Amardeep Wife: ప్రియాంకతో అందుకే మాట్లాడలేదు.. తొలిసారి నోరు విప్పిన తేజూ!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో అద్భుతంగా సాగుతోంది. ఎవరూ ఊహించని విధంగా టీఆర్పీని సొంతం చేసుకుంటూ ముందుకు వెళ్తున్న ఈ షోను అంతా ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే రాత్రి 9 గంటలు అయిందంటే చాలు అంతా టీవీల ముందు వాలిపోయేంత రసవత్తరంగా మార్చడంలో బిగ్ బాస్ నిర్వాహకులు ముందుంటున్నారు. ముఖ్యంగా మొదటి వారంలోనే ఇంట్లో అడుగు పెట్టిన అమర్ దీప్ గురించి కూడా అందరికీ తెలిసిందే. ఆయన హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడని తెలిసిన తర్వాత అంతా ఆయనే విన్నర్ గా నిలుస్తాని భావించారు. ఇందులో ఎలాంటి మార్పూ ఉండదని కూడా పెద్ద ఎత్తున చర్చ సాగింది.

కానీ అమర్ దీప్ రెండో వారమే రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ తో గొడవ పడడంతో విపరీతమైన నెగిటివిటీ వచ్చింది. దీంతో ఆయన కచ్చితంగా ఎలిమినేట్ అయిపోతాడని... టాప్ 5 కి కూడా రాలేడని అనుకున్నారు. కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చినప్పటి నుంచి ఆయన చేసిన తప్పులు తెలుసుకుని గేమ్ ను మార్చుకున్నాడు. ఇక ఫ్యామిలీ వీక్ తర్వాత నుంచి మాత్రం చాలా బాగా ఆడుతున్నాడు. అయితే ఫ్యామిలీ వీక్ లో భాగంగా అమర్ దీప్ భార్య ఇంట్లో అడుగు పెట్టింది. ఆ సమయంలో ఆమె ఎక్కువగా తన భర్తతోనే గడిపింది. అంతేకాకుండా ఎప్పుడూ తన భార్య వెంటనే ఉండే ప్రియాంక జైన్ తో కూడా మాట్లాడలేదు. ఆమెకు కేక్ కూడా తినిపించలేదు.

Amardeep Wife Tejaswini Shocking Comments on Priyanka And Amar Relation in Bigg Boss Telugu 7

తేజస్విని బయటకు వచ్చిన తర్వాత కూడా భర్త అమర్ దీప్ కు ఏమాత్రం సపోర్ట్ చేయలేదు. దీంతో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. భర్త అమర్ దీప్ క్యారెక్టర్ నచ్చకే ఆమె ప్రియాంకతో మాట్లాడలేదని.. ముఖ్యంగా అందుకే సపోర్ట్ చేయట్లేదంటూ సోషల్ మీడియా వేదికగా పుకార్లు లేచాయి. అయితే తొలిసారి తేజూ నోరు విప్పింది. తన భర్తకు ఎందుకు సపోర్ట్ చేయలేదో.. చెప్పుకొచ్చింది. అలాగే తన భర్త అమర్ దీప్ కు ప్రియాంక జైన్ కు మధ్య ఉన్న బంధం గురించి వివరించింది. తాను ఇంట్లోకి వెళ్లినప్పుడు ప్రియాంకతో ఎందుకు మాట్లడలేదో కూడా వెల్లడించింది.

తాను ఇంట్లోకి వెళ్లి భర్తను కలుస్తానని తెలిసినప్పటి నుంచి తన హార్ట్ బీట్ పెరిగిందని.. ముఖ్యంగా అమర్ దీప్ ను చూసిన తర్వాత తాను చాలా ఎమోషనల్ అయినట్లు వెల్లడించింది. అన్ని రోజుల తర్వాత చూడడంతో తనకు భర్తతోనే ఎక్కువగా గడపాలనిపించిందని పేర్కొంది. భర్తతో ఎక్కువ సమయం గడపేందుకు మాత్రమే తాను ఇంట్లోకి వెళ్లానని... అందుకే పక్క వాళ్లతో మాట్లాడి టైం వేస్ట్ చేసుకోలేదని స్పష్టం చేసింది. అందుకే ప్రియాంకతో కూడా మాట్లాడలేకపోయానని చెప్పుకొచ్చింది. ఇక అమర్ గురించి మాట్లాడుతూ.. షాకింగ్ విషయాలు చెప్పింది.

తన భర్త మనస్తత్వం చిన్నపిల్లాడిలా ఉంటుందని.. అది అర్థం చేసుకున్న వాళ్లు మాత్రమే ఆయనకు సపోర్టే చేస్తారని తేజూ తెలిపింది. అలాగే తాను ఎక్కువగా భర్తకు సపోర్ట్ చేస్తూ వీడియోలు చేయకపోవడానికి కారణాలు కూడా వివరించింది. ఆమె ఎలాంటి వీడియో చేసినా పెద్ద ఎత్తున ఘోరమైన కామెంట్లు వచ్చాయని... అవి చూసి తట్టుకోలేకే వీడియోలు చేయడం ఆపేసినట్లు వివరించింది. దాన్ని అంతా తప్పుగా అర్థం చేసుకున్నారని.. కానీ ఇప్పుడిప్పుడే అమర్ అంటే ఏంటో అందరికీ తెలుస్తుందని వివరించింది. మరి అమర్ దీప్ ఈ సీజన్ విన్నర్ గా నిలుస్తాడా లేదా అనేది చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X