Bigg Boss Telugu 7: రేస్ నుంచి ముగ్గురు ఔట్... టాప్‌లో అమర్ దీప్.. విన్నర్ ఎవరంటే?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రియాలిటీ షో 13వ వారం కొనసాగుతోంది. ఇక నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. టికెట్ టు ఫినాలే టాస్క్ మొదలయ్యాయి. ఇక ఇప్పటి వరకు జరిగిన ఆటల్లో ముగ్గురు కంటెస్టెంట్స్ ఔట్ అయ్యారు. ఇక వారి పాయింట్స్ మిగతా కంటెస్టెంట్స్ కు కలిపారు. ఇక అందరి కంటే టాప్ లో అమర్ దీప్ చౌదరి నిలిచాడు. ఇప్పటి వరకు ఎన్ని టాస్కులు జరిగాయి.. ఇంకా ఎన్ని జరగాలి... ఇక ఈ సారి టికెట్ టు ఫినాలే కొట్టేది ఎవరు.. ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 గత సీజన్స్ కంటే బెటర్ గా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. ఇక హౌస్ లో మొత్తంగా 19 మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టగా.. చివరకు 8 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. అందులో శివాజీ, యావర్, ప్రశాంత్, అమర్ దీప్, ప్రియాంక జైన్, శోభా శెట్టి, అర్జున్ అంబటి, గౌతమ్ కృష్ణ ఉన్నారు. వీరిలో అందరూ టాప్ 5కి అర్హులనే చెప్పాలి. వీరి మధ్య టఫ్ ఫైట్ నడుస్తుంది. ఎవరు ఫినాలేకి చేరుకుంటారు అనేది ఆసక్తిగా మారింది.

Amardeep Top and Sivaji, Shobha, Priyanka Out From Ticket to Finale Task Bigg Boss Telugu 7 Full Details Here

ఇక టికెట్ టు ఫినాలే టాస్కులు ప్రస్తుతం హౌస్ లో నడుస్తున్నాయి. ఇక ఇది సీజన్ 7 కాబట్టి 7 టాస్కులను పెట్టాడు. అందులో ఎవరు బెస్ట్ ఫెర్మామెన్స్ ఇస్తారో వాళ్లు టికెట్ టు ఫినాలే గెలుచుకుంటారు. ఈ టికెట్ టు ఫినాలే అనేది వీక్ కంటెస్టెంట్స్ కు అవసరం. ఎందుకంటే వారు డైరెక్టుగా టాప్ 5లోకి చేరుకుంటారు. అయితే నామినేషన్స్ లో సేవ్ అయితేనే చేరుకుంటారు. ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ టికెట్ టు ఫినాలే గెలిచిన నో యూజ్ అనమాట.

ఇక ప్రస్తుతం టికెట్ టు ఫినాలే టాస్కు నుంచి మొదట శివాజీ, శోభా ఔట్ అయిన సంగతి తెలిసిందే. వీరు ఔట్ కావడంతో బిగ్ బాస్ తమ పాయింట్స్ ను ఎవరికైనా ఇవ్వాల్సి ఉంటుందంటే.. శివాజీ, శోభా శెట్టి అమర్ దీప్ కు ఇచ్చారు. ఇక మరో టాస్కులో ప్రియాంక ఔట్ కావడంతో.. తన పాయింట్స్ గౌతమ్ కృష్ణకు అందించింది.

గౌతమ్ 250 పాయింట్స్ తో రాగా.. ప్రియాంకకు 180 పాయింట్స్ ఉన్నాయి. ప్రియాంక పాయింట్స్ గౌతమ్ కు యాడ్ చేయగా.. మొత్తంగా 430 పాయింట్స్ తో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక అమర్ దీప్ మొదటి స్థానంలో 450 పాయింట్స్ తో ఉన్నాడు. ఇక ఆ తర్వాతి స్థానంలో 360 పాయింట్స్ తో అర్జున్ అంబటి ఉన్నాడు. ఇక నాలుగవ స్థానంలో యావర్ ఉండగా 320 పాయింట్స్ ఉన్నాయి. ఇక ఐదో స్థానంలో ప్రశాంత్ 320 పాయింట్స్ తో ఉన్నాడు.

అయితే ఈ టికెట్ టు ఫినాలే అనేది వీక్ కంటెస్టెంట్స్ కు అవసరం. ఎందుకంటే వాళ్లు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి.. డైరెక్టుగా టాప్ 5లోకి వెళ్లిపోతారు. ప్రశాంత్, శివాజీ, అమర్ లాంటి వాళ్లకు ఇది అవసరం లేదు. అర్జున్, గౌతమ్, యావర్, ప్రియాంక, శోభా శెట్టికి ఇది చాలా అవసరం. ఇందులో టికెట్ టు ఫినాలే ఛాన్స్ అర్జున్ అంబటి లేదా గౌతమ్ కొట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు. చూడాలి ఏం జరగనుందో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X