Amardeep: నీ ఛానల్ చాలు.. నువ్వేంటో తెలుసుకోడానికి.. బూతులతో రైతుబిడ్డపై రెచ్చిపోయిన అమర్

బిగ్ బాస్ సీజన్ 7 నాలుగో వారం ఆసక్తిగా సాగుతోంది. ఇక నామినేషన్స్ ప్రక్రియలో ఒకరినొకరు నామినేట్ చేసుకునే క్రమంలో గొడవలు తలెత్తాయి. కంటెస్టెంట్స్ అంతా ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. ఇక అమర్ దీప్ విషయానికి వస్తే.. బూతులతో రెచ్చిపోయాడు. ఈసారి అమర్ దీప్... గౌతమ్, ప్రశాంత్ లను నామినేట్ చేయగా...ఆ క్రమంలో గొడవలు వచ్చాయి. ఇక ప్రశాంత్ పై మరోసారి అమర్ దీప్ రెచ్చిపోయి మాట్లాడాడు. ఆ వివరాల్లోకి వెళితే....

బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు మొదటి నుంచి ఉల్టా పుల్టా అంటూ చెప్పుకు వచ్చారు. అందుకు తగ్గట్లుగానే ఈసారి గేమ్ అంతా ఉల్టా పుల్టాగా సాగుతోంది. ఇప్పటికే ముగ్గురు ఎలిమినేట్ అవ్వగా... హౌజ్ లో మిగిలింది 11 మంది కంటెస్టెంట్స్. ఇక వారిలో ముగ్గురు హౌజ్ మెట్స్ గా ఎంపికయ్యారు. ఇక మిగిలిన 8 మంది నామినేషన్స్ లో పాల్గొన్నారు. ముగ్గురు హోజ్ మేట్స్ ను జ్యూరీ సభ్యులుగా బిగ్ బాస్ నియమించాడు.

Amardeep Chowdary Fires on Pallavi Prashanth and Shubha Shree in Bigg Boss Telugu 7 Day 23 Episode

ఇక అమర్దీప్... ప్రశాంత్, శుభశ్రీలను నామినేట్ చేస్తున్నట్లు చెప్పాడు. ముందుగా శుభశ్రీని నామినేట్ చేయగా.... నేను గేమ్ ఆడలేదు అని నువ్వు అనడం నాకు నచ్చలేదనే రీజన్ తో ఆమెను నామినేట్ చేశాడు. గుండు గీయించుకుంటే నేను ఇన్‌సెక్యూరిటీ ఫీలవుతాను.. దాన్ని ఎన్ని సార్లు చెప్పినా మళ్లీ అదే పాయింటుతో నన్ను నామినేట్ చేశావ్... నేను ఓడిపోయాను అంటూ మళ్లీ మళ్లీ అనడం కరెక్ట్ కాదు.. నేను హార్ట్ అయ్యాను... నా మనోభావాలు దెబ్బ తిన్నాయి.. అందుకే నామినేట్ చేస్తున్నా అంటూ చెప్పుకు వచ్చాడు అమర్.

ఇక ప్రశాంత్ విషయానికి వస్తే... అమర్ దీప్ చెప్పిన రీజన్ ప్రశాంత్ కు రెండు ముఖాలు ఉన్నాయని. నువ్వు నటిస్తున్నావ్ రా.. నన్ను కంటెండర్‌గా సెలక్ట్ చేసినప్పుడు నువ్వు ఏడ్చావ్.. ఒక్కోసారి ఒక్కోలా ఉంటావ్.. అసలు నువ్వు ఏంటి.. నీకు రెండు ముఖాలు ఉన్నాయ్.. ఆ మాస్క్ తీసేసి నువ్వు ఎలా ఉండాలో అలా ఉండాలి.. నీ ట్రూ కలర్ నేను చూడాలి.. రెండు ముఖాలు వద్దు రెండు నాలుకలు వద్దు.. అంటూ అమర్ ప్రశాంత్ పై రెచ్చిపోయాడు. దీనికి ప్రశాంత్ కూడా కాసేపు వాదించుకున్నాడు.

అయితే జ్యూరీగా కూర్చొన్న శివాజీ, ఆట సందీప్, శోభా శెట్టి... ఇద్దరికీ చెప్పిన రీజన్లు సిల్లీగా ఉన్నాయంటూ అమర్‌కు చెప్పారు. దీంతో ప్రశాంత్ నవ్వాడు. ఇక అప్పుడు అమర్... నువ్వు నవ్వద్దురా రేయ్.. నువ్వు నవ్వితే నాకు కాలుద్ది.. అంటూ ఫైర్ అయ్యాడు. ఇక నేను ఇలానే ఉంటాను అంటూ ప్రశాంత్ అన్నాడు. రేయ్ అమర్‌దీప్ ఎలా ఉంటాడనేది బయట జనాలకి కాదు కదా ప్రతి ఒక్కరికి తెలుసు.. కోపం వస్తే ఇలానే మాట్లాడతాడు.. అంటూ అమర్ విరుచుకుపడ్డాడు.

దీనికి కూడా ప్రశాంత్.... ప్రపంచంలో పల్లవి ప్రశాంత్ ఒక్కడే ఉన్నాడు.. అలాంటోడు వేరే వాడు లేడు అన్నాడు. దాంతో అమర్ పక్కనే ఉన్న ఊసలను గుద్దేసి అమర్ అనే వాడు కూడా ఒక్కడే ఉంటాడు రా.. అంటూ రెచ్చిపోయాడు. అయినా నీ గురించి తెలుసుకోవడానికి గూగుల్ ఎందుకు... నీ ఛానల్ చాలు బొక్కలోది అంటూ బూతులు మాట్లాడాడు అమర్ దీప్. ఇక మొత్తం ఆలోచించి శుభశ్రీ ఎలాగూ అమర్‌ని నామినేట్ చేసింది కాబట్టి.. శుభశ్రీని నామినేట్ చేస్తున్నట్లు జ్యూరీ చెప్పుకువచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X