Bigg Boss Telugu 7: అమర్‌దీప్ నీచమైన పని.. యావర్ ఆరోగ్యంతో ఆటలు.. ఫినాలే ముందు మరో షాక్
మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా ఎన్నో రకాల కార్యక్రమాలను తెలుగు బుల్లితెరపై తీసుకు వస్తున్నారు. అలా వచ్చి సెన్సేషన్ అయిన షోనే బిగ్ బాస్. అసలు ఏమాత్రం పరిచయం లేని కంటెంట్‌తో వచ్చినా.. ఇది తక్కువ సమయంలోనే సూపర్ హిట్ అయింది. ఇలా ఇప్పటికే ఎన్నో సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో.. ఇప్పుడు ఏడో దాన్ని కూడా విజయవంతంగా కంప్లీట్ చేసుకోబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో అమర్‌దీప్ చౌదరి నీచమైన పని చేసి మరోసారి విమర్శలను ఎదుర్కొంటోన్నాడు. అసలేం జరిగింది? ఆ వివరాలు మీకోసమే!
ఉల్టా పుల్టా కాన్సెప్టుతో క్రేజ్:బిగ్ బాస్ ఏడో సీజన్‌ను ఉల్టా పుల్టా అనే కాన్సెప్టుతో తీసుకు వచ్చారు. అంచనాలకు ఏమాత్రం తీసిపోని విధంగానే ఇందులో అన్నీ ఊహించని సంఘటలనే చూపిస్తున్నారు. ముఖ్యంగా ప్రతి టాస్కులోనూ వైవిధ్యాన్ని చూపించడంతో పాటు ఎన్నో ట్విస్టులు, సర్‌ప్రైజ్‌లను ఇస్తున్నారు. ఫలితంగా ఈ సీజన్ క్రేజ్ తెచ్చుకుని అనుకున్న దానికంటే ఎక్కువగానే రేటింగ్ రాబడుతోంది.

మొదలైన విన్నర్ ఓటింగ్:ఉల్టా పుల్టాగా సాగుతోన్న బిగ్ బాస్ ఏడో సీజన్‌లో ప్రతి అంశం కూడా భిన్నంగానే కనిపిస్తోంది. ఇప్పటి వరకూ జరిగిన ఏ సీజన్‌లోనూ చూపించని ఎన్నో అంశాలను ఇందులో ప్రసారం చేస్తున్నారు. ముఖ్యంగా 14వ వారంలోనే విన్నర్‌ను డిసైడ్ చేసే ఓటింగ్‌ను మొదలు పెట్టారు. దీని ప్రకారమే ఈ వారం ఎలిమినేషన్‌తో పాటు విజేతను కూడా డిసైడ్ చేయబోతున్నారు.
ఓట్ అప్పీల్ టాస్కులతో:సాధారణంగా బిగ్ బాస్ షోలో ఏ సీజన్‌లో అయినా లాస్ట్ రెండు వారాలు ఆటపాటలతో సందడిగా సాగిపోతుంటాయి. కానీ, ఏడో సీజన్‌లో మాత్రం ఓట్ అప్పీల్ టాస్కులను తీసుకు వచ్చారు. ఇవి మాత్రం బీభత్సమైన గొడవలతో సాగుతోన్నాయి. కంటెస్టెంట్లు ఆడేటప్పుడు మాత్రమే కాదు.. ఓటింగ్ వేసే సమయంలోనూ వాగ్వాదాలకు దిగుతున్నారు. దీంతో ఇవి రంజుగా సాగుతున్నాయి.

అమర్‌దీప్ రెచ్చిపోయాడు:ఈ వారంలో జరుగుతున్న ఓట్ అప్పీల్ టాస్కుల్లో అమర్‌దీప్ చౌదరి రెచ్చిపోతున్నాడు. అంటే ఆట పరంగా కాదు.. మిగిలిన వాళ్లతో గొడవలు పెట్టుకోడానికి రెడీగా ఉంటున్నాడు. రెండు రోజుల క్రితం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో అమర్‌దీప్.. పల్లవి ప్రశాంత్‌తో వ్యవహరించిన తీరు.. అతడిని తోసేసిన విధానంపై ఎన్నో రకాల విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే.
ఓట్ వేయలేని యావర్‌తో:ఓట్ అప్పీల్ టాస్కులో గెలిచిన ఇద్దరు కంటెస్టెంట్లలో ఒకరికి ప్రేక్షకుల ముందు ఓటును అభ్యర్థించే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా ఓ రౌండ్‌లో అంబటి అర్జున్, అమర్‌దీప్ చౌదరికి చాన్స్ వచ్చింది. అప్పుడు అతడికి ప్రిన్స్ యావర్ వ్యతిరేకంగా ఓట్ వేయడం అమర్ తప్పుకోలేకపోయాడు. దీంతో అతడితో కూడా అనుచితంగా ప్రవర్తిస్తూ గొడవ పెట్టుకున్నాడు.

రోటీలను మార్చిన అమర్:బిగ్ బాస్ ఏడో సీజన్‌లో 14వ వారం కెప్టెన్‌గా ఉన్న అమర్‌దీప్.. తనకు నచ్చని వాళ్ల పట్ల క్రూరంగా వ్యవహరిస్తున్నాడు. ఈ విషయం తాజాగా ఓ వీడియో ద్వారా బయటకు వచ్చింది. ఇందులో ప్రిన్స్ యావర్ కోసం నెయ్యి లేని రోటీలు చేసి ఉంచారు. కానీ, తనతో గొడవ పెట్టుకున్నాడన్న కారణంగా వాటిని నెయ్యి వేసి చేసిన వాటిలో కలిపేసి అతడి ఆరోగ్యంతో ఆటలు ఆడుకున్నాడు.
హౌస్ కోసం.. దారుణంగా:వాస్తవానికి యావర్ అంతకు ముందే కేక్ తినే టాస్కును హౌస్ కోసం ఆడాడు. దీంతో కడుపులో ఇబ్బందిగా ఉందని నెయ్యి లేని రోటీలను అడిగాడు. కానీ, అమర్‌దీప్ మాత్రం క్రూరంగా వ్యవహరించాడు. దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేసి అతడిని నెటిజన్లు ఆడుకుంటున్నారు. అదే సమయంలో బండ బూతులు తిడుతూ దారుణంగా విమర్శలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











