Bigg Boss Telugu 7: మరోసారి పరువు తీసుకున్న అమర్‌దీప్.. అత్యుత్సాహమా, అమాయకత్వమా?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో అత్యద్భుతంగా సాగుతూ అందరికీ వినోదాన్ని పంచడంలో సఫలీకృతం అవుతోంది. ముఖ్యంగా వీకెండ్ ఎపిసోడ్స్ తో పాటు నామినేషన్లలకు సంబంధించిన ఎపిసోడ్లు చూసేందుకు చాలా మంది తెగ ఆసక్తి కనబరుస్తుంటారు. అయితే 12వ వారంలో భాగంగా ఇప్పటికే అశ్విని ఎలిమినేట్ కాగా.. మరొకరు ఈరోజు ఎలిమినేట్ కాబోతున్నారు. అయినా సరే నాగార్జున ఎవరినీ పెద్దగా ఇబ్బంది, భయ పెట్టకుండా సండేను ఫండేగా మార్చే ప్రయత్నం చేశారు. ఈక్రమంలోనే ఓ అద్భుతమైన టాస్క్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
అయితే ఇప్పటికే తన టాలెంట్, తనకు జనరల్ నాలెడ్జ్ పై ఎంత అవగాహన ఉందో చూపించుకున్న అమర్ దీప్.. మరోసారి పరువు తీసుకున్నాడు. గతంలో ఓ చెప్టుపె పక్షులు ఉన్న ఫొటో చూపించి గన్ పేలిస్తే ఏం జరుగుతందని చెప్పగా.. ఏదో పెద్ద టాస్క్ ఇచ్చినట్లు.. గంటలు గంటలు ఆలోచించి మరీ సమాధానం చెప్పాడు. అప్పట్లో అమర్ దీప్ చేసిన ఆ ఒక్క పనికి అంతా పడీ పడీ నవ్వుకున్నారు. మరీ అంత పూర్ ఏంటి జీకేలో అనుకున్నారు. ఇలా చాలా సార్లు అమర్ దీప్ చేసిన పనులు అందరికీ నవ్వులు తెప్పించాయి.

తాజాగా ఆయన చేసిన మరోపని హైలెట్ గా నిలిచింది. ఈసారి కూడా ఎప్పిటిలాగే అమర్ దీప్ తన పరువు తానే తీసుకున్నాడు. నిజంగా తాను చిన్న పిల్లాడే అన్నట్లుగా ప్రవర్తించాడు. అత్యుత్సాహనంతో పాటు అమాకత్వం కలగలిపిన ఫేస్ పెట్టి మరీ అందరి ముందూ జోకర్ అయ్యాడు. ఇదంతా చూసిన నాగార్జున.. అమర్ దీప్ టాలెంట్ కు అవాక్కయ్యాడు. ముఖ్యంగా హౌస్ మేట్స్ అయితే మరోసారి హవ్వా అంటూ మూతిపై చేతులు పెట్టున్నారు. అసలేం జరిగిందో తెలియాలంటే మీరూ ఈ స్టోరీని కచ్చితంగా చూడాల్సిందే.
సండే ఫండేలో భాగంగా ఈరోజు బిగ్ బాస్ టీం నిర్వాహకులు రెండో ప్రోమోను వదిలారు. మొదటి ప్రోమోలో అశ్విని ఎలిమినేషన్ కు సంబంధించిన వీడియో ఉండగా.. రెండో ప్రోమోలో మాత్రం నాగార్జున హౌస్ మేట్స్ కు ఓ ఫన్నీ టాస్క్ ఇస్తూ కనిపించారు. అందులో భాగంగానే స్పా, స్పై బ్యాచ్ లను విడగొట్టారు. ఈక్రమంలోనే నాగ్ చాలా ఫన్నీ క్వశ్చన్స్ అడిగాడు. ముందుగా కిచెన్ లో ఎన్ని చెట్లు ఉన్నాయని అడగ్గా... చూసి మరీ సమాధానం చెప్పాడు అమర్ దీప్. దీనికి పాయింట్లు ఇవ్వడానికి బదులుగా నాగ్ 10 పాయింట్లు మైనర్ చేశారు.
ఇక ఆ తర్వాత న్యూటన్ ఫొటో చూపించి ఆయన ఎవరో గెస్ చేసి పాట పాడాలని చెప్పారు. దీనికి అమర్ దీప్ ఆ ఫొటో చూసిన వెంటనే బెల్ కొట్టాడు. అతడు శివుడు అంటూ చెప్పుకొచ్చాడు. అతడు చెప్పిన ఆన్సర్ విన్న నాగార్జున మరోసారి ఆ ఫొటోను చూశాడు. ఇంట్లో వాళ్లంతా హవ్వా అంటూ నోర్లు మూసుకోగా.. నాగ్ మరోసారి అది ఎవరని ప్రశ్నించాడు. అమర్ అమాయకంగా మొహం పెట్టి శివుడు సర్ అంటూ సమాధానం చెప్పగా.. నాగార్జున మరోసారి ఫొటో చూపంచాడు. దగ్గరకు వెళ్లి మరీ ఆ ఫొటో చూసిన అమర్.. అయ్యో నాకు శివుడిలా కనిపించాడు సార్ ఇది ఐన్ స్టీన్ అని చెప్పడం గమనార్హం.
ఫొటో ఎవరిదో తెలియకపోతే ఊరుకోవాల్సింది పోయి.. అత్యుత్సాహం, అమాయకత్వంతో తన పరువు తానే తీసుకోవడంలో అమర్ ఎప్పుడూ ముందే ఉంటాడు. గతంలో చాలా సార్లు ఇదే జరగ్గా.. తాజాగా మరోసారి ఆయన చేసిన పనితో అంతా నవ్వుకుంటున్నారు. సోషల్ మీడియాలో అయితే ఈ వీడియో ఫుల్ వైరల్ గా మారింది. అమర్ దీప్ కు మరీ ఇంత టాలెంట్ ఎలా వచ్చిందబ్బా అంటూ అంతా షాకవుతున్నారు. మీరూ ఈ ఫన్నీ వీడియో చూసి నవ్వుకోండి. ఇంకెందుకు ఆలస్యం.


Click it and Unblock the Notifications











