Bigg Boss Telugu 7: ఆ ముగ్గురూ టాప్ 5లో ఉంటే విన్నర్ అమర్‌దీపే.. కన్ఫార్మ్ చేస్తున్న ఓటింగ్ రిజల్ట్స్!
బిగ్ బాస్ తెలుగు 7 షో రసవత్తరంగా సాగుతోంది. ఎప్పటికప్పుడు అంచనాలు తారుమారు అవుతూ అందరికీ షాకిస్తున్నాయి. ఉల్టాపుల్టా అంటూ వచ్చిన ఈ సీజన్ ఎవరూ ఊహించని విధంగా సాగుతోంది. ముఖ్యంగా సీజన్ ప్రారంభం అయినప్పుడు అంతా విన్నర్ గా సీరియవ్ యాక్టర్ అమర్ దీప్ అవుతాడని భావించారు. కానీ రెండో వారమే ఆయన రైతిబిడ్డ పల్లవి ప్రశాంత్ పై విరుచుకు పడిన తీరు చూసి ఆయన గెలిచే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. ఇక ఆ తర్వాత పల్లవి ప్రశాంత్ కు అండగా నిలబడుతూ వస్తున్న శివాజియే విన్నర్ అవుతారని అంతా భావించారు. విన్నర్ గా శివాజి, రన్నరప్ గా పల్లవి ప్రశాంత్ ఉంటారని పెద్ద ఎత్తున వార్తలు కూడా వచ్చాయి.
కానీ వారాలు గడుస్తున్నా కొద్దీ హౌస్ మేట్స్ ఆట తీరు మారుతోంది. ఏ వారం ఎవరికి పాజిటివ్ అవుతుందో, మరెవరికి నెగిటివ్ అవుతుందో కూడా తెలియట్లేదు. గతంలో సీరియల్ బ్యాచ్.. ముఖ్యంగా అమర్ దీప్, ప్రియాంక జైన్, శోభా శెట్టిలు కలిపి గేమ్ అడగా.. ఫ్యామిలీ వీక్ తర్వాత నుంచి వీళ్లలో చాలా మార్పు వచ్చింది. కుటుంబ సభ్యులు వచ్చిపోయినప్పటి నుంచి వీళ్లు నిజాయితీగా గేమ్ ఆడుతున్నారు. గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా అమర్ దీప్ లో చాలా మార్పు కనిపిస్తోంది. గెలుపు కోసం చాలా గట్టిగా కష్టపడుతూనే.. పల్లవి ప్రశాంత్, శివాజిలతో చక్కగా ఉంటున్నాడు.

ఇది చూసిన బుల్లితెర ప్రేక్షకులకు కూడా అమర్ దీప్ పై కోపం పోయింది. కోపం పోయిన మాట పక్కన పెడితే మొన్నటి వారం కెప్టెన్ గా అయ్యేందుకు పడిన కష్టం, ఆయన ఏడ్చిన తీరు చూసి అంతా షాకయ్యారు. పాపం అనిపించేలా ఉండడంతో పాటు విన్నర్ గా నిలుస్తాడనుకున్న శివాజికి నెగిటివ్ కావడం... అమర్ దీప్ కు చాలా ప్లస్ అయింది. ఈక్రమంలోనే రెండు వారాలుగా ఆయన చక్కగా ఉండడం, రైతుబిడ్డతో స్నేహం చేయడంతో అతనికి ఓటింగ్ కూడా పెరిగిపోయింది. సింపతీ కూడా తోడవ్వడంతో అమర్ దీప్ టాప్ లో ఉన్నాడు.
ప్రస్తుతం నడుస్తున్న ఓటింగ్ ను బట్టి చూస్తుంటే.. శివాజి, పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్ లు టాప్ 5 లో ఉంటారని తెలుస్తోంది. ఇదే కనుక జరిగితే విన్నర్ గా శివాజి కావడం చాలా కష్టం. ఈ ముగ్గురూ టాప్ 5లో ఉంటే ఓట్లు చీలిపోతాయి. దీంతో ఈ ముగ్గురి ఓటింగ్ తగ్గుతుంది. సీరియల్ బ్యాచ్ కు ఉన్న ఫ్యాన్స్ అంతా అమర్ దీప్ కే ఓటేసే ఛాన్స్ ఎక్కువ. ఇలా ఈ ముగ్గురూ కనుక టాప్ 5లో ఉన్నారంటూ అందరికంటే ఎక్కువ లాభపడేది విన్నర్ గా నిలిచేది మాత్రం అమర్ దీప్ యే.
12వ వారంలో శివాజి, పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్ లు నామినేషన్స్ లో ఉండగా.. ఓటింగ్ లో రైతుబిడ్డ టాప్ 1 లో ఉన్నాడు. ఈయనకు పెద్ద ఎత్తు ఓట్లు వస్తున్నాయి. రెండో స్థానంలో శివాజి, మూడో స్థానంలో అమర్ దీప్ , నాలుగో స్థానంలో ప్రిన్స్ యావర్, ఐదో స్థానంలో గౌతమ్ కృష్ణ, ఆరో స్థానంలో అంబటి అర్జున్, ఏడో స్థానంలో రతికా రోజ్, ఎనిమిదో స్థానంలో అశ్విని శ్రీలు ఉన్నారు. టాప్ -3లో ఉన్న అమర్ దీప్ గేమ్ మరింత మెరుగుపడి.. శివాజి, ప్రశాంత్, యావర్ లు గనుక టాప్ 5లోకి వచ్చారంటే అమర్ దీప్ కు ఓటంగ్ విపరీతంగా పెరుగుతందనడంలో ఎలాంటి సంశయం లేదు. చూడాలి మరి ఏం జరగనుందో.


Click it and Unblock the Notifications











