Bigg Boss Telugu 7: స్పై బ్యాచ్‌కు గట్టి షాకిచ్చిన అమర్దీప్.. కావాలనే ప్రశాంత్‌తో కాళ్లు మొక్కిచ్చుకున్నాడుగా
బగ్ బాస్ తెలుగు సీజన్ 7షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన ఆట తీరుతో అందరినీ తెగ అలరిస్తున్న ఈ షో మరో రెండు రోజుల్లో ముగిసిపోనుంది. అయితే ఎవరు గెలవనున్నారు, ఎవరు రన్నరప్ గా మారనున్నారు టాప్ 5లో ఎవరు ఉండబోతున్నారనే దానిపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ముఖ్యంగా టాప్ లో ఉన్న పల్లవి ప్రశాంత్, శివాజి, అమర్ దీప్ లలో ఎవరు గెలుస్తారని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మిడ్ డే వీక్ ఎలిమినేషన్ ఉంటుందని అంతా భావించినా అదేం లేదని తెలుస్తోంది.
ఇప్పటికే విజయవంంగా 14 వారాలు పూర్తి చేసుకున్న ఈ షో... ఉల్టా పుల్టా కాన్సెప్ట్ తో వచ్చి అందరినీ అలరిస్తోంది. మొదటి వారంలో 14 మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వగా... ఐదో వారంలో మరో ఐదగురు కంటెస్టెంట్లు ఇంట్లో అడుగు పెట్టారు. అంతకు ముందు వారంలో ఎలిమినేట్ అయిన మరో అమ్మాయి రతికా రోజ్ ను ఇంట్లోకి రీఎంట్రీ ఇప్పించారు. ఇక ఆ తర్వాత ఓ వారం ఎలిమినేషన్ ఎత్తేసి, ఆ తర్వాతి వారం ఇద్దరిని డబుల్ ఎలిమినేట్ చేశారు. అలాగే టాప్ 6 కంటెస్టెంట్లను హౌస్ లో ఉంచారు. ఇక చివరి వారంలో భాగంగా మూడు రోజులు వీడియో జర్నీలు చూపించారు.
Recommended Video


అయితే నిన్నటి నుంచి ఫన్నీ టాస్క్ లు ఇస్తున్నారు. తాజాగా విడుదల అయిన ప్రోమో చూస్తుంటే ఫన్ లెవల్ మరింత పెరిగినట్లు తెలుస్తోంది. ఫన్ తో పాటుగా అమర్ దీప్ చేసిన పని చూస్తుంటే పల్లవి ప్రశాంత్ అభిమానులకు కోపం రావడం కూడా ఖాయమే. ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్ లోని కంటెస్టెంట్లకు షాకిచ్చారు. ఆస్ట్రాలజర్ అనే టాస్క్ ఇచ్చి... అమర్ దీప్ ను జోస్యం చెప్పే వాడిగా పెట్టారు. ఈక్రమంలోనే అమర్ దీప్ చాలా కామెడీ చేశాడు. రావయ్యా ప్రశాంతూ.... అని పిలిచి నా కాళ్లు మొక్కు అని చెప్పాడు. వెంటనే రైతుబిడ్డ కాళ్లు కూడా మొక్కాడు. చూసేందుకు ఇది కాస్త ఫన్నీగానే అనిపించినా... అలా చేసుండకూడదంటూ కొంత మంది అంటున్నారు.
ఇక ఆ తర్వాత మిగిలిన వాళ్లందరికీ జోస్యం చెబుతూ రచ్చ చేశాడు. ఏయ్ పెద్దదిరా అరేయ్... చాలా పెద్దదిరా అంటూ ప్రశాంత్ పై డబుల్ మీనింగ్ డైలాగ్ లు కొట్టాడు. దీనికి హౌస్ మేట్స్ అంతా గట్టి గట్టిగా నవ్వారు. అంత పెద్దదా అని శివాజి అనగానే... మరోసారి అమర్ దీప్ చాలా పెద్దది అంటూ స్పష్టం చేశాడు. దీనికి మరోసారి అంతా నవ్వారు. అయితే కేవలం అర చేతిని మాత్రమే కాకుండా... మట్టను చూసి జాతకం చెప్పడం మరింత కామెడీగా ఉంది. శివాజికి మాత్రమే కాకుండా ప్రిన్స్ యావర్ కు జాతకం చెబుతూ మరింత రచ్చ చేశాడు.

ఆ తర్వాత వచ్చిన యావర్ వెంటనే వచ్చి అమర్ దీప్ కాళ్లు మొక్కాడు. ఇలా స్పై బ్యాచ్ కు చెందిన ఇద్దరితోనూ అమర్ దీప్ కాళ్లు మొక్కించుకున్నాడు. అంతేకాకుండా యావర్ పై కూడా బాగానే పంచులు వేశాడు. యావర్ బిత్తిరి చూపులు చూసుకుంటూ.. బిత్తిరి బిత్తిరిగా ఇల్లాంతా తిరిగాడని వివరించాడు. బెడ్రూంలోకి వచ్చి బెడ్ మీద పడుకోవద్దు అన్న పాపానికి ఓ పెద్దావిడను ఇంట్లోంచి వెళ్లగొట్టాడంటూ స్పష్టం చేశాడు. మీరూ ఓసారి ఈ ఎపిసోడ్ చూస్తే చాలా బాగా నవ్వుకోవచ్చు.


Click it and Unblock the Notifications











