Bigg Boss Telugu 7: ఫ్యామిలీ ఎపిసోడ్‌లో కలకలం.. ఆమెను అవమానించిన తేజస్విని.. కాళ్లు పట్టుకున్న అమర్

తెలుగులో ప్రసారం అయ్యే సక్సెస్‌ఫుల్‌ షోలలో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు బిగ్ బాస్‌దే అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అంతలా ఇది ఏడేళ్లుగా బుల్లితెరపై హవాను చూపిస్తూ దూసుకుపోతోంది. అందుకే ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఆరు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకోగలిగింది. ఈ క్రమంలోనే ఇటీవలే షో నిర్వహకులు ఏడో సీజన్‌ను కూడా ప్రారంభించారు. ఇందులో ప్రస్తుతం ఫ్యామిలీ వీక్ జరుగుతోంది. ఈ సందర్భంగా ఎవరూ ఊహించని షాకింగ్ సీన్ ఒకటి జరిగింది. అసలేమైంది? ఆ పూర్తి వివరాలను మీరే చూడండి!

హ్యాపీగా, శాడ్‌గా ఫ్యామిలీ వీక్:బిగ్ బాస్ ఏడో సీజన్‌ ఉల్టా పుల్టా కాన్సెప్టుతో ఎవరూ ఊహించని విధంగా సాగుతోంది. ఇందులో ఎన్నో ఆసక్తికరమైన పరిణామాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ సీజన్‌లో ఫ్యామిలీ వీక్‌ను నిర్వహకులు ప్లాన్ చేశారు. కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులు హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. దీంతో ఈ వారం మొత్తం హ్యాపీ, శాడ్‌ మూమెంట్లు కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి.

Amardeep Chowdary Wife Shows Angry on Priyanka Jain in Bigg Boss Telugu 7 Show

కన్‌ఫెషన్ రూమ్‌లోకి పిలిచి:ఫ్యామిలీ వీక్‌లో భాగంగా గురువారం జరిగిన ఎపిసోడ్‌లో అమర్‌దీప్ చౌదరి కోసం అతడి భార్య తేజస్విని ఎంట్రీ ఇచ్చింది. అయితే, అప్పటికే అతడిని కన్‌ఫెషన్ రూమ్‌కు పిలిచి 'నీ భార్య రావడం కుదరలేదు. అందుకే కేక్ మాత్రం పంపించింది' అని బిగ్ బాస్ చెప్పాడు. దీంతో నిరాశ చెందుతూ హౌస్‌లోకి వచ్చాడు. అయితే, అప్పటికే అక్కడ తేజూ ఉండడంతో షాకయ్యాడు.

నవ్వుకుంటూనే.. కేక్ కటింగ్:బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చిన తన భార్య తేజస్వినిని చూసిన అమర్‌దీప్ లోలోపలే ఎమోషనల్ అయ్యాడు. 'నువ్వు వచ్చినా ఏడవకూడదని ఫిక్స్ అయ్యాను. చాలా సార్లు గుర్తొచ్చావు. కానీ, ఎప్పుడూ ఏడవలేదు. ఏడ్చినా కనిపించకుండా ఏడ్చాను' అని తేజస్వినితో చెప్పాడు. అనంతరం బిగ్ బాస్ పంపించిన కేక్‌ను అందరి సమక్షంలోనే అమర్‌దీప్ కట్ చేశాడు.

Amardeep Chowdary Wife Shows Angry on Priyanka Jain in Bigg Boss Telugu 7 Show

రింగ్ ఇచ్చి.. శివాజి బ్లెస్సింగ్:బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టిన తేజస్విని తమ ఎంగేజ్‌మెంట్ రింగ్‌ను కూడా తీసుకుని వచ్చింది. అమర్‌దీప్ కేక్ కట్ చేసిన తర్వాత అందరి మధ్యన ఆ రింగ్‌ను భర్తకు తొడిగేసింది. అనంతరం అక్కడే ఉన్న శివాజి కాళ్లకు వీళ్లిద్దరూ నమస్కరించారు. దీంతో అతడు అమర్‌ - తేజస్విని జంటను ఆశీర్వదించాడు. ఆ తర్వాత అందరూ సరదాగా మాట్లాడుకున్నారు.

ప్రియాంక సైగలతో డౌట్లు:తేజస్విని బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎవరూ ఊహించని సన్నివేశాలు చాలానే కనిపించాయి. ముఖ్యంగా ఆమె ప్రియాంక జైన్‌తో ముభావంగా వ్యవహరిస్తూ కనిపించింది. అందుకే కేక్ కట్ చేసిన తర్వాత దాన్ని తినిపించేందుకు అమర్‌దీప్.. ప్రియాంకను రమ్మని సైగలు చేశాడు. కానీ, ఆమె మాత్రం తల అడ్డంగా ఊపింది. దీంతో అందరిలో డౌట్ మొదలైంది.

Amardeep Chowdary Wife Shows Angry on Priyanka Jain in Bigg Boss Telugu 7 Show

తేజస్విని అవమానించేలా:అమర్‌దీప్ పిలిచినా ప్రియాంక జైన్ వెళ్లకపోవడంతో శివ్‌కుమార్ చెప్పడం వల్లే ఆమె దూరంగా ఉంటుందా అని అంతా అనుకున్నారు. కానీ, రాత్రి సమయంలో తన దగ్గరకు వచ్చి ఏమైందని అడిగిన అమర్‌తో 'తేజూ వచ్చిన తర్వాత నాతో సరిగా మాట్లాడలేదు. హగ్ ఇచ్చినా అఇష్టంగానే ఇచ్చింది. తనకు ఇబ్బంది ఉందనే నేను నీ దగ్గరకు రాలేదు' అని ప్రియాంక చెప్పింది.

కాళ్లు పట్టుకున్న అమర్:తేజస్విని వల్ల అవమానంగా ఫీల్ అయినట్లు ప్రియాంక జైన్ చెప్పడంతో అమర్‌దీప్ కూడా బాధపడ్డాడు. ఆ వెంటనే బెడ్‌పై పడుకుని ఉన్న ఆమె కాళ్లను పట్టుకుని 'తేజూ నీతో ఎందుకలా చేసిందో నాకు తెలీదు. కానీ, తన తరపున నీకు క్షమాపణలు చెప్తున్నా' అని అన్నాడు. మొత్తానికి శివ్‌కుమార్, తేజూ ప్రవర్తనతో అమర్ - ప్రియాంక మధ్య దూరం పెరిగిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X