పల్లవి ప్రశాంత్‌కు తెలిసే దాడి జరిగిందట... బతిమాలినా పట్టించుకోలేదట.. వెలుగులోకి షాకింగ్ విషయాలు!

బిగ్ బాస్ తెలుగు 7 షో గురించి గ్రాండ్ ఫినాలే తర్వాత జరిగిన రచ్చ గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరూ ఊహించని స్థాయిలో అమర్ దీప్ కారుతో పాటు మిగతా కంటెస్టెంట్ల కార్లపై పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో అమర్ దీప్ కారుతో పాటు అశ్విని శ్రీ, గీతూ రాయల్స్ కార్లు కూడా చాలా వరకూ ధ్వంసం అయ్యాయి. అలాగే ఆరు తెలంగాణ ఆర్టీసీ బస్సులు కూడా నాషనం అయ్యాయి. ఇంత రచ్చ చేసింది పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ యే పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. రైతుబిడ్డ మాత్రం కావాలనే వాళ్లే దాడి చేయించుకున్నారంటూ నిన్న కామెంట్లు చేశారు.

కానీ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, అశ్విని శ్రీ, గీతూ రాయల్, అమర్ దీప్ లు ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. అలాగే బంజారాహిల్స్ పోలీసులు సుమోటాగా కూడా కేసును స్వీకరించి దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఆరు సెక్షన్ల కింద పల్లవి ప్రశాంత్ తో పాటు ఆయన అభిమానులపై కేసులు పెట్టారు. ఈక్రమంలోనే రైతుబిడ్డ కనిపించకుండా పోవడం, ఆయన తమ్ముడిని అరెస్ట్ చేయడం కూడా జరిగిందంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. మరోవైపు హైకోర్టుకు చెందిన ఓ లాయర్ పల్లవి ప్రశాంత్ తరఫున న్యాయ పోరాటం చేస్తున్నారు. అయితే తాజాగా అమర్ దీప్ క్లోజ్ ఫ్రెండ్ నరేష్ లొల్ల షాకింగ్ కామెంట్లు చేశారు. పల్లవి ప్రశాంత్ అసలు క్యారెక్టర్ ను బయట పెట్టారు.

Amardeep Close Friend Naresh Lolla Shocking Comments About Pallavi Prashanth on His Fans Attack

బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే షో జరగ్గానే.. బయట ఎక్కువ మంది జనాలు ఉన్నారని.. లోపలే అందరినీ ఆపేశారని నరేష్ చెప్పాడు. అయితే తాను లోపలికి వెళ్లేటప్పుడే చాలా మంది కోడిగుడ్లు, టమాటాలు, రాళ్లు పట్టుకుని కనిపించారని.. పేర్కొన్నాడు. అదంతా చూసి చాలా భయపడిన అతడు వెంటనే పల్లవి ప్రశాంత్ వద్దకు వెళ్లినట్లు వివరించాడు. అయితే నీ ఫ్యాన్స్ అమర్ దీప్ పై దాడి చేసేందుకు టామాటాలు, గుడ్లు, రాళ్లు తీసుకు వచ్చారని.. మీరు బయటకు వెళ్లిన వెంటనే.. నిజంగా మీరు నా అభిమానులే అయితే ఎవరిపై కూడా దాడి చేయొద్దని చెప్పాలని చెప్పమంటూ తాను వేడుకున్నట్లు పేర్కొన్నాడు.

Amardeep Close Friend Naresh Lolla Shocking Comments About Pallavi Prashanth on His Fans Attack

అయితే తాను ఎంతో బతిమాలినా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ మాత్రం నోరు విప్పలేదని నరేష్ లొల్ల తెలిపారు. బయటకు వెళ్లాక చెబుతుండొచ్చులే అనుకుని తాను అమర్ దీప్ వద్దకు వచ్చానని.. కానీ అతడు బయట వెళ్లాకా మాత్రం అస్సలే అలా చెప్పలేదని వివరించాడు. తానే నేరుగా వెళ్లి బతిమాలినా పట్టించుకోలేదంటూ అతడి క్యారెక్టర్ ఏంటో తెలుస్తోందని... అన్నాడు. నేను ఎంతగా అమర్ దీప్ కు సపోర్ట్ చేసినా... ఓ రైతుబిడ్డ విన్నర్ అయ్యాడని.. నేనే వెళ్లి అతడిని అభినందించానుకున్నాను.. కానీ అతడి నిజ స్వరూపం తెలిశాకా చాలా సిగ్గుపడుతున్నానంటూ ఫైర్ అయ్యాడు.

Amardeep Close Friend Naresh Lolla Shocking Comments About Pallavi Prashanth on His Fans Attack

అమర్ దీప్ ఫ్యాన్స్ అంటూ వాళ్లు చేసిన రచ్చ గుర్తొస్తేనే భయం వేస్తుందని... కార్లలో పెద్ద వాళ్లు, కుటుంబ సభ్యులు ఉండగా.. ఇలా చేయడం సరికాదని నరేష్ లొల్ల చెప్పుకొచ్చాడు. దీన్ని బట్టి మీరే అమర్ దీప్ అసలు క్యారెక్టర్ ఏంటో అంచనా వేసుకోండని.. అతిడిక సపోర్ట్ చేసుకుంటే చేసుకోండి కానీ... మిగతా వాళ్లపై మాత్రం దాడి చేయడం తగదని చెప్పుకొచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X