Bigg Boss Telugu 7: అమర్‌దీప్ జర్నీ వీడియో.. విన్నర్ అయ్యే హింట్ ఇచ్చేసిన బిగ్ బాస్
బిగ్ బాస్ తెలుగు 7 మరో 5 రోజుల్లో ముగియనుంది. ఇక చివరి ఘట్టానికి చేరుకోవడంతో మరింత ఆసక్తిగా సాగుతోంది. ఇక కంటెస్టెంట్స్ జర్నీ వీడియోలు ప్లే చేస్తూ.. ప్రేక్షకులను ఎమోషనల్, ఎంటర్ టైన్ చేస్తున్నాడు బిగ్ బాస్. ఇక తాజాగా నిన్న అమర్ దీప్ జర్నీ వీడియోను ప్లే చేశాడు. ఆ వీడియో చూశాక.. అమర్ దీప్ కే సర్ ప్రైజ్ కాకుండా చూసే వాళ్లకు ఫుల్ సర్ ప్రైజ్ అనిపించింది. ఆ వివరాలు ఈస్టోరీలో చూసుకుందాం.
బిగ్ బాస్ తెలుగు 7 ఎపిసోడ్‍లో ముందుగా అమర్ దీప్ జర్నీ వీడియోను ప్లే చేశారు. ముందుగా అమర్ దీప్ ను గార్డెన్ ఏరియాకి రండి అంటూ బిగ్ బాస్ చెప్పుకువచ్చాడు. దీంతో అమర్ తలుపు తీసి చూసేసరికి గార్డెన్ ఏరియా మొత్తం మరో ప్రపంచంలా కనిపించింది. ఇక నాని 'గ్యాంగ్ లీడర్' సినిమాలోని టైటిల్ సాంగ్ వేసి అమర్ దీప్ కు వెల్ కమ్ చెప్పాడు బిగ్ బాస్. ఇక అక్కడి సెట్ చూసి అమర్ షాక్ అయ్యాడు. సూపర్ ఉంది అంటూ చెప్పుకువచ్చాడు.

ఇక తన ఫొటో గ్యాలరీ, బుక్ ఆఫ్ మెమొరీస్ చూసి.. ఫోటోస్ అదిరిపోయాయ్.. బిగ్ బాస్ అంటూ అమర్ దీప్ ఆ సెట్ అంతా తిరిగాడు. ఇక అక్కడ ఉన్న కెప్టెన్సీ బ్యాడ్జ్ చూసి థాంక్యూ బిగ్ బాస్, నాగార్జున సార్.. నా కోరిక తీర్చారు కెప్టెన్ చేసి అంటూ చెప్పుకొచ్చాడు అమర్ దీు్. ఇక అక్కడ ఉంచిన పెద్ద ఆల్బమ్ ఓపెన్ చేశాక తన జర్నీ మొత్తాన్ని ఫొటోల రూపంలో చూసి అమర్ యే కాకుండా చూసే ప్రేక్షకులు సైతం దానికి ఫిదా అవ్వాల్సిందే.
మా పెళ్లిలో కూడా నాకు ఇలాంటి ఫొటోస్ లేవు బిగ్‌బాస్.. అంటూ అమర్ దీప్ చెప్పుకువచ్చాడు. పోలీస్ ఆఫీసర్ గెటప్‌లో సేమ్ రవితేజ లానే ఉన్నాను.. కెప్టెన్సీ పోయినప్పుడు చూస్తుంటే నాకే భాదేస్తుంది... ఇది చాలా విలువైనది.. నా జర్నీని ఇంత నీట్ గా చూపించారు బిగ్ బాస్ ఐ లవ్ యూ అంటూ అమర్ ఎమోషనల్ అయ్యాడు. ఇక తర్వాత యాక్టివిటీ ఏరియాకి రమ్మని అమర్ ను పిలిచాడు. ఇక అక్కడ మరో సెట్ రెడీగా ఉంది.
అమర్‌దీప్.. మీ పేరుకి అర్థం ఎప్పటికీ వెలిగే జ్యోతి.. అదే విషయం మీ ప్రయాణంలో ప్రతిబింబించిందంటూ బిగ్ బాస్ వాయిస్ ఓవర్ తో అమర్ జర్నీ గురించి చెప్పాడు. ఈ ప్రయాణంలో ముందుకు వెళ్లాలనే కసి నిరంతరం మీలో జ్వలిస్తూ ఎలాగైనా ప్రతి ఆటలో గెలిచి చివరి వరకూ చేరాలనే మీ తపన మీ ప్రయాణాన్ని మలిచిందని చెప్పుకువచ్చాడు.. మిగతా వారికి తెలీకుండా మీరు దాచుకున్న ఆహారం.. బిగ్‌బాస్‌కి మాత్రమే తెలుసు.. అంటూ భారీ డైలాగులు వేశాడు.
ఎవరు ఎన్ని నిందలు వేసినా మీలోని పట్టుదల ఒక్క శాతం కూడా తగ్గకుండా రెట్టింపు ఉత్సాహంతో పోరాడి ఫైనలిస్ట్‌గా నిలిచారు అంటూ బిగ్ బాస్ చెప్పుకువచ్చాడు.. అమర్‌దీప్ ఈ భూమి మీద పొరపాటు చేయని మనుషులు ఎవ్వరూ లేరు.. పొరపాట్లను తెలుసుకొని ముందుకు కదిలేవారిని ఎవ్వరూ ఆపలేరు అంటూ బలాన్ని ఇచ్చాడు బిగ్ బాస్. దీనికి ఉదాహరణగా నిలిచిన మీ ప్రయాణాన్ని ఒకసారి చూద్దాం.. అంటూ అమర్ జర్నీ వీడియోను ఎదురుగా ఉంచిన స్క్రీన్‌పై ప్లే చేశాడు బిగ్‌బాస్.
అమర్ దీప్ జర్నీ వీడియోను అద్భుతంగా కట్ చేశారు. తొలి రోజు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన దగ్గరి నుంచి ఫైనలిస్ట్ అయ్యేంత వరకు అమర్ చేసిన చిలిపి పనులు, చెప్పిన తింగరి సమధానాలు, గోడౌన్‌లో దాచేసిన సరుకు, రాత్రుళ్లు నిద్రపోకుండా మాట్లాడిన మాటలు ప్రతిఒక్కదాన్ని వీడియోలో అద్భతంగా చూపించారు. ఇక ఆరో వారం నుంచి ఫైనల్ వీక్ వరకూ తన ఆట ఎంతలా మారిందో చూపిస్తూ అమర్ కి ఇంకా గెలిచే ఛాన్స్ ఉందంటూ హింట్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇక ఆ వీడియో చూసి అమర్ దీప్ ఎమోషనల్ అయిపోయాడు. థ్యాంక్యూ ఆడియెన్స్.. అంటూ మోకాళ్ల మీద కూర్చొని చెప్పాడు. మొత్తానికి అమర్ దీప్ వీడియో ఓ సినిమా ట్రైలర్ లా ఫన్, ఫ్రస్ట్రేషన్, ఎమోషనల్, బాండింగ్, ఫైటింగ్, ఫైరింగ్ అన్ని కలగలపి ఉన్నాయి.


Click it and Unblock the Notifications











