Bigg Boss Telugu 7: షోలో చెండాలమైన సీన్.. ఆమెను అక్కడ టచ్ చేసిన అమర్.. తట్టుకోలేక కొరికేసిన లేడీ

బుల్లితెర ప్రేక్షకులు గతంలో ఎప్పుడూ చూడని కాన్సెప్టుతో ప్రసారం అవుతోన్నా.. సరికొత్త టాస్కులను తీసుకొస్తూ మజాను పంచుతోన్న ఏకైక షో బిగ్ బాస్. హౌస్‌లో ఉండే కంటెస్టెంట్ల మధ్య గొడవలు, గ్రూపు తగాదాలు, ప్రేమ కహానీలు, అప్పుడప్పుడూ రొమాన్స్, ఎమోషనల్ సీన్స్ ఇలా అన్నింటినీ చూపిస్తూ భారీ స్థాయిలో రేటింగ్‌ను అందుకుంటోంది. ఇక, ఇప్పుడు ప్రసారం అవుతోన్న ఏడో సీజన్ కూడా ఎంతో రంజుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ వారంలో టికెట్ టు ఫినాలే టాస్కును తెచ్చారు. ఇందులో చెండాలమైన సంఘటన జరిగింది. ఆ వివరాలు మీకోసం!

టికెట్ టు ఫినాలే టాస్క్
ప్రతి సీజన్‌లోనూ గ్రాండ్ ఫినాలే వీక్‌కు రెండు వారాల ముందే హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లకు 'టికెట్ టు ఫినాలే' అనే టాస్కును ఇస్తూ ఉంటారు. ఇది గెలుచుకున్న ఒక కంటెస్టెంట్ నేరుగా ఫైనల్‌లోకి అడుగు పెడతారు. ఇందులో భాగంగా ఏడో సీజన్‌కు సంబంధించి టికెట్ టు ఫినాలే టాస్కును 13వ వారంలో ప్లాన్ చేశారు. కొన్ని రౌండ్లలో ఈ టాస్క్ జరుగుతుందని చెప్పారు.

Amardeep Chowdary Fight With Priyanka Jain in Bigg Boss Telugu 7 Show

మొదటి రౌండ్‌ అర్జున్
'టికెట్ టు ఫినాలే' టాస్కులో భాగంగా మొదటి రౌండ్‌లో కంటెస్టెంట్లు అందరూ పోడియం మీద నిల్చుని ఉండగా.. ఓ కర్ర తిరుగుతూ ఉంటుంది. దానికి తగలకుండా కంటెస్టెంట్లు తప్పించుకోవాల్సి ఉంటుంది. ఇది ఎంతో ఆసక్తికరంగా సాగింది. ఇందులో అర్జున్ గెలిచాడు. తద్వారా వంద పాయింట్లను సంపాదించుకుని స్కోర్ బోర్డులో టాప్ ప్లేస్‌కు చేరుకున్నాడు.

రెండో రౌండ్‌ ప్రశాంత్
'టికెట్ టు ఫినాలే' టాస్కులో భాగంగా రెండో రౌండ్‌లో ఫ్లవర్ టాస్కును ఇచ్చారు. ఇందులో యాక్టివిటీ ఏరియాలో పెట్టిన పువ్వులను కంటెస్టెంట్లు తీసుకుని వచ్చి తమకు కేటాయించిన ప్లేస్‌లో పెట్టాలి. ఎవరైతే ఎక్కువ తెస్తారో వాళ్లకు వంద పాయింట్లు వస్తాయి. ఈ రౌండ్‌లో పల్లవి ప్రశాంత్ అందరి కంటే ఎక్కువ పువ్వులు తెచ్చాడు. తద్వారా ఈ సారి విజేతగా నిలిచాడు.

మూడో రౌండ్ గేలంతో
'టికెట్ టు ఫినాలే' టాస్కులో మూడో రౌండ్‌లో 'గేలం వేసి బాల్ పట్టు' అనే టాస్కును ఇచ్చారు. ఇందులో ఓ సర్కిల్ లాంటి దానికి తాడు కట్టి ప్రతి కంటెస్టెంట్‌కు ఇచ్చారు. వాళ్లు దాన్ని విసిరి మధ్యలో ఉన్న బాల్‌ను తమ వైపునకు లాక్కుని బాస్కెట్‌లో వేసుకోవాల్సి ఉంటుంది. అయితే, ఆ బాల్ బయటకు వచ్చిన తర్వాత ఎవరైనా లాక్కోవచ్చని సంచాలకులు రూల్ పెట్టారు.

Amardeep Chowdary Fight With Priyanka Jain in Bigg Boss Telugu 7 Show

మళ్లీ అర్జునే ముందు
'గేలం వేసి బాల్ పట్టు' టాస్కులో మరోసారి అర్జున్ తనదైన ఆటతీరును ప్రదర్శించాడు. తద్వారా అందరి కంటే ముందే బాల్‌ను తన బాస్కెట్‌లో వేసుకుని 100 పాయింట్లు సొంతం చేసుకున్నాడు. అతడి తర్వాత ప్రశాంత్, గౌతమ్, ప్రిన్స్ యావర్‌లు బాల్‌ను అందుకుని టాస్కును విజయవంతంగా ముగించుకున్నారు. తద్వారా పాయింట్లను కూడా అందుకున్నారు.

అమర్‌‌తో ప్రియాంక
'గేలం వేసి బాల్ పట్టు' టాస్కులో భాగంగా చివరి రౌండ్‌లో ప్రియాంక జైన్, అమర్‌దీప్‌లు మిగిలారు. ఆమె అందరి కంటే ముందు బాల్‌ను తన వైపు లాక్కోగా.. దాని కోసం అతడు పోటీ పడ్డాడు. అప్పుడు ప్రియాంక బాల్‌ను తన బాడీకి గట్టిగా పట్టుకుని ఉండగా.. దాన్ని అమర్ లాక్కోడానికి ఆమెను ఎక్కడపడితే అక్కడ టచ్ చేశాడు. ఆమె ఇబ్బంది పడినా బాల్‌ను మాత్రం వదల్లేదు.

కొరికేసి.. ఏడ్చేసింది
అమర్‌దీప్ ఇబ్బంది పెట్టేలా లాక్కునే ప్రయత్నం చేయడంతో ప్రియాంక తట్టుకోలేకపోయింది. ఒకానొక సందర్భంలో అతడి చేతిని కొరికేసింది. ఆ తర్వాత ఆమెను అతడు పైకి లేపి కింద పడేశాడు. ఇక, చేసేదేం లేక టాస్కులో ప్రియాంక ఓడిపోయింది. ఆ తర్వాత అమర్‌పై అసహనం వ్యక్తం చేసింది. మొత్తానికి ఈ టాస్క్‌లో అమర్ ప్రవర్తన విమర్శలకు తావిస్తోందని చెప్పాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X