Bigg Boss Telugu 7: బిగ్‌బాస్‌ మాట వినని అమర్​దీప్.. అశ్విని డ్రెస్సును లాగుతూ.. మరీ ఇంతలా దిగజారిపోయాడేంటి?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత మరింత ఆసక్తిగా సాగుతోంది. అయితే కొత్త వాళ్లు వచ్చాక నామినేషన్స్ రోజు నుంచి అమర్ దీప్ డీలా అయిపోయాడు. ఇక తనను నిరూపించుకునే క్రమంలో మళ్లీ ఆయన తప్పడడుగులు వేస్తున్నాడు. తాజా ఎపిసోడ్ లో అశ్విని శ్రీతో ప్రవర్తించిన తీరు.. జనాలకు విసుగు పుట్టించేలా ఉంది. ఇక ఈయన మారాడా అనేంతలా ఆయన తీరు కనిపించింది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

బిగ్ బాస్ సీజన్ 7 షోలో 2.ఓ లాంఛ్ లో ఐదుగురు కొత్త కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక కొత్తగా వచ్చిన ఐదుగురు.. సీక్రెట్ రూమ్‌కి వెళ్లొచ్చన గౌతమ్‌తోపాటు వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ అయిన ఐదుగురుతో కలిపి మొత్తం ఈ ఆరుగురిని ఒక టీమ్ గా బిగ్ బాస్ నిర్ణయించారు. ఇక పాత కంటెస్టెంట్స్ ను మరో టీంగా గుర్తించారు. కొత్తగా వచ్చిన వారిని పోటుగాళ్లు అని, పాత కంటెస్టెంట్స్ ను ఆటగాళ్లు అని డివైడ్ చేసి.. టాస్కులు పెడుతున్నారు. ఇక ఈ టాస్కులు మంగళవారం ఎపిసోడ్ నుంచి ప్రారంభం అయ్యాయి.

Amardeep Rude Behaviour With Ashwini Sri in Bigg Boss Telugu 7 Oct 11th Episode

పోటుగాళ్లు, ఆటగాళ్లు... ఎవరు ఫిట్టెస్ట్, ఎవరు జీనియస్ అనే గేమ్స్ మొన్న జరగ్గా.. ఆ రెండు టాస్కుల్లో పోటుగాళ్లే విజయం సాధించారు. ఇక తాజా ఎపిసోడ్ లో ఎవరు ఫాస్టెస్ట్, ఎవరు స్ట్రాంగెస్ట్ అనే టాస్కులు నిర్వహించారు. ముందుగా ఎవరు ఫాస్టెస్ట్ అనే పోటీలో ఆటగాళ్ల నుండి ఒకరు, పోటుగాళ్ల నుండి ఒకరు వచ్చి ''కలర్ కలర్ విచ్ కలర్ డూ యూ వాంట్ బిగ్ బాస్'' అని బిగ్ బాస్‌ అని అడగాలి. ఆ తర్వాత బిగ్ బాస్ ఇచ్చిన కలర్‌ ను బట్టి హౌజ్‌లోని ఏదో ఒక వస్తువును తెచ్చి గార్డెన్‌లో గీసి ఉన్న బాక్స్‌ లో వేయాలి.

ఇక ఈ టాస్కులో అమర్ దీప్, అశ్విని ఆడారు. ఇక బిగ్ బాస్ మొదట మెరున్ కలర్ తీసుకురమ్మన్నారు. దీంతో డోర్ మ్యాట్ తెచ్చి బాక్స్ లో వేశాడు అమర్ దీప్. అశ్విని లోపలికి వెళ్లి ఓ బాక్స్ తీసుకురావాడనికి తెళ్లింది. దీంతో అమర్ దీప్ కూడా లోపలికి వెళ్లి ఆమె బాక్స్ లాక్కునే ప్రయత్నం చేశాడు. ఇక్కడ ఆయన ప్రవర్తించిన తీరు జనాలకు చిరాకు తెప్పిస్తుంది. మరోసారి అశ్విని కోటు తీసుకురావాడనికి వెళ్లింది. అశ్వినికి కోటు వేసుకుమని సలహ ఇస్తాడు గౌతమ్. అమ్మాయి మీద చేయి వేస్తే అతనికే చెడ్డపేరు వస్తుందని అంటాడు.

Amardeep Rude Behaviour With Ashwini Sri in Bigg Boss Telugu 7 Oct 11th Episode

అయినా అమర్ వినకుండా మళ్లీ అది లాక్కూనే ప్రయత్నం చేస్తాడు. ఓ అమ్మాయి వేసుకున్న డ్రెస్సును లాగుతూ.. ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేస్తాడు అమర్దీప్. ఇలా అమర్దీప్ ఇంతలా దిగాజారిపోయడేంటి అనే ఫీల్ చూసే వాళ్లకు కలుగుతుంది. ఇక బిగ్ బాస్ కూడా బ్లాక్ చెయొద్దని ఆదేశం ఇస్తాడు. అయినా వినకుండా.. అలాగే మొండిగా ప్రవర్తిస్తాడు. ఇక బిగ్ బాస్ కే చిరాకు లేచి.. ఆ టాస్కును క్యాన్సిల్ చేస్తాడు.

Amardeep Rude Behaviour With Ashwini Sri in Bigg Boss Telugu 7 Oct 11th Episode

అయితే అమర్ దీప్ వేసుకున్న షర్ట్ కలర్ మెరున్. అది తీసుకువచ్చి అందులో వేసిన గెలిచేవాళ్లు. కానీ ఆమెతీసుకువస్తున్న వస్తువులను లాక్కోని.. ఆమెపై చేతులు వేస్తూ పిచ్చిగా బిహేవ్ చేయడం.. నెటిజన్స్ మాత్రం నెగిటివ్ గా కామెంట్స్ పెడుతున్నారు. అమర్ దీప్ బ్రెయిన్ వాడకుండా ఇలా బిహేవ్ చేస్తున్నాడేంటి అని కామెంట్స్ చేస్తున్నారు. మరి అమర్దీప్ ఈ వారం ఉంటాడో లేదో చూడాలి మరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X