Bigg Boss Telugu 7: టాప్ 5లోనే ఉండడు అనుకున్న కంటెస్టెంట్... టైటిల్ విన్నర్ రేసులోకి?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రోజు రోజుకు ఆసక్తి పెంచుతోంది. ఇక ఇప్పటికే ఈ షో 11 వారాలు పూర్తి చేసుకుని 12వ వారం కూడా సక్సెస్ ఫుల్ గా సాగుతోంది. ఇక ఈ షోలో ప్రస్తుతం పది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. అయితే ఓ కంటెస్టెంట్స్ టాప్ 5లోనే ఉండడు అని అంతా అనుకున్నారు.. కానీ ఇప్పుడు టైటిల్ రేసులో దూసుకుపోతున్నాడు. ఆ కంటెస్టెంట్ ఎవరు.. ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 సెప్టెంబర్ 3న ప్రారంభం అయింది. అయితే ఆ రోజున 14మంది కంటెస్టెంట్స్ వచ్చారు. అందులో ఒకరే అమర్ దీప్ చౌదరి. అప్పటి వరకు అమర్ దీప్ అంటే.. ఓ సీరియల్ యాక్టర్. ఇక హౌస్ లోకి అడుగుపెట్టాక... రైతు బిడ్డ ప్రశాంత్ మీద అటాక్ చేశాడు. రైతు బిడ్డ ట్యాగ్ వాడొద్దు అంటూ నామినేషన్స్ లో రెచ్చిపోయాడు. నేను బీటెక్ బాబును అంటూ రెచ్చిపోయి మాట్లాడాడు. ఇక బయట జనాలకు అమర్ దీప్ టార్గెట్ అయిపోయాడు.

Amardeep Chowdary Bigg Boss Telugu Season 7 Title Winner Race

ఇక అమర్ దీప్ రోజు రోజుకూ నెగిటివిటీ మూటగట్టుకున్నాడు. ఇక రతికా రోజ్ తో కలిసి... ప్రశాంత్ పై మరింత రెచ్చిపోయాడు. ఇక దానికి తోడు టాస్కుల్లో అమర్ దీప్ ఫెర్మామెన్స్ చూసి కూడా జనాలు ట్రోలింగ్ చేశారు. ఇక ఇటీవల కాలంలో అమర్ దీప్ తన ఆటతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. రోజు రోజుకు అమర్ గ్రాఫ్ పెరిగిపోతుంది.

ఇక మరోవైపు శివాజీ.. అమర్ దీప్ ను టార్గెట్ చేస్తూ.. బూతులు మాట్లాడటం.. ఇక జనాల్లో శివాజీపై నెగిటివిటీ.. అమర్ దీప్ పై పాజిటివిటీ పెరిగిపోతుంది. ఇక అమర్ దీప్ దానికి తగ్గట్లుగానే ఆటల్లో మెరుగు చూపిస్తూ దూసుకుపోతున్నాడు. అంతే కాదు.. శివాజీ ఎన్ని సార్లు టార్గెట్ చేసినా.. బూతులు తిట్టినా.. అమర్ దీప్ పట్టించుకోవడం లేదు.. కూల్ గా ముందుకు వెళ్తున్నాడు.

Amardeep Chowdary Bigg Boss Telugu Season 7 Title Winner Race

ఇక అమర్ దీప్ టాప్ 5లోనే ఉండడు అనుకున్న వారికి.. టైటిల్ విన్నర్ రేసులోకి దూసుకుపోతున్నాడు. ఇక ఈసారి టైటిల్ విన్నర్ అయినా ఆశ్చర్యం ఏమి లేదు. ఇక ఈ వారం నామినేషన్స్ లో శివాజీ, యావర్, ప్రశాంత్, అమర్ దీప్, అర్జున్, గౌతమ్, రతికా రోజ్, అశ్విని ఉన్నారు. ఇక వీరిలో శివాజీ కంటే ఎక్కువగా ఓటింగ్ తో అమర్ దీప్ దూసుకుపోతున్నాడు. దానికి కారణం ఆయనకు ఉన్న గ్రాఫ్ పెరగడం.

ఇక అమర్ దీప్.. ఫ్యామిలీ వీక్ లో తేజు వచ్చాకా చాలా మార్పు వచ్చింది. అంతకు ముందు అర్జున్ అంబటి వచ్చి.. అమర్ కు ఉన్న నెగిటివిటీ చెప్పినప్పటి నుంచి ఆయనలో మార్పు వచ్చింది. ఇక ఈ సారి టైటిల్ విన్నర్ లో శివాజీ, ప్రశాంత్, అమర్ దీప్ ఉన్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరగనుందో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X