Bigg Boss Telugu 7: 1000 పాయింట్లతో టాప్‌లో ఆ కంటెస్టెంట్... ఇక విన్నర్ అతడే!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 మరో 17 రోజుల్లో ముగియనుంది. రోజు రోజుకు ఆసక్తి కలిగిస్తున్న ఈ రియాలిటీ షోలో అనుహ్యా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇక ప్రస్తుతం హౌస్ లో ఈ వారం టికెట్ టు ఫినాలే రేస్ జరుగుతోంది. ఇందులో భాగంగా కంటెస్టెంట్స్ మధ్య బిగ్ బాస్ టాస్కులు నిర్వహిస్తూ వస్తున్నాడు. 'టికెట్ టు ఫినాలే'లో భాగంగా ఇచ్చిన టాస్క్‌ల్లో కంటెస్టెంట్స్ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇక 1000 పాయింట్లతో ఓ కంటెస్టెంట్ టాప్ లో నిలిచాడు. దీనితో ఈ టికెట్ టు ఫినాలే టాస్క్ విన్నర్ అతనే అంటున్నారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బిగ్ బాస్ హౌస్ లో ఇంటి సభ్యులందరూ తుది సమరానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం హౌస్ లో 'టికెట్ టు ఫినాలే' రేస్ జరుగుతుంది. ఈ క్రమంలో బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్‌ల్లో కంటెస్టెంట్స్ పాల్గొంటున్నారు. బిగ్ బాస్ ఇచ్చిన టాస్కులు రసవత్తరంగా సాగుతున్నాయి. ప్రస్తుతానికి హౌస్ లో 8 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. అందరూ ఫినాలే అస్త్రన్ని దక్కించుకునేందుకు పోటా పోటీగా పాల్గొంటున్నారు.

ఫినాలే అస్త్ర రేస్ నుంచి ఇప్పటి వరకు ఐదుగురు కంటెస్టెంట్స్ ఔట్ అయ్యారు. మొదటగా శివాజీ, శోభా శెట్టి ఔట్ అవ్వగా.. బిగ్ బాస్ ఓ ట్విస్ట్ ఇచ్చాడు. అప్పటి వరకు సంపాదించిన పాయింట్స్ ఎవరికైనా ఇవ్వాల్సి ఉంటుందని చెప్పాడు. దీంతో అమర్ దీప్ నాకు ఇవ్వు అన్న అంటూ బతమిలాడుకున్నాడు. నీకు శోభా ఇస్తుంది అని శివాజీ తప్పించుకునే ప్రయత్నం చేయగా.. బిగ్ బాస్ ఇద్దరు ఓకే వ్యక్తికి ఇవ్వాల్సి ఉంటుందని చెప్పాడు. దీంతో శోభాతో పాటు శివాజీ తన పాయింట్స్ ను అమర్ దీప్ కు ఇవ్వాల్సి వచ్చింది.

ఇక ఆ తర్వాత యావర్ ఔట్ అవ్వగా.. తన పాయింట్స్ ను ప్రశాంత్ కు షేర్ చేశాడు. ఇక ప్రియాంక ఔట్ అయితే... అమర్ దీప్ కు ఇస్తుందని చాలా మంది అనుకున్నారు. ఇక ప్రియాంక.. అమర్ కు షాక్ ఇచ్చి.. గౌతమ్ కు ఇచ్చింది. దీంతో అమర్ దీప్ కూడా హార్ట్ అయినట్లు తెలుస్తోంది. ఇక గౌతమ్ ఔట్ అవ్వగా.. ప్రియాంక.. అమర్ కు ఇవ్వు అని చెప్పి.. అమర్ దీప్ కు ఇప్పించింది. ఇక ప్రస్తుతానికి హౌస్ నుంచి 5 మంది ఔట్ అయ్యారు.
ప్రస్తుతం టికెట్ టు ఫినాలే రేసులో ఉన్నది ముగ్గురు కంటెస్టెంట్స్. పల్లవి ప్రశాంత్, అమర్ దీప్, అర్జున్ అంబటి. వీరి ముగ్గురిలోనే ఒకరు ఆ అస్త్రాన్ని గెలుచుకుని డైరెక్టుగా ఫినాలేకి చేరుకుంటారు. అయితే వీరి ముగ్గురు పాయింట్స్ గనుగ చూస్తే.. అమర్ దీప్ టాప్ లో ఉన్నాడు. అమర్ దీప్ 1000 పాయింట్లతో ముందంజలో ఉన్నాడు. ఆ తర్వాతి స్థానంలో ప్రశాంత్ 860 పాయింట్లతో సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు.

ఇక మూడో స్థానంలో అర్జున్ 710 పాయింట్లతో ఉన్నాడు. అయితే ఈ ముగ్గురికి ఇంకా పోటీలు జరిగే అవకాశం ఉంది. అయితే అమర్ దీప్, ప్రశాంత్ కంటే అర్జున్ కు ఆ ఫినాలే అస్త్ర చాలా ముఖ్యం. ఎలాగూ అమర్, ప్రశాంత్ టాప్ 5లో ఉంటారు.. అర్జున్ ఇది గెలుచుకుంటే.. ఫినాలేకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. చూడాలి మరి ఎవరు గెలుచుకుని ఫినాలేకి చేరుకుంటారు అనేది.


Click it and Unblock the Notifications











