ పల్లవి ప్రశాంత్ ను టార్గెట్ చేశాడు. అతడి వద్దకు వెళ్లి మరీ అమర్ దీప్ కొట్టుకుంటూ బాల్స్ అంటించే ప్రయత్నం చేశాడు. రైతుబిడ్డ కూడా అడ్డుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఏమాత్రం అతను ఆగకుండా మరింత క్రూరంగా ప్రవర్తించాడు. గట్టిగా పెనుగులాడుతూనే.. పల్లవి ప్రశాంత్ చేయిని కొరికేశాడు. ఇదే విషయాన్ని రైతుబిడ్డ నేరుగా చెప్పగా... ఆ తప్పును ఒప్పుకుంటున్నట్లు అమర్ దీప్ చెప్పాడు. నేను చేసేవన్నీ బాగానే కనిపిస్తున్నాయి కానీ.. నీవు చేసేది ఎవరికీ తెలియట్లేదంటూ వివరించాడు.
ఆపై పిచ్చి పట్టిన వాడిలా అరుస్తూ రచ్చరచ్చే చేశాడు అమర్ దీప్. చూడు ఎలా అరుస్తున్నాడో అంటూ రైతుబిడ్డ శివాజికి చెప్పగా... నున్న రెచ్చ గొట్టకు.. నన్ను రెచ్చగొట్టకు అంటూ చెప్పుకొచ్చాడు. పిచ్చి పడుతుందిరా అంటూ ఫైర్ అయ్యాడు. ఆ తర్వాత అంబటి అర్జున్ మరింత గట్టిగా అరవగా... అమర్ దీప్ కాస్త కూలయ్యాడు. ఎవరు ఎంత చెప్పినా వినకుండా ఉండడంతో... అర్జున్ ఫుల్ అగ్రెసివ్ అయ్యాడు. దీంతో ఇల్లంతా ఫుల్ హీటెక్కకిపోయింది. పూర్తిగా ఏం జరిగిందో తెలియాలంటే ఈరోజుటి పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











