Bigg Boss Telugu 7: అమ్మానాన్నలు ఆశలు పెట్టుకున్నారన్న.. దండం పెడతానన్న.. శివాజికి అమర్ వేడుకోలు!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే అద్భుతమైన టీఆర్పీని సొంతం చేసుకుంటూ ఎలాంటి అడ్డూ లేకుండా దూసుకు వెళ్తున్న ఈ షో.. ప్రస్తుతం రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే 11 వారాలు విజయవంతంగా పూర్తి చేసుకోగా.. 12 వారం కూడా పూర్తి కావొస్తుంది. మరికొన్ని వారాల్లో షో కూడా అయిపోయేందుకు దగ్గరకు వస్తుండగా.. ఈ వారమే చివరి కెప్టెన్సీ టాస్క్ నిర్వహిస్తున్నారు. అయితే ఈ వారం కెప్టెన్సీ టాస్క్ అద్భుతంగా సాగింది.

Amardeep Request to Sivaji For Captaincy Task in Bigg Boss Telugu 7

ఎవరూ ఊహించని ట్విస్ట్ లు ఇస్తూ.. బిగ్ బాస్ టీం నిర్వాహకులు చివరి వరకు కెప్టెన్ ఎవరు అవుతారన్నది అర్థం కాకుండా చేశారు. అయితే మొదటి వారంలో ఇంట్లో అడుగు పెట్టిన అమర్ దీప్.. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కెప్టెన్ కాలేకపోయాడు. చాలా గట్టిగా ప్రయత్నాలు చేసిన ఆయన విన్ కాలేదు. అయితే 12వ వారంలో మాత్రం కచ్చితంగా అమర్ దీప్ యే కెప్టెన్ అవుతాడని అంతా అనుకున్నారు. గేమ్ పెడితే పోయే ఛాన్స్ ఉన్నా అంతా సపోర్ట్ చేసి మరీ అతడిని గెలిపిస్తారని భావించారు. ఎందుకు అంటే ఇప్పటి వరకు అతను కెప్టెన్ కాలేడు. కానీ తాజా ప్రోమో చూస్తుంటే ఆయన ఈవారం కూడా కెప్టెన్ గా గెలవలేకపోయాడని అర్థం అవుతోంది.

Amardeep Request to Sivaji For Captaincy Task in Bigg Boss Telugu 7

అయితే కెప్టెన్ గా ఆడే ఆట అయితే ఎంతకు తెగించిన అయినా తాను కష్టపడేందుకు సిద్ధపడిన అమర్... నిర్ణయం హౌస్ మేట్స్ చేతిలో ఉండడంతో ఏం చేయలేకపోతున్నాడు. మొన్నటి వారంలో కూడా చివరి వరకు వచ్చి.. హౌస్ మేట్స్ సహకారం లేక కెప్టెన్సీ టాస్క్ లో ఓడిపోయాడు. చివరి నిమిషంలో రేస్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అయితే ఈసారి కూడా అదే రిపీట్ అయింది. కెప్టెస్టీ టాస్క్ లో ఫైనల్స్ కు చేరుకున్న అమర్ దీప్ ను మరోసారి ఓడించారు. ముఖ్యంగా శివాజియే ఇందుకు కారణం. అయితే అంబటి అర్జున్, అమర్ దీప్ ఫొటోలు ఉండగా.. శోభాశెట్టి, శివాజిలు కలిసి వారిద్దరిలో ఒకరి ఫొటోను కాల్చి రేస్ నుంచి తప్పించాల్సి ఉంటుంది.

Amardeep Request to Sivaji For Captaincy Task in Bigg Boss Telugu 7

ఈక్రమంలోనే అమర్ దీప్ శివాజిని చాలా బతిమాలుకున్నాడు. అన్నా ప్లీజ్ అన్నా.. ఈ ఒక్కసారి సపోర్ట్ చేయన్నా.. మా అమ్మానాన్నలు నేను కెప్టెన్ కావాలని ఎంతగానో ఆశలు పెట్టుకున్నారంటూ చిన్న పిల్లాడిలా ఏడ్చాడు. కానీ శివాజి మాత్రం అందుకు కరిగిపోకుండా అంబటి అర్జున్ కు సపోర్ట్ చేశాడు. దండం పెడతానంటూ.. ఫుల్లుగా ఏడుస్తూ బతిమాలడం చూస్తుంటే ఎవరికైనా పాపం అనిపిస్తుంది. అంతలా బతిమాలినా శివాజి అతడికి సాయం చేయకపోవడం అతడికే మైనస్ గా మారుతున్నట్లు తెలుస్తోంది. కాళ్లు మొక్కడం ఒకటే తక్కువ.. అంతకు మించి అమర్ దీప్ శివాజిని వేడుకున్నాడు.

Amardeep Request to Sivaji For Captaincy Task in Bigg Boss Telugu 7

చివరకు తన ఫొటో తగులబెట్టిన తర్వాత విపరీతంగా ఏడ్చేశాడు. ఇప్పటికే ఆరోగ్యం బాగాలేని అమర్ దీప్.. ఇంతలా ఏడ్వడం చూసిన ప్రేక్షకులు కూడా కంటతడి పెడుతున్నారు. కెప్టెన్సీ కోసం అమర్ కు అంత పట్టుదల ఏంటని అనుకుంటున్నారు. పాపం అనిపించేలా ప్రవర్తించినందుకు అయినా శివాజి అమర్ దీప్ ను గెలిస్తే బాగుండని భావిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X