Bigg Boss Telugu 7: అర్ధరాత్రి బిగ్‌బాస్ ఇంట్లో దెయ్యం..కళ్లారా చూశానంటున్న అమర్‌దీప్,ఆందోళనలో ఆడ కంటెస్టెంట్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన రేటింగ్ తో దూసుకెళ్తున్న ఈ షో చూసేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు విపరీతమైన ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా అద్భుతమైన టాస్క్ లు ఇవ్వడం, అంతకు మించిన ఎమోషన్లు పండించడంలో బిగ్ బాస్ టీం నిర్వాహకులు సఫలం అవుతున్నారు. అలాగే ఇంట్లో ఉన్న కంటెస్టెంట్లు కూడా ఏదో ఒకటి చేసి గెలవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. తమకు వచ్చిందే చేసి చూపిస్తూ అభిమానుల్ని అలరిస్తున్నారు.
అయితే టాస్క్ లు ఆడడం, పాటలు పాడడం, డ్యాన్సులు చేయడం, కామెడీ చేయడం వంటివి మనం ఇప్పటి వరకు చాలానే చూశాం. అలాగే ఒకరి గురించి ఒకరు గాసిప్స్ మాట్లాడుకోవడం, గొడవలు పెట్టుకోవడం, ఏడవడం, నవ్వడం వంటి కూడా మనకు తెలిసిందే. కానీ అమర్ దీప్ చేసిన ఓ పనికి మాత్రం అంతా భయపడుతున్నారు. అర్థరాత్రి ఆడవాళ్ల పక్కను కూర్చొని మరీ అనసవరమైన ముచ్చట్లు చెప్పి వారి ఆగం చేశాడు. అసలు అమర్ దీప్ ఏం చెప్పాడు, ఆడ కంటెస్టెంట్లు ఎందుకు అంతలా భయపడ్డారో మనం ఇప్పుడు తెలుసకుందాం.

తాజాగా అంటే నిన్న వచ్చిన ఎపిసోడ్ లో అమర్ దీప్ చేసిన ఈ పనిని చూపించలేదు. కానీ 24 గంటలు చూపించే బిగ్ బాస్ షోలో మాత్రం దీన్ని చక్కగా చూపించారు. దీంతో ప్రస్తుతం అమర్ దీప్ చేసిన ఈ పని వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయితే అందులో ఏముంది అంటే.. అమర్ దీప్ ఓ బెడ్డుపై డీలక్స్ రూంలో కూర్చొని ఉన్నాడు. అలాగే ఆయన పక్కన బెడ్ పై శోభా శెట్టి, ప్రియాంక జైన్ లు పడుకొని ఉన్నారు. వారిద్దరికీ అపోజిట్ లో ఉన్న బెడ్ పై రతికా రోజ్ పడుకొని ఉంది. వారంతా ఇంకా అప్పటికీ పడుకోలేదు.
అయితే అక్కడకు వెళ్లిన అమర్ దీప్ వారికి సీరియస్ గా ఓ విషయం చెప్పడం ప్రారంభించాడు. ఈ రూంలో ఏదో పరిగెడుతున్నట్లు తనకు కనిపించిందని.. స్పార్క్ లా అనిపించదని అన్నాడు. ఏంటీ అంటూ ప్రియాంక, శోభా శెట్టి భయపడుతూ అడిగారు. దానికి రాత్రి పూట కాగానే కళ్ల ముందు నుంచి ఏదో పరిగెట్టినట్లు అనిపిస్తుందని అమర్ దీప్ వివరించాడు. శోభా శెట్టి ఎప్పుడురా అంటూ టెన్షన్ పడగా.. రతికా రోజ్ ఇప్పుడు ఇలాంటి టాపిక్ అవసరమా అని అడిగింది.

కానీ అమర్ దీప్ మాత్రం ఆపకుండా.. దాని కాలి గోరు ఇలా ఉందంటూ వేళ్లను మొత్తం తిప్పేస్తూ చూపించాడు. అయితే అమర్ దీప్ కావాలనే కథలు చెబుతున్నాడని అర్థం చేసుకున్న ప్రియాంక జైన్ నవ్వుతూ శోభా శెట్టిని చూసింది. కానీ రతికా రోజ్ మాత్రం ఫుల్ భయపడిపోతూ కనిపించింది. అమర్ దీప్ ఇలా చేయడంతో ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్ గా మారింది. మీరూ ఈ వీడియోను చూశారా.. చూడకపోతే యూట్యూబ్ లోకి వెళ్లి ఇప్పుడే చూసేయండి గురూ.



Click it and Unblock the Notifications











