Bigg Boss Telugu 7: చరిత్ర సృష్టించిన అమర్‌దీప్.. ఇండియాలోనే తొలి కంటెస్టెంట్‌గా రికార్డు
ఎప్పటికప్పుడు ఊహించని టాస్కులు ఇస్తూ.. కంటెస్టెంట్ల ఎమోషన్స్‌ను, బలాబలాలను, వ్యక్తిత్వాన్ని బయటకు తీసుకు వచ్చే షోనే బిగ్ బాస్. రియల్ కంటెంట్‌తో నడిచే ఈ షో అన్ని భాషల కంటే తెలుగులోనే ఎక్కువ సక్సెస్ అయింది. ఫలితంగా వరుసగా సీజన్లను పూర్తి చేసుకుంటోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడో దాన్ని ఉల్టా పుల్టా కాన్సెప్టుతో పరిచయం చేస్తున్నారు. ఇందులో చిత్ర విచిత్రమైన సంఘటనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా అమర్‌దీప్ చౌదరి ఓ సెన్సేషనల్ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఆ సంగతులేంటో మీరే చూసేయండి మరి!
ఫైనల్ అస్త్ర అర్జున్‌దే
బిగ్ బాస్ ఏడో సీజన్‌కు సంబంధించి 13వ వారంలో 'ఫైనల్ అస్త్ర' టాస్క్ జరిగిన విషయం తెలిసిందే. ఆరంభం నుంచే ఎంతో ఆసక్తికరంగా సాగిన ఇందులో ఎన్నో చిత్ర విచిత్రమైన మలుపులు కనిపించాయి. ఒక్కొక్కరు ఎలిమినేట్ అవడంతో చివరి రౌండ్‌కు ఇద్దరే చేరుకున్నారు. అందులో అమర్‌దీప్ చౌదరిపై అంబటి అర్జున్ గెలిచి ఫైనల్ అస్త్రాన్ని సాధించాడు.

పాయింట్లలో అమర్
ఎన్నో ట్విస్టులతో సాగిన 'ఫైనల్ అస్త్ర' పోటీలో మొదటి శోభా శెట్టి, శివాజి ఓడిపోయిన తర్వాత తమ పాయింట్లను అమర్‌దీప్‌కు ఇచ్చారు. ఆ తర్వాత గౌతమ్ కూడా అతడి కోసమే త్యాగం చేశాడు. దీనికితోడు కొన్ని టాస్కుల్లో మంచి ప్రదర్శన చేయడంతో అమర్‌దీప్‌కు 1200 పాయింట్లు వచ్చాయి. వీటి పరంగా అర్జున్ కంటే అతడే టాప్‌లో నిలిచిన విషయం తెలిసిందే.
నాగార్జున ప్రశంసలు
'ఫైనల్ అస్త్ర' టాస్కులో అత్యధిక పాయింట్లను సాధించిన అమర్‌దీప్ చౌదరిని శనివారం జరిగిన ఎపిసోడ్‌లో హోస్ట్ అక్కినేని నాగార్జున ప్రశంసించాడు. టాస్కులు ఆడడంతో పాటు ఎలాగోలా పాయింట్లను సాధించి టాప్ ప్లేస్‌లో నిలిచావని అన్నాడు. మధ్యలో కొన్ని సెటైర్లు వేసినప్పటికీ మొత్తంగా అమర్‌దీప్ ఆటతీరును మాత్రం నాగార్జున మెచ్చుకున్నాడు.
కెప్టెన్ అనండి సార్
నాగార్జున మాట్లాడుతున్న సమయంలో అమర్‌దీప్ 'ఒక్క కోరిక ఉంది సార్.. మీరు తీర్చాలి. నన్ను కెప్టెన్ అమర్‌దీప్ అని ఒకసారి పిలవండి సార్ హ్యాపీగా ఫీలవుతాను' అన్నాడు. దీంతో నాగార్జున 'నీ కోసం.. నీ హార్ట్‌లో ఉన్న ఆ తీరని కోరిక కోసం.. నీకు వచ్చిన 1200 పాయింట్ల కోసం నువ్వే వచ్చే వారం కెప్టెన్. కానీ, నీకు ఇమ్యూనిటీ మాత్రం లభించదు' అని ఆఫర్ ఇచ్చాడు.
అన్నీ సౌకర్యాలతో
ఆట పరంగా కాకుండా తన పవర్‌తో అమర్‌దీప్ చౌదరిని స్పెషల్ కెప్టెన్ చేసిన నాగార్జున అతడికి వీఐపీ రూమ్‌లోకి యాక్సెస్ కూడా ఇచ్చాడు. అయితే, డిప్యూటీలుగా ప్రియాంక జైన్, శోభా శెట్టిలను మాత్రం పెట్టుకోవద్దని చెప్పాడు. ఆ తర్వాత అతడికి కెప్టెన్ బ్యాడ్జ్‌ను కూడా అందించి దీన్ని అఫీషియల్ చేశారు. అనంతరం శివాజి, అర్జున్‌ను అమర్ డిప్యూటీలుగా పెట్టుకున్నాడు.

ఇండియాలో ఫస్ట్
అమర్‌దీప్ చౌదరి కెప్టెన్ అవడంతో బిగ్ బాస్ షోలో సరికొత్త చరిత్ర నమోదు అయింది. ఎందుకంటే అతడిలా ఇప్పటి వరకూ ఇండియాలోని ఏ భాషలోనూ ఏ కంటెస్టెంట్ కూడా స్పెషల్ కెప్టెన్ అవలేదు. అంటే ఇమ్యూనిటీ లేకుండా ఇంటికి కెప్టెన్‌గా నిలవలేదు. అందులోనూ హోస్టు ద్వారా ఎంపిక అవలేదు. ఫలితంగా ఈ ఘనత సాధించిన కంటెస్టెంట్‌గా అమర్ రికార్డు సృష్టించాడు.


Click it and Unblock the Notifications











