Bigg Boss Telugu 7: ఆ ఛాన్స్ మిస్ చేసుకున్న అమర్ దీప్, ప్రశాంత్, శివాజీ.. ఫినాలేకి ముందే బిగ్ షాక్!

బిగ్ బాస్ తెలుగు 7 మరో 9 రోజుల్లో ఈ షో ముగియనుంది. ప్రస్తుతం ఈ షోలో 7 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇక వీరిలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ కానున్నారు.. ఎవరు టాప్ లో ఉన్నారు అనేది ఆసక్తిగా మారింది. ఇక ఈ వారం శోభా శెట్టి ఎలిమినేట్ కానున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. టాప్ 3లో ఉంటున్న ప్రశాంత్, శివాజీ, అమర్ దీప్.. ఈ సీజన్ లో మంచి ఛాన్స్ ను మిస్ చేసుకున్నారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

తెలుగులో అత్యధిక ఆదరణ పొందుతున్న షోల్లో బిగ్ బాస్ తెలుగు. ఇక బిగ్ బాస్ తెలుగు 7 మరో వారంలో ముగియనుంది. సెప్టెంబర్ 3న ప్రారంభం అయిన ఈ షో... ఇప్పుడు డిసెంబర్ 17న ఎండ్ కార్డ్ పడనుంది. ఆదివారం రాత్రి 7 గంటలకు గ్రాంఢ్ ఫినాలే జరుపుకోనుంది. అయితే ఈ సీజన్ విన్నర్ ఎవరు అనేది ఆసక్తిగా మారింది. మరో వారం రోజుల్లో షో ముగియనున్న ఇంకా సీజన్ విన్నర్ డిసైడ్ కాలేదని తెలుస్తోంది.

 Amardeep, Prashanth, Shivaji who missed the chance to vote to appeal in Bigg Boss Telugu 7 Full Details Here

బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ లో మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ ఎంటర్ అయ్యారు. ఇక ఈ సీజన్ ప్రస్తుతం 7 మంది శివాజీ, ప్రశాంత్, అమర్ దీప్, అర్జున్ అంబటి, ప్రిన్స్ యావర్, ప్రియాంక జైన్, శోభా శెట్టి ఉన్నారు. వీరిలో ఎవరు టాప్ 5కి వెళ్తారు.. ఎవరు విన్నర్, ఎవర్ రన్నర్ అనేది ఆసక్తి కలిగిస్తుంది. ఈ వారం నామినేషన్స్ లో అర్జున్ తప్ప అందరూ ఉన్నారు. ఇక అర్జున్ అంబటి ఫస్ట్ ఫైనాలిస్ట్ అయిన సంగతి తెలిసిందే.

ఇక ఈ వారం ఎలిమినేషన్ చూసుకుంటే.. శోభా శెట్టి అవుతుందని అంటున్నారు. ఇక విన్నర్ ఓటింగ్ కూడా మొదలు అయింది. దీంతో ఓటింగ్ లిస్టులో అర్జున్ అంబటి పేరును చేర్చారు. 14వ వారంలో శోభా శెట్టి ఔట్ అవ్వగా... మిడ్ వీక్ లో అర్జున్ లేదా.. యావర్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ఫినాలేకి టాప్ 5 వెళ్తారు. ప్రశాంత్, అమర్ దీప్, శివాజీ, ప్రియాంక తో పాటు. అర్జున్ లేదా యావర్ రానున్నారు.

ఇక ఈ వారం వోట్ అప్పియల్ కోసం పోటీలు నిర్వహించారు. ఈ వోట్ అప్పియల్ ఛాన్స్ మొదట శోభాకు లభించింది. ఇక ఆ తర్వాత హౌస్ లోని కంటెస్టెంట్స్ ప్రియాంక, అర్జున్ అంబటి, యావర్ లకు లభించింది. ఈ సీజన్ లో వోట్ టు అప్పియల్ ఛాన్స్ మిస్ చేసుకుంది మాత్రం శివాజీ, ప్రశాంత్, అమర్ దీప్. వీరు ఈ గొల్డెన్ ఛాన్స్ ను మిస్ చేసుకున్నారు.

 Amardeep, Prashanth, Shivaji who missed the chance to vote to appeal in Bigg Boss Telugu 7 Full Details Here

ఎలాగూ టాప్ 3లో వీరు ఉన్నారు.. వీరికి ఓట్ టు అప్పియల్ ఛాన్స్ వస్తే.. బాగుండని ఆయ కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ అంటున్నారు. ఇక ఈ సీజన్ లో ప్రశాంత్ విన్నర్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. ఇక అమర్ దీప్ గ్రాఫ్ తగ్గుతూ వస్తుంది. రన్నర్ గా శివాజీ నిలవనున్నారని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరగనుందో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X