Bigg Boss Telugu 7: అమర్ గ్రాఫ్ పెరిగే గోల్డెన్ ఛాన్స్... టాప్ 3లో ఉన్నావంటూ షోలోనే సంచలన విషయాలు లీక్!

బిగ్ బాస్ సీజన్ 7.. గత సీజన్స్ కంటే ప్రేక్షకులకు ఎక్కువగా కనెక్ట్ అవుతుంది. ఇక ఎక్కడ చూడు నలుగురు కలిస్తే.. బిగ్ బాస్ ముచ్చట్లే. అంతే కాదు ఏ సోషల్ మీడియా ఓపెన్ చేసినా.. బిగ్ బాస్ రీల్స్, మీమ్స్. అంతలా కనెక్ట్ అయిపోయింది ఈ షో. అయితే ఈ షోలో ప్రస్తుతం ఫ్యామిలీ వీక్ నడుస్తుంది. ఇక ఫ్యామిలీ వీక్ పేరు మీద బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో పాటు.. మనల్ని ఎమోషనల్ చేసి.. గుండెల్ని పిండేస్తున్నాడు. ఇక తాజాగా బిగ్ బాస్ హౌస్ లోకి అమర్ దీప్ భార్య తేజు వచ్చింది. అయితే షోలో పలు కీలక విషయాలు లీక్ చేసినట్లు తెలుస్తోంది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

బిగ్ బాస్ సీజన్ 7 ప్రస్తుతం ఫ్యామిలీ వీక్ నడుస్తుంది. 10 వారాలు సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న ఈ షో... హౌసులో ఉన్న కంటెస్టెంట్స్ కోసం.. ఫ్యామిలీ మెంటర్స్ ను తీసుకువస్తున్నాడు బిగ్ బాస్. ఇక పది వారాల తర్వాత వారి ఫ్యామిలీ మెంబర్స్ ను చూసి.. చాలా ఎమోషనల్ అయిపోతున్నారు. వారి ఎమోషన్ సీన్స్ చూసి మనం కూడా ఎమోషనల్ అయిపోతున్నాయి. ఇదిలా ఉంటే బిగ్ బాస్ తాజా ప్రోమో ఒకటి రిలీజ్ అయింది. అందులో అమర్ దీప్ కోసం.. తేజస్విని వచ్చింది.

Amardeep Wife Teju Entered And She Leaked Show Secrets in Bigg Boss Telugu 7 House

ఇప్పటికే ఈ సీజన్ లో శివాజీ కోసం అతని కొడుకు, అర్జున్ కోసం.. అతని భార్య, అశ్విని కోసం ఆమె తల్లి, బోలే కోసం.. అతని భార్య, ప్రియాంక కోసం.. ఆమె లవర్ వచ్చారు. ఇక ఈ రోజు అమర్ దీప్ కోసం.. అతని భార్య తేజు వచ్చింది. ఫ్యామిలీ మెంబర్స్‌ రాకతో కంటెస్టెంట్స్‌ లలో సంతోషం రెట్టింపు అవుతుంది. ఇక నవంబర్‌ 8న అమర్‌ దీప్‌ పుట్టినరోజు కావడంతో ఆయనకు బిగ్‌ బాస్‌ ట్విస్ట్ ఇచ్చాడు.

మొదట అమర్‌ దీప్ ను కన్సెషన్ రూమ్ కు పిలిచి... అక్కడ ఒక కేకును ఉంచుతాడు. ఈ కేకును మీ భార్య తేజు పంపించారని ఆమె రాలేదని చెప్తాడు. కొంత డల్ అయినప్పటికీ.. అమర్ ఆ కేకును తీసుకుని వస్తాడు. ఇక అప్పటికే అక్కడ తేజు వచ్చి ఉంటుంది. అమర్ ముందుకు వచ్చి ఆమె షాకిస్తుంది. దీంతో తేజశ్వినిని కౌగిలించుకున్న అమర్‌ ఒక్కసారిగా ఎమోషనల్‌ అయ్యాడు. బిగ్‌ బాస్‌ ఎంట్రీకి కొన్ని రోజులకు ముందే వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

Amardeep Wife Teju Entered And She Leaked Show Secrets in Bigg Boss Telugu 7 House

ఇక ప్రోమోలో మళ్లీ పెళ్లి చేసుకుందామా..? అని అమర్.. తేజును అడుగుతాడు. ఇద్దరు బాగా ఎమోషనల్ అయి ఏడ్చేస్తారు. కొన్ని సార్లు పడుకొని ఏడుస్తున్నాను. ఒకవేళ ఏడుస్తే కనపడుతుంది కదా అని తెలియకుండానే ఏడ్చాను అంటూ అమర్ చెప్పే డైలాగ్ చూసే ప్రేక్షకులను హత్తుకుంటుంది. ఇక తేజు.. అమర్ కోసం తెచ్చిన రింగ్ ను తోడుగుతుంది.

ఇక బిగ్ బాస్ లీక్స్ ప్రకారం.. తేజు కూడా అమర్ దీప్ గురించి లీక్స్ ఇస్తుంది. అన్ని విషయాలు చెప్పినట్లు సమాచారం. టాప్ 3లో ఉన్నావంటూ లీక్ కూడా చేసిందట. ఆటను ఇంకా బాగా ఆడాలని సూచించదని తెలుస్తోంది. ఇప్పడిప్పడే అమర్ గ్రాఫ్ పెరుగుతుంది. ఇక తేజు ఇచ్చిన హింట్స్ తో మరి ఎలా ఆడుతాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X