Bigg Boss Telugu 7: నా తమ్ముడు.. రా అనే అంటా.. వాడికే కప్పు ఇచ్చేయండి నేనెళ్లిపోతా.. రైతుబిడ్డపై అమర్‌దీప్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన టాస్క్ లతో ఆకట్టుకుంటున్న ఈ షో.. మరికొన్ని రోజుల్లో ముగుస్తుండగా... అంతా ఆసక్తిగా షోను చూస్తున్నారు. రాత్రి 9 గంటలు అయిందంటే చాలు అంతా టీవీల ముందు వాలిపోతూ తమకు నచ్చిన వాళ్లు సపోర్ట్ చేస్తూ.. నచ్చని వాళ్లు ఎలిమినేట్ అయిపోతే బాగుండు అని కోరుకుంటున్నారు. ప్రితిరోజూ షో చూడడం వీలు కాని వాళ్లు అయితే నామినేషన్స్, వీకెండ్ ఎపిసోడ్స్ ను ఫాలో అవుతుంటారు. అవి చూస్తే షోపై ఫుల్ క్లారిటీ వస్తుందని భావిస్తారు.
అయితే 13వ వారంలో భాగంగా గౌతమ్ కృష్ణ ఎలిమినేట్ అయ్యాడు. దాన్ని అంతా జీర్ణించుకునేలోపే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అయింది. ఈ వారం నామినేషన్స్ చాలా హాట్ హాట్ గా సాగినట్లు అర్థం అవుతోంది. ఫినాలే అస్త్ర గెలుచుకున్న ఒక్క అంబటి అర్జున్ తప్ప అంతా ఈ వారం నామినేషన్స్ లోకి వచ్చేశారు. ముఖ్యంగా స్పా, స్పై బ్యాచ్ ల మధ్య వాడీవేడీగా చర్చ సాగింది. ముందుగా ప్రిన్స్ యావర్ శోభాశెట్టిని నామినేట్ చేయగా.. వీరిద్దరి మధ్య పెద్ద చర్చే సాగింది. ఫుల్ గొడవ కూడా అయింది. వీరి గొడవ కంటే కూడా అమర్ దీప్, పల్లవి ప్రశాంత్ ల మధ్య సాగిన వార్ అయితే మరింత హీటెక్కిస్తోంది.

ముందుగా అమర్ దీప్ పల్లవి ప్రశాంత్ ను నామినేట్ చేస్తూ.. మాట్లాడ్ రా అంటూ అన్నాడు. దీనికి రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ చాలా హర్ట్ అయ్యాడు. వెంటనే ఇంకోసారి నువ్వు నన్ను రా అనకు అంటూ చెప్పుకొచ్చాడు. కానీ దాన్ని వినకుండా అమర్ దీప్ అంటాను రా.. నువ్వు నా తమ్ముడివి రా అనే అంటాను... పలికితే పలుకు లేదంటే లేదు అంటూ ఫుల్ అగ్రెసివ్ అయ్యాడు. ఇలా ఈరోజుటి రెండో ప్రోమో ప్రారంభం అయింది. మధ్యలో కూడా కొట్టిన్నా, కొట్టిన్నా అంటూ మరింత ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీనికి మధ్యలో లేచి నిలబడిన శోభా... ఆరోజు చెప్పాను, ఈరోజు చెప్తున్నాను.. పల్లవి ప్రశాంత్ సేఫ్ ప్లేయర్ అంటూ వివరించింది.
ఆ తర్వాత రైతుబిడ్డ చాలా గట్టిగా మాట్లాడుతూ కనిపించాడు. అమర్ అన్న ఫస్ట్ నుంచి నా మీద నెగటివ్ యే పెట్టుకున్నడు.. అటూ చెప్పుకొచ్చాడు. అంతలోనే శోభా శెట్టి అందుకొని... పల్లవి ప్రశాంత్ మాట అంటే మాట తగ్గేదేలే అంటూ ఆయనను ఇమిటేట్ చేస్తూ చూపించింది. ఆ తర్వాత అమర్ దీప్ తో పల్లవి ప్రశాంత్ మాట్లాడుతూ... ఇది నీ నిజ స్వరూపం.. ఇదే నీ అసలు రంగు అంటూ రైతుబిడ్డ ఫైర్ అయ్యాడు. టాపిక్ ను డైవర్ట్ చేసి అనవసరంగా లాగొద్దు, తవ్వుకోవద్దూ అంటూ అమర్ అరవగా.. తవ్వుతా, బరాబర్ తవ్వుతా అని పల్లవి చెప్పుకొచ్చాడు.
ఇక చివర్లో అయితే ఫుల్ అగ్రెసివ్ అయిన అమర్ దీప్.. ఆపరా నువ్వూ నీ అబద్ధాలు అంటూ పల్లవి ప్రశాంత్ పై మరింత ఫైర్ అయ్యాడు. నువ్వే అబద్ధాలు చెబుతున్నావంటూ రైతుబిడ్డ అన్నాడు. మోసం చేసే గుణం నీది.. మోసపోయింది నువ్వు కాదు నేను అంటూ ఎమోషనల్ అయ్యాడు. అలాగే అమర్ అన్న ఎట్ల చేసిండో మీరే చూశారు అంటూ చెప్పగా.. వెనకాలే ఉన్న అమర్ దీప్ నన్ను బయటకు పంపించేయండి, వాడికి కప్పు ఇచ్చేయండి.. మీరందరూ హ్యాపీగా ఉండండి, వాడు హ్యాపీగా ఉంటాడంటూ చేసిన కామెంట్లు హైలెట్ అయ్యాయి. ఇలా ఈరోజుటి ప్రోమో ముగిసింది. పూర్తి ఎపిసోడ్ చూస్తే తప్ప ఏం జరిగిందో తెలియదు.


Click it and Unblock the Notifications











