బిగ్ బ్రేకింగ్: షోలో అమర్‌దీప్‌కు అస్వస్థత.. ఎమర్జెన్సీ ట్రీట్‌మెంట్ కోసం.. పరిస్థితి ఎలా ఉందంటే!

తెలుగులోకి పరిచయం అయినప్పటి నుంచే తెలుగులో నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. ఈ మధ్యలో ఎన్నో షోలు వచ్చినా.. దీన్ని మాత్రం బీట్ చేయలేకపోయాయి. అంతలా ఈ కార్యక్రమం బుల్లితెరపై హవాను చూపిస్తూ దూసుకెళ్తోంది. అందుకే తెలుగులో వరుసగా సీజన్లు ఒకదానికి మించి ఒకటి రెస్పాన్స్‌తో సక్సెస్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు నడుస్తోన్న ఏడో సీజన్ కూడా అదే రీతిలో ప్రసారం అవుతోంది. అయితే, తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో ఊహించని ఘటన జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం!

చివరి దశకు చేరడంతో కొత్తగా:బిగ్ బాస్ ఏడో సీజన్ ఆఖరి దశకు చేరుకున్న విషయం తెలిసిందే. దీంతో షో మరింత రంజుగా మారింది. మరీ ముఖ్యంగా గ్రాండ్ ఫినాలేకు సమయం దగ్గర పడడంతో కంటెస్టెంట్లంతా టాప్ 5లోకి చేరుకోడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే బిగ్ బాస్ కూడా చిత్ర విచిత్రమైన టాస్కులు ఇస్తున్నాడు. మొత్తానికి ఇప్పుడు ఈ షో ఆసక్తికరంగా నడుస్తోంది.

Amardeep Chowdary fell down in Bigg Boss House and Shifted to Medical Room

బిగ్ బాస్ మ్యాన్షన్ టాస్క్‌ అని:ఏడో సీజన్ ప్రస్తుతం జరుగుతోన్న వారంలో కెప్టెన్సీ పోటీదారుల కోసం 'బిగ్ బాస్ మ్యాన్షన్' టాస్క్ ఇచ్చారు. ఇందులో ఓ హంతకుడు హత్యలు చేస్తుంటాడు. అతడిని కనిపెట్టి పోలీసులు అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఇందులో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చిన వాళ్లు కెప్టెన్సీ పోటీదారులు అవుతారు. ఇందుకోసం కంటెస్టెంట్లకు కొన్ని పాత్రలను కూడా ఇచ్చారు.

పోలీసుగా అమర్‌దీప్ ఎంట్రీ:బిగ్ బాస్ మ్యాన్షన్‌లో ఓ హత్య జరిగిందని, దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసే ఆఫీసర్లుగా అంబటి అర్జున్, అమర్‌దీప్ చౌదరి వ్యవహరించాలని బిగ్ బాస్ చెప్పాడు. దీంతో వాళ్లిద్దరూ పోలీస్ గెటప్‌లు వేసుకుని వచ్చారు. తర్వాత అర్జున్, అమర్‌ను కన్ఫెషన్ రూమ్‌కు పిలిచిన బిగ్ బాస్.. వాల్లకు కొన్ని సలహాలు ఇచ్చాడు. ఈ టాస్కులో విఫలం అయితే ఔట్ అయినట్లే అని హెచ్చరించాడు.

అమర్‌దీప్ ఫన్నీ పోలీస్ రోల్:బిగ్ బాస్ మ్యాన్షన్ టాస్కులో అమర్‌దీప్ చౌదరి.. అర్జున్‌తో కలిసి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా నటించాడు. ఇందులో అతడు కామెడీ పోలీస్‌గా అందరినీ నవ్వించే ప్రయత్నం చేశాడు. రవితేజను పోలిన బాడీ లాగ్వేజ్‌తో పాటు ఫన్నీ పంచులతో తెగ సందడి చేసేశాడు. మొత్తానికి మొదటి రోజు టాస్కులో అతడు బాగా హైలైట్ అయ్యాడు. అంతలా ఆ పాత్రలో జీవించేశాడని చెప్పాలి.

Amardeep Chowdary fell down in Bigg Boss House and Shifted to Medical Room

అమర్‌దీప్‌‌కు ఆరోగ్య సమస్య:బిగ్ బాస్ మ్యాన్షన్ టాస్కులో ఓ ఊహించని సంఘటన జరిగినట్లు తాజాగా ఒక న్యూస్ బయటకు వచ్చింది. బుల్లితెర వర్గాల సమాచారం ప్రకారం.. ఈ టాస్కు జరుగుతోన్న సమయంలో పోలీస్ పాత్రను చేస్తున్న అమర్‌దీప్ చౌదరి ఒక్కసారిగా కళ్లు తిరిగి పడిపోయాడని తెలిసింది. దీంతో బిగ్ బాస్ వెంటనే టాస్కుతో పాటు ఇతర కార్యక్రమాలను సైతం ఆపేశాడని సమాచారం.

ఎమర్జెన్సీ ట్రీట్‌మెంట్ కోసం:అస్వస్థతకు గురై పడిపోయిన అమర్‌దీప్ చౌదరిని ఇంటి సభ్యులు బిగ్ బాస్ హౌస్‌లోని మెడికల్ రూమ్‌కు తరలించారని తెలిసింది. అక్కడ అతడికి అత్యవసర చికిత్సను చేసేందుకు వైద్యులను రప్పించారని సమాచారం. వాళ్లు అతడికి కొన్ని ప్లూయిడ్స్ (సెలైన్స్) కూడా ఎక్కించారని తెలుస్తోంది. ఇదంతా ఈరోజు ఎపిసోడ్‌లో చూపించే అవకాశం ఉందని అంటున్నారు.

అమర్ పరిస్థితి ఎలా ఉంది?:బిగ్ బాస్ వర్గాల సమాచారం ప్రకారం.. అమర్‌దీప్ చౌదరి ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు మెరుగ్గానే ఉందని తెలిసింది. ప్రస్తుతం అతడు ఇంటి సభ్యులతో కలిసి హౌస్‌లోనే ఉన్నాడని సమాచారం. డీహైడ్రేషన్‌కు గురవడం వల్ల అమర్ కళ్లు తిరిగి పడిపోయాడని తెలుస్తోంది. చికిత్స అయిన తర్వాత అతడు కోలుకున్నాడట. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X